The Historical Story Of Kumbhalgarh Fort | Indian Great Wall | Historical Forts India

Kumbhalgarh fort historical special story indian great wall

Kumbhalgarh Fort, Kumbhalgarh Fort historical story, Kumbhalgarh Fort photos, Kumbhalgarh Fort images, historical story of Kumbhalgarh Fort, temples in Kumbhalgarh Fort, Kumbhalgarh Fort wikipedia

Kumbhalgarh Fort Historical Special Story Indian Great Wall : The Historical Story Of Kumbhalgarh Fort. This Is Located In Kumbhalgarh Village, Rajasamand District, Rajasthan.

శతాధిక ఆలయాలకు రక్షణగా.. ‘ఇండియన్ గ్రేట్ వాల్’!

Posted: 09/04/2015 08:22 PM IST
Kumbhalgarh fort historical special story indian great wall

దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాల్లో కుంభాల్ ఘర్ కోట ఎంతో విశిష్టమైనది. రాజస్థాన్ రాష్ట్రం, రాజసమండ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన కుంభాల్ ఘర్ లో ఈ కోట వుంది. ఆరావళి ప్రాంతంలో 36 కిలోమీటర్ల వరకు విస్తరించి వున్న ఈ కోటను 15 శతాబ్దంలో రాణా కుంభా మహారాజు నిర్మించారు. ఈ కోటలో ఏకంగా 360 ఆలయాలు, 252 భవంతులతోపాటు వీటికి రక్షణగా ‘చైనా గోడ’లాగే ఇండియన్ వాల్ వుంది. మేవార్‌ నది ఒడ్డున వున్న ఈ భారీ కోట.. 13 శిఖరాలను, వాచ్ టవర్లను, బురుజులను కలిగి ఉంది. దీనిలోనే మహారాణా ఫతేసింగ్‌ నిర్మించిన గోపుర ప్యాలెస్‌ ఉంది. అత్యంత పొడవుగా ఉండే కుంభాల్‌ ఘర్‌ కోట గోడను శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారు. గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తర్వాత రెండో పొడవైన గోడగా ఇది ప్రసిద్ధి పొందింది. ఎంతో అద్భుతంగా కనువిందు చేసే ఈ కోటలో ఆశ్చర్యానికి గురిచేసే ఎన్నో విశిష్టతలు దాగి వున్నాయి.

* ఈ కోట ప్రాంగణంలో 360 హిందూ, జైన ఆలయాలు ఉన్నాయి. వీటిలో నీలకంఠ మహాదేవుని ఆలయం ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో మహాశివుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ఉన్న ఆరు అడుగుల ఎత్తులోని శివలింగం దేశంలో ఉన్న అతి పెద్ద శివలింగాలలో ఒకటిది.

* కుంభాల్ ఘర్ కోటలోని హనుమాన్ పోల్ కు సమీపంలో వేది దేవాలయం కలదు. ఈ జైన దేవాలయాన్ని రాణా కుంభ నిర్మించాడు. ఈ ఆలయంలో జైనుల జీవన చిత్రాలను ప్రతిబింభించే విధంగా కలాకృతులు చెక్కించబడ్డాయి.

* కోటలోని పురాతన గుహలో పరశురాం దేవాలయం వుంది. ఈ ఆలయంలో పరశురామ రుషి విగ్రహం ఉంటుంది. పురాణం మేరకు పరశురాముడు ఇక్కడ ధ్యానం చేశాడని, పిమ్మట శ్రీరాముడి ఆశీర్వాదం పొందాడని చెపుతారు.

* కుంభాల్ ఘర్ లో ఉన్న అందమైన ప్యాలెస్ లలో ప్యాలెస్ ఒకటి. దీనినే మేఘాల ప్యాలెస్ అంటారు. ఈ ప్యాలెస్ లో రెండు అందమైన మహల్ లు ఉన్నాయి. చల్లటి గాలి లోనికి రావడం, వేడి గాలి బయటికి పోవడం వంటి విధానాలు ఇక్కడ గమనించవచ్చు.

కేవలం ఇవి మాత్రమే కాదు.. ఈ కోటలో చూపరులను కట్టిపడేసే మరెన్నో అద్భుతాలు దాగి వున్నాయి. ఈ కోటను సందర్శించాలంటే కేవలం ఒకరోజు సరిపోదు. 3500 అడుగుల ఎత్తులో వున్న ఈ కోట 36 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వుండటంతో.. దీనిని చూసేందుకు చాలా సమయం పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumbhalgarh Fort  Indian Historical Forts  

Other Articles