Beauty tips skin glow smoothness home remedies

beauty tips, beauty tips telugu, beauty home remedies, home remedies, beauty tips telugu, beauty remedies, healthy skin remedies, skin home remedies, skin glow tips

beauty tips skin glow smoothness home remedies : Beauty home remedies which improves the skin glow and smoothness.

చర్మం తాజాగా వుండాలంటే...

Posted: 02/14/2015 05:53 PM IST
Beauty tips skin glow smoothness home remedies

ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ప్రతిఒక్కరు ఆఫీసు, గృహ కార్యకలాపాలు నిర్వహించుకోవడం నిమగ్నమైపోతారు. ఫలితంగా ఎంతో అలసట వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్మం కూడా డల్ గా తయారవుతుంది. తద్వారా చర్మసౌందర్యం క్షీణిస్తుంది. అలాకాకుండా వుండాలంటే చర్మాన్ని నిత్యం తాజాగా వుంచుకోవాలి. అంటే.. ప్రతిసారీ ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవడం కాదు! పోషక విలువలున్న పదార్థాలతో రెమెడీ చేసుకుని ముఖానికి పట్టిస్తే.. డల్ గా వుండే చర్మం ఒక్కసారిగా తాజాగా తయారవుతుంది. మరి.. ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందామా...

1. ఒక గిన్నెలో రెండు చెంచాల గంధం పొడి, ఒక చెంచా పసుపు, మూడు చెంచాల తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చల్లనీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మసౌందర్యం మెరుగుపడుతుంది.

2. ఒక పాత్ర తీసుకుని అందులో మూడుచెంచాల గంధం పొడి, రెండు చెంచాల గులాబీ నీళ్లు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత తడిపి, మర్దన చేసుకోవాలి. అనంతరం కాసేపయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మురికి తొలగిపోతుంది.

3. ఒక గిన్నె తీసుకుని అందులో అరకప్పు పుల్లటి పెరుగు, నాలుగు చెంచాల నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. దీనిని ముఖానికి రాసుకోవాలి. పదినిముషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. ముఖం మృదువుగా, చాలా సాఫ్ట్ గా మారుతుంది.

4. బంగాళాదుంపల్ని కాసేపు నానబెట్టి.. మెత్తగా గుజ్జు చేయాలి. తర్వాత ఫ్రిజ్ లో వుంచి పావు గంటసేపయ్యాక తీసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. అది పొడిగా మారిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే.. ముఖంపై మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : skin home remedies  beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more