Mandya city history madavya maharishi story

mandya city news, mandavya maharshi news, mandya city history, mandavya maharshi history, mandavya maharshi photos, mandya city photos, mandya city

mandya city history madavya maharishi story : According to the mythological story.. the madya city named on the name of mandavya maharishi.

మాండవ్య మహర్షి నివసించిన ‘మండ్య’ ప్రాంత విశేషాలు

Posted: 03/03/2015 05:42 PM IST
Mandya city history madavya maharishi story

మండ్య నగరం కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రధానపట్టణం. ఇది మైసూరు నుంచి 40 కి.మీ. దూరంలోనూ, బెంగుళూరు నుంచి 100 కి.మీ.దూరంలోనూ వుంటుంది. నిజానికి ఈ నగరానికి మాండవ్య రుషి పేరుమీద మాండవ్యనగరంగా పేరొచ్చిందని విశ్వసిస్తుండగా.. విద్యావంతులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు. పురాతన శిలాక్షరాలను అనుసరించి.. ఈ ప్రాంతం పురాతన కాలం నుంచి మానవ నివాసప్రాంతంగా వుంటూ వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ.. పురాణాల్లో మాత్రం ఈ ప్రాంతానికి మాండవ్య రుషి పేరు మీద పేరొచ్చిందని పేర్కొనబడింది.

స్థలపురాణం :

పూర్వకాలంలో మాండవ్య అనే మహర్షి ఉండేవారు. ఒక ముని కుమారుడు అయిన ఆయన... నిత్యం తపస్సు సాధనలో వుండేవారు. లోకకళ్యాణం కోసం తన జీవితాంతం తపస్సులోనే గడిపేశారు ఈయన! ఎందరో అప్సరసలు ఈయన తపమును భంగం కలిగించడానికి ప్రయత్నించినప్పటికీ.. చివరికి అలసిపోయి వాళ్లు వెనక్కు వెళ్లిపోయేవారు కానీ.. మహర్షి మాత్రం తపస్సాధనలో ఉండిపోయేవారు. అంతటి తపశ్శాలి అయిన ఈ మహర్షి నివసించిన ఓ ప్రాంతానికి ఈయన పేరు మీదే మాండవ్యనగరంగా పేరుగాంచింది. అయితే.. అది కాలక్రమంలో మండ్యగా మారింది.

ఈ మాండ్య నగరాన్ని చరిత్రలో ఎందరో రాజులు పరిపాలించారు. ఇక్కడ ఎన్నో దేవాలయాలు వెలిసి వున్నాయి. ప్రజలకు ఆకర్షించే ఎన్నో పర్యాటక ప్రాంతాలు వున్నాయి. ఈ నగరానికి సమీపంలోనే జలపాతాలు, ఆకర్షణీయమైన ప్రాంతాలు.. ఇంకా ఎన్నెన్నో వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mandavya maharshi  mandya city history  mythological stories  

Other Articles