Best natural homemade facial scrubs for women to get beauty Face

Best natural homemade facial scrubs for women to get beauty face

facial scrubs, beauty tips, facial scrubs tips, beauty foods, best fruits for beauty, skincare tips, homemade recipes, homemade beauty tips, best fruits for skin, beauty fruits, beauty home remedies

Best natural homemade facial scrubs for women to get beauty Face : The natural homemade facial scrubs to get rid off skin problems and get glow shiny skin.

చర్మసౌందర్యానికి బెస్ట్ ఫేషియల్స్

Posted: 04/30/2015 05:44 PM IST
Best natural homemade facial scrubs for women to get beauty face

ముఖానికి ఫేషియల్ స్ర్కబ్ చేయడం వల్ల ముఖచర్మంలో వుండే డెడ్ స్కిన్ సెల్స్ తొలిగిపోతాయి. అలాగే చర్మరంధ్రాలు తెరుచుకునేలా చేసి.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. అంతేకాదు.. ఫేషియల్ స్ర్కబ్ చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేసి.. చర్మం ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది. అలాగే.. చర్మంలోని టాక్సిన్స్ తొలగించడంతోపాటు, ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ ను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఫేషియల్ స్ర్కబ్ వల్ల మొటిమలు, మచ్చలకు కారణం అయ్యే నూనె, మలినాలను నివారించబడుతాయి. తద్వారా చర్మసౌందర్యం మెరుగుపడటంతోపాటు చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి.. రకరకాలుగా వుండే వివిధ ఫేషియల్స్ ఏంటో తెలుసుకుందామా..

1. బ్లూ బెర్రీ : కొన్ని బ్లూబెర్రీ పండ్లు తీసుకొని మెత్తగా మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సర్కులర్ మోషన్ లో బాగా మర్ధన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. కాఫీ : మొటిమలకు ఇది ఒక ఉత్తమ ఫేషియల్ స్ర్కబ్. కొన్ని కాఫీ బీన్ తీసుకొని రఫ్ గా పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి పట్టించి బాగా మర్ధన చేయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బొప్పాయి : ఒక పాత్రలో బాగా పండిన బొప్పాయి ముక్కలను, కొద్దిగా తేనె, పంచదార వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. చాక్లెట్ స్ర్కబ్ : చాక్లెట్ ను కరిగించి అందులో బాదం ఆయిల్, పంచదార వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్టును చర్మానికి పట్టించి స్ర్కబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో మంచి నిగారింపు వస్తుంది.

5.  టమోటో : టమోటో చర్మానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో విటిమిన్ సి ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. టమోటో గుజ్జులో కొద్దిగా పంచదార వేసి ముఖానికి పట్టించి.. కాసేపు తర్వాత శుభ్రం చేయడం వల్ల వ్రుద్దాప్య లక్షణాలను నివారించబడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  facial scrubs  skincare tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more