the park chennai hotels details | largest glass building india

The park chennai hotels details forbes largest glass building highest price menu

the park chennai, the park hotels, chennai park hotels, chennai park hotel details, chennai park hotels history, the park chennai history, forbes atrium list, forbes list, the chennai park hotels list, the park hotels list, indian restaurants list

the park chennai hotels details forbes largest glass building Highest Price Menu : The special story of the park chennai hotels which is listed as largest glass building in forbes 2006 atrium list.

అతిపెద్ద అద్దాల మేడగా ఫోర్బ్స్ జాబితాలో చేరిన ‘ది పార్క్ చెన్నై’

Posted: 04/10/2015 07:19 PM IST
The park chennai hotels details forbes largest glass building highest price menu

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వున్న ‘ది పార్క్ చెన్నై’ హోటల్... 2006లో ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ఆట్రీయం (అతిపెద్ద అద్దాల భవంతి) జాబితాలో చేరింది. దీంతోపాటు ఈ హోటల్ కు చెందిన ఇటాలియన్ చెఫ్ అంటోనియో కార్లుక్కియో రూపొందించిన మెనూ... భారత్ లోని అతి ఎక్కువ ధర పలికే టాప్ 10 రెస్టారెంట్ల జాబితాలో చోటు సంపాందించింది. ఈ రెండు రికార్డులతో ఈ భవంతి ప్రపంచంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు సాధించగలిగింది. ప్రస్తుతం ఈ హోటల్ ప్రఖ్యాత చలన చిత్ర నిర్మాణ సంస్థ జెమినీ స్డూడియో సమీపంలో ఉంది.

చరిత్ర :

1970 ప్రాంతంలో చెన్నైలో వున్న ‘జెమినీ పిక్చర్స్’ తన కార్యకలాపాలను తగ్గించి.. స్టూడియోలో వున్న పరికరాలను అద్దె ప్రాతిపదికన వ్యాపారం కొనసాగించింది. ఈ క్రమంలోనే 1990లో స్టూడియో ప్రాంగణంలోని ఓ మూలన రెండు పెద్ద భవనాలను నిర్మించడం జరిగింది. ఈ రెండు భవనాలనే కోల్ కతాకు చెందిన పార్క్ గ్రూపు హోటళ్ల సంస్థ 21వ శతాబ్దంలో కొనుగోలు చేసి.. వాటిని విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లుగా తీర్చిదిద్దింది. అవే ‘ది పార్క్ చెన్నై’గా పేరుగాంచాయి. 2002 మే 15లో ఈ హోటల్స్ ప్రారంభమయ్యాయి.

హోటల్ విశేషాలు :

ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ కళాత్మకమైన హోటల్ లో 127 డీలక్స్ గదులు, మరో 31 విలాసవంతమైన గదులు(లగ్జరరీ), 41 నివాస గదులు, 6 స్టూడియో సూట్లు, 5 డీలక్స్ సూట్లు, 3 ప్రీమియర్ సూట్లు, 1 రెసిడెన్సియల్ సూట్ వంటివి కలిపి మొత్తం 214 గదులున్నాయి. 601 బార్, పాస్టా-చోకో బార్, హోటల్ ఎనిమిదో అంతస్థులో అక్వా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నగరంలోని లెదర్ ఇండస్ట్రీ వారి కోసం లెదర్ బార్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అతిథుల శారీరక ధృఢత్వం, శరీర మర్ధన కోసం ప్రత్యేక వ్యాయామశాల కూడా ఈ హోటల్లో ఉంది. విదేశీ కరెన్సీ మార్చుకునే సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. అధునాతన అలంకరణతో పాటు హార్డ్ వుడ్ ఫ్లోర్ తో పార్క్ హోటల్ మొత్తం ఏయిర్ కండిషన్డ్ చేయబడింది. పూర్తి సౌకర్యాలతో కూడిన గదుల్లో మినీ బార్, బాత్ టబ్ లతో కూడిన స్నానాల గది ఉంటుంది. పార్క్ హోటల్ గదుల్లో సమాంతర తెరతో కూడిన టీవీ సౌకర్యంతో పాటు, రెయిన్ షవర్ సౌకర్యం ఉంటాయి. ఈ హోటల్లో గదులన్నీ మనసుకు ప్రశాంతను కలిగించే రంగుల్లో ఉంటాయి.

అదేవిధంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిని కలిగించే మెత్తటి ఫోమ్ తో 10 అంగులాల మందంతో కూడిన పరుపులతో బెడ్స్ ఉంటాయి. అడగడుగునా విలాసవంతంగా ఉండే ప్రతి గదిలో 2-లైన్ల టెలిఫోన్ సౌకర్యంతోపాటు గదిలో సౌకర్యవంతంగా మాట్లాడుకునేందుకు వీలుగా కార్డ్ లెస్ ఫోన్, స్పీడ్ ఇంటర్నెట్ డాటా పోర్టు అందుబాటులో ఉంటాయి. పూర్తి స్థాయిలో ఫైవ్ స్టార్ సౌకర్యాలున్న ఈ హోటల్లో ఉచిత వాహన పార్కింగ్ వసతి కలదు. ఇన్ని విలాసవంతమైన సౌకర్యాలు కలిగి వున్న నేపథ్యంలోనే ఈ హోటల్స్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఖ్యాతి లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : the park chennai  indian restaurants list  park hotels list india  

Other Articles