Kotappakonda temple history telugu trikoteswara swamy

kotappakonda history, kotappakonda temple history, kotappakonda temple, kotappakonda temple photos, kotappakonda temple, kotappakonda story, trikoteswara temple, trikoteswara temple history

kotappakonda temple history telugu trikoteswara swamy : The historical story of kotappakonda temple where lord trikoteswara swamy erected.

త్రికోటేశ్వరస్వామి వెలిసిన కోటప్పకొండ ఆలయ విశేషాలు..

Posted: 02/14/2015 07:26 PM IST
Kotappakonda temple history telugu trikoteswara swamy

త్రికోటేశ్వరస్వామి ఎంతో మహోన్నతంగా వెలిసిన కోటప్పకొండ దేవాలయం గుంటూరు జిల్లా నరసరావుపేటలో వుంది. 1587 అడుగుల ఎత్తైన కోటప్పకొండలో ఈ దేవాలయం 600 అడుగుల ఎత్తులో వుంది. శాసనాల ఆధారం ప్రకారం.. ఈ ఆలయం 1172 ఎ.డి లో నిర్మించబడిందని పురావస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఆనాడు ఈ ఆలయం నిర్మాణం కోసం కొందరు రాజులు చాలా నిధులను, భూములను దానంగా ఇచ్చినట్లు చరిత్ర తెలుపుతోంది. అందులో ముఖ్యంగా శ్రీక్రిష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్దయెత్తున భూములను దానంగా ఇచ్చారు.

ఈ కోటప్ప కొండను ఏకోణం నుండి చూసినా మూడుశిఖరాలు కనపడుతుంటాయి. అందుకే.. దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ వెలిసిన స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ,విష్ణు,రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే.. ఈ కొండమీద ఒక చిన్న సరస్సు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. వివిధ జలసేకరణ ప్రణాళికల ద్వారా ఈ సరసుకు నీటిని సరఫరా చేస్తుంటారు. ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన జానపద కథ ఒకటి ప్రచారంలో వుంది. ఆ కథ క్రింద తెలుపుబడింది.

స్థలపురాణం :

పూర్వం సుందుడు, అతని భార్య కుంద్రి నివసిస్తూ వుండేవారు. వారికి ఆనందవల్లి అనే కూతురు వుండేది. ఆమె గాఢమైన దైవభక్తిని కలిగివుండటం వల్ల సాధారణ ప్రపంచం నుంచి విరక్తి కలిగి, నిత్యం శివుని భక్తిగీతాలు ఆలపిస్తూ వుండేది. ఆమె రోజూ రోజూ రుద్రాచలానికి వచ్చి శివునికి ఆభిషేకాదులు నిర్వహించి పాలు కానుకగా సమర్పించేది. వేసవికాలంలో శివునిని ఆరాధించడం కోసం రుద్రాచలానికి వెళ్లసాగింది. ఈనేపథ్యంలోనే ఓ రోజు ఆమె అభిషేకం కోసం బిందె నిండా జలం తీసుకుపోతూ.. మార్గమధ్యంలో దాన్ని ఒక రాతిమీద పెట్టి మారేడుదళాలతో మూసి వుంచింది. అప్పుడు నీటికోసమని ఒక కాకి బిందెమీద వాలింది. అంతే.. కాకి బరువుకు అది కిందకు పడి, నీళ్లు మొత్తం పడిపోయాయి. దాంతో ఆగ్రహించిన ఆనందవల్లి.. ఆ ప్రాంతానికి కాకులు రాకూడదని శాపం ఇచ్చింది. (అప్పటినుంచి ఆ ప్రదేశంలో కాకులు సంచలరించడం లేదని ఆ ప్రాంతప్రజలు చెబుతున్నారు)

తర్వాత ఆనందవల్లి తపస్సు చేయగా.. ఆమె తపముకు మెచ్చి జంగమదేవర ప్రత్యక్షమై ఆమెకు జ్ఞానం ప్రసాదించాడు. దీంతో ఆమె శివుని గురించి తపసు కొనసాగించింది. మళ్లీ ఆమె తపముకు మెచ్చిన జంగమదేవర ఆమెకు ప్రత్యక్షమై.. కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణి అయిన ఆమెను గర్భవతిగా మార్చాడు. అయితే.. ఆమె దానిని ఖాతరు చేయకుండా తపస్సు చేయసాగింది. అప్పుడు మళ్లీ జంగమదేవర ప్రత్యక్షమై.. ఇకనుంచి శ్రమపడి రుద్రాచలం రావలసిన అవసరం లేదని, తానే ఆమె వెన్నింటి వచ్చి పూజలు స్వీకరిస్తానని చెప్పి, తిరిగి చూడకుండా నివాసానికి వెళ్లమని కోరాడు. అలాకాకుండా ఆమె తిరిగిచూస్తే తాను అక్కడే నిలిచిపోతానని చెప్పాడు.

అతని ఆదేశం మేరకు ఇంటిముఖదారి పట్టిన ఆనందవల్లి కొండపై నుంచి క్రిందకు దిగుతూ బ్రహ్మాచలం వల్ల తిరిగి చూసింది. అంతే! వెంటనే పరమశివుడు అక్కడే నిలిచి, పక్కన వున్న గుహలో లింగరూపం ధరించాడు. ఆ పవిత్ర ప్రదేశమే ప్రస్తుతం కోటేశ్వరాలయంగా పిలువబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kotappakonda temple history  trikoteswara temple history  

Other Articles

Today on Telugu Wishesh