Kakatiya king ganapati devudu biography who ruled about 60 years kakatiya kingdom and developped agriculture

kakatiya kingdoms, kakatiya king ganapati deva, ganapati devudu biography, kakatiya king ganapati deva biography, kakatiya kingdoms news, kakatiya kings, ganapati devudu wikipedia, kakatiya king ganapati deva wikipedia, ganapati devudu life story, ganapati devudu life history

kakatiya king ganapati devudu biography who ruled about 60 years kakatiya kingdom and developped agriculture

6 దశాబ్దాలపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు!

Posted: 10/30/2014 04:35 PM IST
Kakatiya king ganapati devudu biography who ruled about 60 years kakatiya kingdom and developped agriculture

భారతదేశ చరిత్రలోనే పుట్టిన ఎన్నో సామ్రాజ్యాలలో కాకతీయుల సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఈ సామ్రాజ్యంలో నుంచి ఎందరో గొప్పరాజులు పరిపాలించుకుంటూ వచ్చారు. దాదాపు 7 శతాబ్దాలవరకు పరిపాలించిన ఈ కాకతీయ సామ్రాజ్యంలో ‘‘గణపతి దేవుడు’’ చక్రవర్తి కాకతీయ రాజులలోనే గొప్పరాజుగా పేరుగాంచాడు. ఈయన దాదాపు 6 దశాబ్దాలవరకు ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగునాటిని ఏకంచేసి తెలుగువారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చిన మహనీయుల్లో ఈయన కూడా ఒకడు.

జీవిత చరిత్ర :

గణపతి దేవుడు జనన-మరణ వివరాలు పూర్తిగా తెలియదు కానీ.. ఈయన 1199 నుంచి 1262 వరకు కాకతీయ సామ్రజ్యాన్ని పరిపాలించాడు. అయితే ఈయన రాజ్యానికి రావడానికి ముందు దాదాపు 12 సంవత్సరాలవరకు దేవగిరి యాదవుల చేతిలో బందీగా వున్నాడు. ఆ వివరాలను కాస్త విశ్లేషించుకుంటే... దేవగిరిని ఏలుతున్న యాదవరాజు జైత్రపాలుడు 1195లో కాకతీయ రాజైన రుద్రదేవునిని వధించి, గణపతి దేవునిని బంధిస్తాడు. ఆ సమయంలో రుద్రదేవుని తమ్ముడైన మహాదేవుడు ఓరుగల్లు కాకతీయ సింహాసనాన్ని మూడవర్షాలపాటు పాలిస్తాడు. అనంతరం బంధీగా వున్న గణపతి దేవునిని విడిపించడానికి 1198లో దేవగిరిపై దండెత్తి విజయం సాధిస్తాడు కానీ.. అతను తన ప్రాణాలను కోల్పోతాడు. అతని మరణానంతరం రాజ్యంలో అరాచకం ఎక్కువగా చెలరేగడం వల్ల అతని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.

గణపతిదేవుడు సింహాసనం అధిష్టించిన వెంటనే సేనాధిపతి రేచెర్ల రుద్రుడుతో కలిసి తన శక్తియుక్తులు ధారబోసి అరాచకం చెలరేగిన రాజ్యాన్ని తిరిగి చక్కదిద్దుతాడు. ఇతని పాలనలోనే వ్యవసాయం, వర్తకాలు బాగా అభివృద్ధి చెందాయి. ఇతను వర్తకులను ఎంతగానో ప్రోత్సాహించాడు. అందుకు నిదర్శనంగా మోటుపల్లిలో వేయించిన అభయశాసనమని చెప్పుకోవచ్చు. దాదాపు 62 సంవత్సరాలపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతిదేవుడు.. అతని పాలనావిధానం తెలుగుదేశ చరిత్రలో చెప్పుకోదగినవి. ఆనాడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. వ్యవసాయాన్ని వృద్ధిచేయడానికి, నీటీపారుదల కల్పించడానికి ఇతని సేనాని ‘‘పాకాల’’ చెరువును కట్టించాడు. అలాగే మరో సైనాని కూడా ఏకంగా గౌండ సముద్రాన్ని నిర్మించాడు. ఇలా ఎన్నోరకాలుగా గణపతిదేవుడు తన సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయడంతో ఎంతో కృషి చేశాడు.

రాజ్యవిస్తరణ :

సింహాసనాన్ని అధిష్టించిన అనంతరం గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ఎంతగానో ప్రాధాన్యతనిచ్చాడు. అందుకు అతను తెలివిగా సైనికబలంతోపాటు సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అలా తన బలాన్ని పెంచుకున్న అనంతరం 1201లో మొదటి దండ్రయాత్రలో బెజవాడను స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి తిరిగి ‘అయ్య’వంశానికి చెందిన పినచోడి పాలిస్తున్న దీవిసీమవైపుకు దృష్టిసారించాడు. తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అలాగే ఆ రాజు పీనచోడి కూతుళ్లయిన నారమ్మ, పేరమ్మలను కూడా వివాహమాడి... అతని కొడుకు జాయప సేనాని కాకతీయ గజసైన్యాధికారి నియమిస్తాడు. అనంతరం 1212లో తూర్పుతీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి, గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే దక్షిణదేశంలో వుండే కొన్ని ప్రాంతాలను కూడా తన స్వాధీనం చేసుకున్నాడు గణపతిదేవుడు!

మరికొన్ని విశేషాలు :

గణపతిదేవుడు 20 సంవత్సరాలపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని సుభీక్షంగా పరిపాలించిన అనంతరం.. రాజ్యవారసుడికోసం ఎంతగానో తపిస్తాడు. వారసుడికోసం ఆయన తన భార్యతో కొన్నాళ్లపాటు ఏకాంతంగా గడుపుతాడు. అయితే ఆమె వల్ల గణపాంబ, రుద్రమదేవి అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారసుడు కలగలేదని అతడు తన సైన్యంలో దూర్జయ అనే శూద్రతెగకు చెందిన సైన్యాధ్యక్షుడు జయపసేనాని చెల్లెళ్లయిన నారమ్మ, పేరమ్మలను వివాహం చేసుకుంటాడు. అయితే అప్పుడు కూడా ఫలితం దక్కకపోవడంతో చివరకు రాజ్యభారాన్ని 1262లో రుద్రమదేవికి అప్పగించేస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : ganapati devudu  kakatiya kingdoms  kakatiya kings  rudramadevi history  

Other Articles