The Best Home Remedies to get rid of Skin Problems | Pimples Tips | Beauty Tips

Best home remedies for skin problems pimples scars beauty tips

skin home remedies, skin remedies, skincare tips, pimples remove tips, pimples remedies, skin scars tips, glowing skin tips, skin problems tips, best remedies for skin, skin tone tips

Best Home Remedies For Skin Problems Pimples Scars Beauty Tips : Experts giving some home remedies to get of different types of skin problems. Those remedies helps to removie pimples, scars and many issues.

చర్మసమస్యలకు చెక్ పెట్టే చిట్కాలు...

Posted: 07/23/2015 11:48 AM IST
Best home remedies for skin problems pimples scars beauty tips

యుక్తవయస్సు వచ్చిన తర్వాత చర్మసంబంధిత సమస్యలు మొదలవుతాయి. అంటే.. మొటిమలు రావడం, నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం ముడతలు పడటం, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొంది చర్మసౌందర్యాన్ని మెరుగుపరుకోవాలంటే.. సాధారణ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే సహజమైన చిట్కాలు పాటిస్తే చాలు. చర్మసమస్యల్ని దూరం చేసుకోవడమే కాకుండా మెరుగైన నిగారింపును సొంతం చేసుకోవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా...

* ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే.. అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు, ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో తలలో చుండ్రు మాయమవుతుంది. ఈ చిట్కాని నిత్యం పాటిస్తే.. అద్భుతమైన ప్రయోజనాల్ని పొందవచ్చు.

* ఒక పాత్ర తీసుకుని అందులో గుడ్డులోని తెల్లని సొన, అర టీ స్పూన్ మీగడ, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజు విడిచి రోజు వేసుకుంటే.. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది.

* ఒక గిన్నెలో రెండు టీ స్పూన్లు రోజ్ వాటర్, ఒక చుక్క గ్లిజరిన్, 2 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దూది ఉండతో ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాయాలి. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అలాగే.. చర్మం ముడతలు పడకుండా మెరిసే సౌందర్యాన్ని అందిస్తుంది.

* ఒక పాత్రలో అరకప్పు క్యారెట్, ఉడికించిన బంగాళాదుంప గుజ్జు, చిటికెడు పసుపు, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ముడతలు తగ్గడమే కాకుండా చర్మం మృదువుగా తయారవుతుంది.

* ఒక బౌల్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ లెమన్ ఫేస్ ప్యాక్‌ను వారానికొకసారి అప్లై చేయడం వల్ల మీ చర్మం ఫెయిర్‌గా మారుతుంది.

* ఒక చెంచా గోధుమపిండి, రెండు చెంచాలా రోజ్ వాటర్ ఒక పాత్రలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్.. చర్మం రంగు మెరుగు అవుతుంది. గోరువెచ్చని పాలతో శుభ్రం చేస్తే మరింత ఉత్తమ ఫలితం పొందవచ్చు.

* తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి ముఖం మొత్తం మసాజ్ చేసి 20నిముషాల తర్వాత తడికాటన్ టవల్‌తో తుడిచేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. చర్మసమసల్ని దూరం చేసుకోవచ్చని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skin remedies  beauty tips  skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more