Biggest shopping mall in kondapur

hydarabad, Biggest Shopping mall, kondapur, Andhra Pradesh

Biggest Shopping Mall in Kondapur Hyderabad Sarath's city capital The biggest Mall in Andhra Pradesh

biggest-shopping-mall-in-kondapur.png

Posted: 10/10/2012 09:25 PM IST
Biggest shopping mall in kondapur

biggest-shopping-mall

రాష్ట్రంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ హైదరాబాద్‌లో రానుంది. ఉప్పు మొదలుకొని ఖరీదైన వస్తువులు ఒకేచోట లభిస్తాయి. శరత్స్ సిటీ క్యాపిటల్ పేరుతో హైటెక్‌సిటీకి సమీపంలోని కొండాపూర్‌లో ప్రస్తుతం ఇది నిర్మాణంలో ఉంది. 2015-16 నాటికి పూర్తి రూపం సంతరించుకోనుంది. సుమారు 15.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో ఏర్పాటవుతోంది. సింగపూర్, దుబాయి మాదిరిగా అంతర్జాతీయస్థాయిలో షాపింగ్ అనుభూతి పొందేలా మాల్‌ను తీర్చిదిద్దుతున్నారు. ముంబైలోని ఫినిక్స్ మార్కెట్ సిటీ ముంబై (40.5 లక్షల చదరపు అడుగులు), హై స్ట్రీట్ ఫినిక్స్ (33 లక్షలు), ఆర్చిడ్ ఓజోన్ మాల్ (25 లక్షలు), బెంగ ళూరులోని మంత్రి స్క్వేర్ (17 లక్షలు) , కొచ్చిలోని లులు కొచ్చిన్ మాల్ (20 లక్షలు) తదితర అతిపెద్ద మాల్స్ సరసన ఇదికూడా చేరనుంది. ఫార్మా వ్యాపారంతోపాటు విజ్ఞాన జ్యోతి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చీఫ్ పాట్రన్‌గా ఉన్న బి.శరత్ గోపాల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న స్కిల్ ప్రమోటర్స్‌ల జాయింట్ వెంచరే సిటీ క్యాపిటల్.

ప్రఖ్యాత బ్రాండ్లు..: అంతర్జాతీయ బ్రాండ్లు, దేశీయ కంపెనీలు హైదరాబాద్‌ను ‘టెస్ట్’ మార్కెట్‌గా పరిగణిస్తాయి. ఇప్పుడు అతిపెద్ద మాల్ రానుండడంతో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ దృష్టిసారించాయి. జరా, ఇండిటెక్స్, హామ్‌లేస్, డెవెన్‌హామ్స్, బోగీ అండ్ ఆల్కాట్, మేరీ క్లెయిర్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లు శరత్స్ సిటీ క్యాపిటల్‌లో అడుగుపెట్టనున్నాయి. వీటితోపాటు రిలయన్స్ ట్రెండ్స్, ఫుట్ ప్రింట్, స్పార్ హైపర్ మార్కెట్, లైఫ్ స్టైల్ వంటి 600 పైగా బ్రాండ్లు రానున్నాయి. ఈ మాల్ హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌ను ఒకవైపునకు తీసుకొస్తుందని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ డెరైక్టర్ కలిశెట్టి నాయుడు అన్నారు. భారత్‌లో తొలిసారిగా కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లు మాల్‌లో ఔట్‌లెట్లను తెరిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని చెప్పారు. బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌తోపాటు హైదరాబాద్, బెంగళూరులో పలు షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులను స్కిల్ ప్రమోటర్స్ చేపట్టింది. ఎస్.ఎం.అస్లమ్, ఎస్.ఎన్.అహ్మద్ ఈ కంపెనీకి కో-ఫౌండర్లు.


నిత్య జీవితంలో అవసరమయ్యే సాధారణ ఉత్పత్తులతోపాటు విలాస వస్తువులు ఈ మాల్‌లో లభిస్తాయి. వెస్టర్న్, క్యాజువల్, ఫార్మల్, ఎథ్నిక్, పార్టీ, వెడ్డింగ్ కలెక్షన్, జువెల్లరీ, ఫుట్ వేర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పిల్లలు, మహిళలు, పురుషులు, ఫుడ్‌ను ప్రత్యేక విభాగాలుగా విభజించి జోన్లను ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు పిల్లల జోన్‌లో వారికవసరమైన ఆట వస్తువులు, కామిక్స్, దుస్తులు, యాక్సెసరీస్ ఉంటాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సైతం మాల్‌లో షోరూంలను నెలకొల్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఏడు స్క్రీన్స్‌ను నిర్మిస్తున్నారు. లైవ్ ఐస్ స్కేటింగ్, బౌలింగ్, స్నో థీమ్ పార్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 150కి పైగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను కలిగి ఉన్న ఆసియన్ థియేటర్స్ ఇక్కడి మల్టీప్లెక్స్‌ను నిర్వహించనుంది. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు కానుంది. ఒకే సారి 2 లక్షల మంది కస్టమర్లు షాపింగ్ చేసుకునే సామర్థ్యం మాల్ ప్రత్యేకత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sbi rings in festival season
Dgca issues show cause notice to kingfisher  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles