The beauty tips to get brighten skin without going beauty parlour

beauty tips, healthy beauty tips, garlic powder beauty tips, sandal beauty tips, facial packs, curd beauty tips, beauty parlours, brighten skin

the beauty tips to get brighten skin without going beauty parlour

పార్లర్ కు వెళ్లకుండానే మెరిసిపోండిలా...

Posted: 11/06/2014 04:07 PM IST
The beauty tips to get brighten skin without going beauty parlour

సాధారణంగా మహిళలందరూ తమ అందాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడం కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లడం, నాణ్యతగల క్రీములను వాడటం వంటివి చేస్తుంటారు. అయితే వీటివల్ల నాచురల్ బ్యూటీని మాత్రం సొంతం చేసుకోలేము. ఎందుకంటే.. చర్మసౌందర్యానికి కావలసిన సహజ వనరులు పార్లర్లలో, క్రీములలో వుండవు. క్రీములు కేవలం అందంగా కనిపించడానికి మాత్రమే సహాయపడుతాయి.. సహజత్వాన్ని పెంపొందించవు. అటువంటి సహజ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే... సహజవనరులు కలిగిన వున్న పదార్థాలతో కొన్ని రెమెడీస్ ని తయారుచేసుకుని.. వాటిని సమయానుకూలంగా అప్లై చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. మరి.. ఆ సహజ పద్ధతులేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. పసుపు : మీగడలో కొద్దివరకు పసుపు కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రతిరోజూ రోజూ చర్మానికి రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. అనంతరం స్నానం చేయాలి.

2. నిమ్మరసం : ముందుగా తులసి ఆకుల రషాన్ని ఒక కప్పులో తీసుకుని.. అందుకు సముపాళ్లలో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించి.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. బంగాళదుంప : ఈ దుంపలను బాగా పిండి, రసాన్ని తీసుకోవాలి. ఆ రషాన్ని ముఖానికి రాసుకున్న తర్వాత అర్ధగంట వరకూ అలాగే వుంచుకోవాలి. అనంతరం శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేస్తే.. టాన్‌ తగ్గుతుంది.

4. పచ్చిపాలు : పాలలో కాస్త పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టాలి. తర్వాత దానిని ఒక ఫ్రిడ్జ్ లో వుంచుకోవాలి. ప్రతిరోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మంపై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం నునుపుగా మారడంతోపాటు నలుపు రంగు దూరమవుతుంది.

5. శెనగపిండి : ముందుగా ఒక గిన్నెలో శెనగపిండి తీసుకుని.. అందులో నెయ్యి, పసుపు కలుపుకోవాలి. ఈ పేస్టును చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపు ఆరిన తర్వాత చేత్తో మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. అలాగే నలుపు తగ్గి.. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

6. గంధం : ముందుగా గంధం పొడిని తీసుకుని అందులో పసుపు, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్రతిరోజూ పట్టించుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

7. బాదంపాలు : నానబెట్టిన బాదంపప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచుకోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more