Meerut City History Raavan Ki Sasural | Ramayan Book

Meerut city history raavan ki sasural area ramayan book

meerut city, raavan ki sasural, meerut city updates, ramayan book, hinduism history, raavan history, ramayan raavan history, raavan ki sasural city, meerut city history, meerut city news

Meerut city history raavan ki sasural area ramayan book : According to the Ramayan Book.. Meerut City is well known as Raavan Ki Sasural. Because this region is developed by mayasur who is father in law of raavan.

‘రావణ్ కీ ససురాల్’గా ప్రసిద్ధి చెందిన ‘మీరట్’ నగరం

Posted: 04/08/2015 06:48 PM IST
Meerut city history raavan ki sasural area ramayan book

మీరట్... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా, ప్రముఖ నగరము. అత్యంత పురాతనమైన ఈ నగరం జాతీయ రాజధాని ఢిల్లీకి 70 కి.మీ దూరంలో వుంది. ఇది ఢిల్లీ తర్వాత రెండవ పెద్ద ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఆర్థికపరంగా బాగానే అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం నిజానికి ‘రావణ్ కీ ససురాల్’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే.. ‘రావణుడి అత్తగారిల్లు’ అన్నమాట! దీనికి ఈ పేరు రావడం వెనుక ఒక పురాణ కథ కూడా వుంది.

పురాణ ప్రాముఖ్యత:

రామాయణం ప్రకారం.. రావణుని మామ అయిన మయాసురుని చేత ఈ మీరట్ నగరం ‘మయరాష్ట్రం’గా స్థాపించబడింది. అంటే.. అప్పట్లో మయాసురు పాలనలో ఈ నగరం రాజధానిగా వుండేది. అందుకే ఈ పట్టణం ‘రావణ్ కీ ససురాల్’గా ప్రసిద్ధి చెందింది. ఏ విధంగా అయితే రావణుడు శ్రీలంకను ఎంతో అద్భుతంగా, అందంగా స్థాపించాడో.. మయాసురుడుగా కూడా అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అప్పట్లో విలాసవంతమైన హంగుఆర్భాటాలతో తీర్చదిద్దినట్లుగా పురాణాల్లో తెలుపుబడింది.

మీరట్ నగర విశేషాలు :

మీరట్‌లో ఓ సైనిక స్థావరం వుంది. ఇది విస్తీర్ణరీత్యా, జనాభారీత్యా భారతదేశంలో రెండవ పెద్ద సైనిక స్థావరంగా గుర్తింపు పొందింది. 1803 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్థావరాన్ని స్థాపించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం ప్రారంభమైనది కూడా ఈ ప్రాంతం నుంచే! 2007 సంవత్సరంలో మెట్రోపాలిటన్’గా ఈ నగరం ప్రకటించబడింది.

mayasur-history

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meerut city history  raavan ki sasural  ramayan book  

Other Articles