Best scrubs for face to get baby skin at home | beauty tips | facial creams | home remedies

Best scrubs for face to get baby skin at home beauty tips facial creams

facial scrubs, facial beauty tips, facial beauty tips, beauty tips, beauty remedies, facial remedies, face beauty tips, skincare tips, home remedies, skin home remedies, best scrubs for skin

Best scrubs for face to get baby skin at home beauty tips facial creams : Experts giving some home remedies to get baby skin at home.

బేబీ స్కిన్ పొందాలా.. అయితే ఈ చిట్కాలు పాటించండి

Posted: 07/22/2015 04:52 PM IST
Best scrubs for face to get baby skin at home beauty tips facial creams

వయస్సు పెరుగుతున్నకొద్దీ చర్మసౌందర్యం తగ్గుతూ వస్తుంది. అలాకాకుండా చర్మసౌందర్యాన్ని మెరుగుపరుచుకుని, బేబీ స్కిన్ లాంటి అందాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. రకరకాల పదార్థాలతో ఫేషియల్ స్ర్కబ్ చేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిపోయి, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతే కాదు.. చర్మంలోని రంధ్రాలను తెరచుకొనేలా చేసి వాటిని శుభ్రపరుస్తుంది.. చర్మంలోని బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది.. చర్మంలోని మురికిని, ఆయిల్ ను నివారిస్తుంది.. దాంతో చర్మంలో మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా శుభ్రం చేస్తుంది. ఈ విధంగా ప్రయోజనాలు కలిగించే ఆ స్ర్కబింగ్ చిట్కాలేంటో తెలుసుకుందామా..

గ్రీన్ టీ స్ర్కబ్ : ముందుగా గ్రీన్ టీని షుగర్ లేకుండా తయారుచేయాలి. తర్వాత దాన్ని చల్లార్చి అందులో కొద్దిగా పంచదార వేసి చిక్కగా చేయాలి. అందులోనే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేయాలి. గట్టిగా స్ర్కబ్బింగ్ లా తయారుచేసుకన్న తర్వాత ముఖానికి, మెడకు పట్టించాలి. 20నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నేచురల్ గ్లో వస్తుంది.

బొప్పాయి : బాగా పండిన బొప్పాయిలో కొద్దిగా పంచదార వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని వెంటనే ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా, ఎంతో సున్నితంగా తయారవడంతోపాటు ప్రకాశవంతంగా మారుతుంది.

కాఫీ : కొన్ని కాఫీ గింజలను రఫ్ గా పొడి చేసి అందులో ఆలివ్ ఆయిల్, తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా పట్టించి.. 15 నిముషాల తర్వాత మసాజ్ చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మొటిమలను నివారించబడుతాయి.

చాక్లెట్ స్ర్కబ్ : ఒక పాత్రలో కొద్దిగా బాదం నూనె, పంచదార వేసి కలుపుకోవాలి. అందులో కాస్త చాక్లెట్ వేసి మొత్తం వేడి చేసి, కరిగించాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఇది చర్మానికి పోషణను అందించడంతోపాటు నేచురల్ గ్లోను అందిస్తుంది.

టమోటో : ముందుగా టమోటోను మెత్తగా చేసి అందులో పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిముషాలు బాగా మర్ధన చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facial scrubs  skincare tips  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more