the special story of chikkamagaluru town which is named as peaceful tourist destination in india | india best tourist spots

Special story on chikkamagaluru town which is named as peaceful tourist place in india

chikkamagaluru special story, chikkamagaluru town, chikkamagaluru tourist places, baba bhudan giri, chikkamagaluru g-point, chikkamagaluru best destinations, india best tourist spots, india tourist places, india best locations

special story on chikkamagaluru town which is named as peaceful tourist place in india : the special story of chikkamagaluru town which is named as peaceful tourist destination in india.

విశ్రాంతి తీసుకోవడానికై ప్రసిద్ధి చెందిన విహారయాత్ర స్థలం

Posted: 11/03/2015 05:22 PM IST
Special story on chikkamagaluru town which is named as peaceful tourist place in india

విహారయాత్ర.. పర్యాటకుల్ని పరవశింపచేసే ఒక అద్భుతమైన ప్రయాణం. దేశంలో కొలువైవున్న విహారయాత్ర స్థలాలను విచ్చేసేందుకు సంవత్సరం పొడవున ఎంతోమంది పర్యాటకులు విహరిస్తూనే వుంటారు. అయితే.. వీటిలో కొన్ని స్థలాలు ప్రత్యేకతల్ని కలిగివుంటాయి. కొన్ని భూతల స్వర్గ ప్రదేశాలుగా పేరుగాంచితే.. మరికొన్ని అద్భుతాలకు నిలయంగా వుంటాయి. కానీ.. వీటన్నిటికంటే భిన్నంగా ఓ యాత్రా స్థలం ప్రశాంతత, విశ్రాంతి తీసుకోవడానికి ప్రసిద్ధిగా పేరుగాంచింది. ఆ యాత్రాస్థలమే చిక్కమగళూరు పట్టణం. ప్రశాంతంగా సేదతీర్చుకోవడానికి అనువైన ఏకైక యాత్రాస్థలంగా ఈ పట్టణం పేరుగాంచింది.

‘చిక్కమగళూరు’ అంటే ‘చిన్న కూతురి ఊరు’ అని కన్నడంలో అర్థం. ఈ ఊరిని పూర్వం ఒక రాజు తన చిన్న కుమార్తెకు కట్నంగా ఇచ్చాడనే కథ ప్రచారంలో వుంది. నిజానికి చిక్కమగళూరులో చూడటానికి ప్రత్యేకించి ఏమీ లేవు కానీ.. చక్కని వ్యూ పాయింట్లకీ, ట్రెక్కింగ్ కి అనువైన స్థలంగా ముద్రపడింది. చాలా పురాతనహైన ఈ పట్టణం చుట్టుపక్కల ప్రకృతి అందాలు, సహజ దృశ్యాలు పర్యాటకులను అలరిస్తున్నాయి. దాదాపు ఈ జిల్లా ప్రాంతం మొత్తం కాఫీ తోటలు, పెద్ద పెద్ద ఎస్టేట్ లు విస్తరించి ఉన్నాయి. అందుకే.. ఈ పట్టణాన్ని ‘కర్నాటక కాఫీ రాజధాని’ అని పిలుస్తారు. అటవీ సంబంధ ప్రదేశాలు, సాహసోపేత క్రీడల ప్రదేశాలు, హిల్ స్టేషన్లు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల విహారాలు వంటి ఎన్నో మరెన్నో ఆకర్షణలను ఈ ప్రదేశం కలిగి వుంది.

Chikkamagaluru-images-01
Chikkamagaluru-images-02
Chikkamagaluru-images-03
Chikkamagaluru-images-04
Chikkamagaluru-images-05
Chikkamagaluru-images-06

ఆకర్షణీయమైన ప్రదేశాలు :

* బాబా భూదాన్ గిరి :  చిక్కమగళూరు వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశం. ఈ ప్రాంతంలోని అటవీ ప్రదేశాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఇది సుమారు 1930 మీటర్ల ఎత్తున ఉండి.. ట్రెక్కింగ్ విహారానికి అత్యంత అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. కొండ శిఖర పైభాగానికి వెళ్ళి అక్కడినుండి ప్రదేశాలను చూస్తే ఎటువంటి వారికైనా సరే ఎంతో ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ‘కురింజి' పువ్వును కూడా చూడవచ్చు.

* ముల్లాయనగరి శ్రేణులు : ఇవి పట్టణంలో అత్యధిక ఎత్తు కల శ్రేణులు. ఇది బాబా బూధాన్ గిరి లోని పశ్చిమ కనుమలలో ఉంది. ముల్లాయనగిరి శ్రేణులు సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తున ఉన్నాయి. ఉత్తరాన ఉన్న హిమాలయ శ్రేణుల నుండి దక్షిణాన ఉన్న నీలగిరి కొండల వరకు ముల్లాయనగిరి అధిక ఎత్తుకల శిఖరం. ముల్లాయనగిరి పర్వత శ్రేణుల పై భాగంలో యాత్రికులు శివ భగవానుడిదేవాలయం సందర్శించవచ్చు.

* జీ పాయింట్ : పట్టణంలో వున్న మరో అద్భుత పర్యాటక ప్రదేశం. ఇది వందల అడుగుల ఎత్తున్న కొండ మీద ఉన్నది. 30 నిమిషాల నడక మార్గం ద్వారా కొండ మీదికి చేరుకోవచ్చు. ఈ కొండ మీద నుంచి ప్రకృతి అందాలను, దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఆనందించవచ్చు.

* రాక్ గార్డెన్ : ఇక్కడ వివిధ రకాల పూవులు చూడవచ్చు. ఈ గార్డెన్ లో అందమైన సూర్యోదయ, సూర్యాస్తమ సమయాలు చూసేందుకు బాగుంటాయి. ఇక్కడికి దేశ, విదేశాలనుంచి యాత్రికులు, సాహసికులు, ప్రేమికులు అందరూ వస్తుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chikkamagaluru tourist places  india best destinations  

Other Articles