Kodanda ramalayam history imambaig well

kodanda ramalayam history, kodanda ramalayam temple news, kodanda ramalayam photos, kodanda ramalayam wikipedia, lord ram temples, ramlaxman temples, sitaram kalyanam history, imambaig well history

kodanda ramalayam history Imambaig well : The historical story of kodanda ramalayam where ram laxman and sita statues are shaped on one rock

సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

Posted: 02/28/2015 05:52 PM IST
Kodanda ramalayam history imambaig well

భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో సంతరించుకుని వున్నాయి.

స్థలపురాణం :

రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా వున్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. అలాంటి సందర్భమే ‘సీతారామ కల్యాణం’ జరిగాక కూడా ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి దుష్టశిక్షణ కోసం రాముణ్ణి ప్రార్థించగా.. ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశేషాలు :

1. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని విగ్రహాలు ఈ ఆలయంలో చెక్కబడ్డాయి. అంతేకాదు.. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదొక్కటే.

2. ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

3.  16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.

4. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇమాంబేగ్ బావి కథనం :

1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ రాజుకు ప్రతినిథిగా ఇమాంబేగ్ చెలామణీ అయ్యాడు. ఒక సందర్భంలో ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులను.. ‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’’ అని ప్రశ్నించాడు. అందుకు భక్తులు.. ‘‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు’’ అని సమాధానమిచ్చారు. దాంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది.

ఆ సమాధానం విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి భక్తుడిగా మారిపోయాడు. అలా స్వామి భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్... అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ‘ఇమాంబేగ్ బావి’గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodanda ramalayam  kadapa district  temples  sitaram kalyanam history  

Other Articles