The healthy vegetable juices for naturally glowing skin

the healthy vegetables, beauty tips, facial beauty tips, facial packs, vegetables juices for face, face beauty tips, carrot juice, tomatto juice, brokolli juice, vegetables juices, healthy beauty tips

the healthy vegetable juices for naturally glowing skin

చర్మానికి వన్నెతెచ్చే వెజిటేబుల్ జ్యూస్

Posted: 11/05/2014 06:14 PM IST
The healthy vegetable juices for naturally glowing skin

ప్రస్తుతకాలంలో చర్మసౌందర్యానికి సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. మారుతున్న కాలక్రమంలో వాతావరణ కాలుష్యశాతం ఎక్కువగా పెరిగిపోవడంతోపాటు ఆహారాల్లో పోషక విలువలు తగ్గిపోతున్నాయి. తద్వారా మానవ శరీరం, సౌందర్యం దెబ్బతింటోంది. అయితే ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా చర్మసౌందర్యాన్ని మరింత కాంతివంతంగా, అందంగా మలుచుకోవచ్చు. సాధారణంగా వెజిటేబుల్స్ లో మానవ శరీరానికి కావలసిన ఔషధాలతోపాటు చర్మసౌందర్యానికి కావలసిన పోషక విలువలు ఎక్కువ మోతాదులో వుంటాయి. వాటిని నిత్యం తీసుకుంటూ వుంటే చర్మసౌందర్యం ఎంతగానో మెరుగుపడుతుంది. అయితే వాటిని నేరుగా కాకుండా జ్యూస్ ల రూపంలో తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. మరి ఆ వెజిటేబుల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

1. క్యారెట్ జ్యూస్ : క్యారెట్ జ్యూలస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్ ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. అలాగే ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంతోపాటు వృద్ధాప్య ఛాయలను నిర్మూలిస్తుంది.

2. టమోటో జ్యూస్ : టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే ‘‘పొటాషియం’’ మూలకం అధికంగా ఉంటుంది. అలాగే ‘‘లైకోపిన్’’ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. చర్మసౌందర్యానికి ఉపయోగపడే విటమిన్ సి కూడా పుష్కలంగా వుంటుంది.

3. బేబీకార్న్ జ్యూస్: ఫ్లూయిడ్ డైట్ ను ఎక్కువగా ఇష్టపడే వారికి ఒది ఒక హెల్తీ డైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే... ఇది అధిక క్యాలోరిక్ వాల్యు కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ఉపయోగకరమైనది. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మార్చడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

4. పచ్చిబఠానీ జ్యూస్ : పచ్చిబఠానీల్లో విటమిన్ బి6, కె పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల దీనిని శరీరానికి అత్యవసరమైన ఆహారంగా భావిస్తారు. పచ్చిబఠానీలతో తయారుచేసే జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని గ్లోయింగ్ గా మరియు రేడియంట్ గా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

5. ఆకుకూరల రసాలు : ఆకుకూరలతో తయారుచేసే రసాల్లో విటమిన్ కె పుష్కలంగా వుంటుంది. ఇది బోన్ హెల్త్ కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యం పెంపొందించడంలో ఒక ఐడియల్ ఫుడ్ గా భావిస్తారు. ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. అదేవిధంగా విటమిన్ సి-ఈ, మినిరల్స్ ,మెగ్నీసియం గొప్ప యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి... చర్మానికి హానికలిగిందే ఫ్రీరాడికల్స్ నుండి దూరంగా ఉంచుతాయి.

6. బ్రొకోలీ జ్యూస్ : ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా వుంటాయి. ఇవి హెల్తీ స్కిన్ కోసం చాలా అవసరం. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ ,న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి.. చర్మానికి ,శరీరానికి చాలా ఉపయోగకరమైనది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beauty tips  healthy tips  healthy vegetable juices  naturally glowing skin  telugu news  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more