Electric eil fish biography 650 volts power seafood

electric fish, electric eil fish, seafood items, sea animals, electric fishes, 650 volts fish, remote control fishes

electric eil fish biography 650 volts power seafood : The biography of electric eil fish which releases 650 volts power when in danger.

650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదల చేసే ఎలక్ట్రిక్ చేప

Posted: 02/20/2015 06:04 PM IST
Electric eil fish biography 650 volts power seafood

దేవుడు సృష్టించిన ఈ భూమిలో ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్మాణాలతోపాటు జీవరాశులు కూడా వున్నాయి. అందులో మానవ జన్మే ఒక అద్భుతమైన జీవరాశి అయితే.. ఇంకా ఎన్నో లక్షల ప్రాణులు ఈ జగత్తులో వెలిశాయి. అందులో ఒకటిగా విద్యుత్ చేపను చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇది ఏకంగా 650 వోల్టుల విద్యుత్ ను విడుదల చేసే శక్తిని కలిగి వుంటుంది. ఇటువంటి జీవరాశి ఈ విశ్వంలోనే మరెక్కడా లేదు. అందుకే.. వీటికి ఒక ప్రత్యేకత లభించింది.

విద్యుత్ చేప విశేషాలు :

ఈ విద్యుత్ చేప అసలు పేరు ఎలక్ట్రిక్ ఈల్. దీని శరీరం నుంచి సుమారు 650 వోల్టుల విద్యుత్ విడుదల అవుతుంది. దీని ప్రభావం ఎంత ప్రమాదమకరంగా వుంటుందంటే.. గుర్రంలాంటి పెద్ద జంతువులు సైతం కిందపడి గిలగిలకొట్టుకుంటాయి. ఇవి శత్రుజీవి నుంచి తమను తాము కాపాడుకునే సమయంలో ఈ కరెంటును విడుదల చేస్తాయి. అంతేకాదు.. ఇది వారికి ఒక రిమోట్ కంట్రోల్ లా పనిచేస్తుంది. అంటే.. దూరంగా వున్న శత్రు జీవి సంకేతాలను ముందుగానే పసిగట్టేసి, వాటిని తమ అదుపులోకి తెచ్చుకుంటాయన్నమాట!

ఇవి సుమారు 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఈ చేపల్లో మూడురకాల వోల్టేజీ ఆర్గాన్స్ వుంటాయి.  మొదటి రెండు అవయవాలు తక్కువ వోల్టేజీని ప్రసరిస్తూ పరిసరాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మూడోది మాత్రం ఎక్కువ వోల్టేజీని విడుదల చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఏ శత్రుజీవి అయినా దాడికి వచ్చినప్పుడు ఇవి దీన్ని ఉపయోగిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే.. మొదటి రెండు అవయవాలతో చుట్టుపక్కల దాగి వున్న శత్రు జీవుల్ని పసిగట్టేసి మూడో దాంతో వేటాడేస్తాయన్నమాట.

ఈ చేపల్లో దాదాపు ఆరు వేలకు పైగా ఎలక్ట్రిక్ కణాలుంటాయి. ఈ కణాలే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఒక్కో కణం 0.1 వోల్టేజి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : electic eil fish  sea animals  

Other Articles