ప్రస్తుత కాలంలో టీనేజర్స్ ఆయిల్ స్కిన్ వల్ల బాధపడుతుంటారు. దీనివల్ల చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులు, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మనం చర్మం మీద ఆయిల్ ఇలా ఉత్పత్తి అవడానికి అనేక కారణాలున్నాయి.
ఎక్కువగా ఈ సమస్య హార్మోన్ల మార్పిడి వల్ల సంభవిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంతేకాదు.. మన శరీరంలో వున్న వేడి అధికశాతం వుండడం, అలాగే స్మోక్, ప్రెగ్నెన్సీ మొదలైన కారణాల వల్ల ఆ ఆయిల్ వెలువడుతుంది.
దీంతో చర్మసౌందర్యం తగ్గిపోవడమే కాకుండా, మానవులు తమ చురుకుదనాన్ని కూడా కోల్పోతారని నిపుణులు అంటున్నారు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా వున్నాయి.
అయితే ఈ ఆయిల్ స్కిన్ ను నివారించడానికి కొన్ని చిట్కాలకు మనకు నిపుణులు అందిస్తున్నారు. అవి...
ఎగ్ వైట్... ఇందులో చాలా మోతాదులో విటమిన్లు వుంటాయి. ఇది చర్మకాంతిని పెంచడమేకాక, భర్మాన్ని బిగుతుగా చేసి, జిడ్డును తొలగిస్తుంది. ఎగ్ వైట్ ను, నిమ్మరసంలో కలిపి, ముఖానికి పట్టించుకోవాలి. ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇలా వారానికి కనీసం మూడు సార్లు అయినా చేసుకోవాలి.
నిమ్మరసం... ఇందులో సిట్రిక్ యాసిడ్ తోపాటు యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగివుంటాయి. ఈ నిమ్మరసంలో ఒక స్పూన్ అరటీ, డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
పెరుగు... ఇందులో వుండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై వున్న జిడ్డును తొలగించి, ఎఫెక్టివ్ గా చేస్తుంది. ఒక చెంచా సాదా పెరుగు తీసుకుని ముఖానికి పట్టించుకోవాలి. కాసేపు తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచింది.
టమోటో... ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా.. రక్తస్రావ పద్ధతి (ఆస్ట్రిజెంట్)ని ఆపడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో వుండే విటమిన్ సి మొటిమలు తొలగించడానికి సహాయపడుతుంది. టమోటోను రెండుగా కట్ చేసి ముఖంపై కాసేపు వుంచి, నీటితో శుభ్రం చేసుకోవాలి.
యాపిల్... ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైంది. ఎందుకంటే.. ఇందులో చాలావరకు పోషకాలు లభిస్తాయి. ఇది యాంటిసెప్టిక్, ఆస్ట్రిజెంట్, స్మూతింగ్ వంటి లక్షణాలను కలిగి వుంటుంది. ఇందులో వున్న మాలిక్ యాసిడ్స్ చర్మంమీద వున్న డెడ్ సెల్స్ ను, ఆయిల్ ను తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. యాపిల్ ముక్కలను బాగా తురిమి, పేస్ట్ ను చర్మంపై అప్లై చేసుకోవాలి. కాసేపు తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
కీరదోస.. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఇలతో పాటు పుష్కలమైన మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు వుంటాయి. ఇది చర్మంపై వుండే ఆయిల్ ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తాజాగా వుండే ఒక కీరదోసకాయను కట్ చేసే ముఖం మీద రుద్దుకోవాలి. దానిని రాత్రంతా అలాగే వుంచి, ఉదయాన్నే గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి.
పాలు... ఇందులో వుండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్ చర్మానికి ఎంతో ఉపయోగకరమైంది. ఇది స్కిన్ ను సాఫ్టగ్ గా వుంచుతుంది. పాలలో రెండు లేదా మూడు చుక్కలు లావెండ్ ఆయిల్ మిక్స చేసి, నిద్రపోయే ముందు పట్టించాలి. ఉదయం నీటితో శుభ్రం చేసుకోవాలి.
కలబంద (అలోవెరా)... ఇందులో వుండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఆయిల్ స్కిన్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. తాజాగా వుండే కలబందను ముఖానికి బాగా పట్టించుకోవాలి. ఎండిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
తేనె... తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. ఇది చర్మంలో వుండే రంధ్రాలను బ్లాక్ చేసి, సాఫ్ట్ గా చేస్తుంది. తేనెను ముఖానికి స్వల్ప మొత్తంలో పట్టించుకుని కాసేపు వరకు అలాగే వుంచుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా ఆయిల్ స్కిన్ ను అరికట్టవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more