The health and beauty benefits with honey and milk mixer remedy which prevents skin diseases

beauty tips, health tips, honey beauty tips, milk beauty tips, beauty benefits with honey, health benefits with honey, health benefits with milk, beauty health benefits with milk, beauty tips in telugu, tips of the day, health tips in telugu

the health and beauty benefits with honey and milk mixer remedy which prevents skin diseases

తేనె-పాలు కాంబోతే సింప్లీ బ్యూటీ...

Posted: 11/18/2014 06:29 PM IST
The health and beauty benefits with honey and milk mixer remedy which prevents skin diseases

తేనె-పాలు కలిపిన మిశ్రమంతో సహజత్వంతో కూడిన సౌందర్యాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడంతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చి, చాలా సాఫ్ట్ గా, మృదువుగా వుంచుతుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధుల నుంచి దూరంగా వుంచుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని చల్లగా తీసుకోవడం కంటే గోరువెచ్చగా తయారుచేసుకున్న మిశ్రమాన్ని తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. గోరువెచ్చని పాలు-తేనె  మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకుంటే.. అది జీర్ణక్రియ రేటును పెంచుతుంది. అలాగే వృధ్యాప్యాన్ని నివారించడంతోపాటు మొటిమలను మటుమాయం చేస్తుంది. ఈ తేనె-పాలు మిశ్రమంతో ఇంకా కలిగే ఆరోగ్య - సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. చర్మకాంతిని మెరుగుపరచడం : తేనె-పాలు మిశ్రమంలో యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. ఈ మిశ్రమాన్ని ఒక మాస్క్ లా వేసుకుంటే.. చర్మంపై వున్న హానికారక బ్యాక్టీరియాలను అంతమొందించి, తక్షణమే ప్రకాశవంతంగా మార్చేస్తుంది. నల్లగా వున్న ప్రాంతాలను తెల్లగా మార్చడంలోనూ ఈ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది.

2. మొటిమల నివారణ : ప్రతిరోజూ నిద్రపోవడానికి గంటముందు తేనె-పాల మిశ్రమాన్ని ముఖానికి ఒక మాస్క్ లా వేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ఇందులో వుండే పోషక విలువలు చర్మాన్ని మృదువుగా, సాఫ్ట్ గా మార్చేసి.. మొటిమలను పూర్తిగా నివారిస్తాయి. అలాగే ముఖంమీద పడ్డ నల్ల ఛారలు, మచ్చలు కూడా తొలగిపోతాయి.

3. పెదాల పగుళ్ళను అరికడుతాయి : అప్పుడప్పుడు ప్రతిఒక్కరికి పెదాల పగుళ్ల సమస్య రావడం సహజం. అటువంటి సమయాల్లో ఇతర కృత్రిమ క్రీములు వాడకుండా తేనె-పాలు మిశ్రమాన్ని పెదాలకు రాసుకుంటే... చాలా త్వరగానే మంచి ఫలితం దక్కుతుంది. పెదాలకు సహజత్వాన్ని అందించడంతోపాటు పగుళ్లను త్వరగా నివారిస్తాయి.

4. వృద్ధ్యాప్య నివారణ : ఈ రెండింటిని సరిసమానంగా ఒక కప్పులో తీసుకుని, బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిముషాల అనంతరం చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. ముడతలు, మచ్చలు, టానింగ్ తోపాటు వృద్ధాప్య సమస్య తక్షణమే తగ్గిపోతుంది.

5. మంచి నిద్ర : ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఉదయంనుంచి సాయంత్రం వరకు ఆఫీసుతోబాటు ఇంటి కార్యకలాపా పనులను ఎక్కువ నిర్వహించుకోవాల్సి వస్తుంది కాబట్టి.. ఎక్కువగా అలసిపోతారు. అప్పుడు నిద్ర కూడా సరిగ్గా రాదు. ఆ సమయంలో ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తాగితే.. ఎంతో హాయిగా నిద్రపోవచ్చు. ఇది శరీరంలో చల్లదనాన్ని ఏర్పరిచి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  health tips  milk honey mixer tips  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more