The biography of famous writer tulsidas who wrote ramayan in hindi

tulsidas news, tulsidas biography in telugu, tulsidas biography in hindi, tulsidas wikipedia in telugu, tulsidas wikipedia in hindi, tulsidas ke dohe, tulsidas writings, tulsidas books, tulsidas life story, tulsidas history, tulsidas life history, tulsidas wife ratnavali

the biography of famous writer tulsidas who wrote ramayan in hindi

రామాయణాన్ని హిందీలో రచించిన తులసీదాసు!

Posted: 10/24/2014 05:55 PM IST
The biography of famous writer tulsidas who wrote ramayan in hindi

భారతదేశంలో ఆధ్యాత్మికపరంగా పుస్తకాలను రచించే ఎందరో కవులు వున్నారు. ఆనాడు రాసిన పురాణగ్రంధాలు, ఇతర గ్రంథాలయాలు దేశంలో పుట్టిన ఉత్తమ కవులు రచించినవే! అటువంటివారిలో తులసీదాసు కూడా ఒకరు. హిందీ భాష తెలిసిన ఉత్తమ కవులలో ఈయన ఒకరుగా నిలిచారు. తన జీవితకాలంలో రచించిన పుస్తకాల భారతదేశ సంస్కృతి గురించి సమాజంలో విశేష ప్రభావాన్ని చూపాయి. ఈయన శ్రీరాముని పరమభక్తుడు! రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి ఈయనే! అలాగే రాముని భక్తుడయిన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా రచించాడు. నిజానికి ఈయనను సంస్కృతంలో విరవించిన వాల్మీకి అవతారమని అందరూ భావిస్తారు.

జీవిత చరిత్ర :

ఉత్తర ప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో నివాసమున్న ఆత్మారాం దుబే - హుల్సీ దేవి దంపతులకు గోస్వామి తులసీదాసు జన్మించారు. ఈయన తన జీవిత మొత్తం రామభక్తికే అంకితం చేశారు. ఈయన అవధ ప్రాంత కవి.. అప్పట్లో ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీప ప్రాంతాలను అవధ దేశంగా పిలిచేవారు. తులసీ తన జీవితకాలంలో సంస్కృతంతోపాటు హిందీలో మొత్తం 22 రచనలు రాశారు. సామాన్య ప్రజలకు వీలుగా వుండేందుకు వాల్మీకి రామాయణాన్ని హిందీలో రచించిన ఈయన.. దానికి శ్రీరామచరితమానస్ గా నామకరణం చేశారు. దీని రచనా కార్యక్రమాన్ని శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలోనే చేపట్టారు. ఈ గ్రంథం పూర్తి కావడానికి రెండు సంవత్సరాల ఏడునెలలు పట్టింది. గ్రంథంలో ఎక్కువ భాగం రచనను వారణాసిలో చేశాడు. అందుకే.. ఈయన తదనంతరం అక్కడ ‘‘తులసీ ఘాట్’’ ఏర్పడింది.

వ్యక్తిగత జీవితం :

తులసీదాసు జన్మించిన కొన్నిమాసాల తర్వాత తన తల్లిని కోల్పోయారు. తర్వాత కొంతకాలంలోనే తండ్రిని పొగొట్టుకున్నారు. దాంతో అతని పోషణ బాధ్యత మొత్తం వృద్ధురాలైన నాయనమ్మ భుజాలమీదే పడింది. బాల్యంలో వున్నప్పుడు అతను రామబోలా లేదా రమోలా అని పిలువబడేవాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యేకొద్దీ పాండిత్యంలోని వివిధ శాఖల్లో ప్రావీణ్యం సంపాదించాడు. తర్వాత దీనబంధు వధుకుని పుత్రిక అయిన రత్నావళిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ తారావతి అనే కుమారుడు జన్మించాడు. అయితే ఆ పుత్రుడు బాల్యంలోనే మృతిచెందాడు. పెళ్లయిన 15ఏళ్ల తర్వాత రత్నావళి రక్షాబంధనం కోసం బదిరిలో వుండే తన సోదరుల ఇంటికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు తులసీ కూడా 9 రోజులపాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్లాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్యలేకపోవడంతో తీవ్ర ఒంటరితనానికి లోనయ్యాడు. అంతే! వరదల్లో వున్న గంగానదిని ఈది అతికష్టం మీద అర్థరాత్రి తన మామగారి ఇల్లు చేరుకున్నారు.

తాను ఈ విధంగా దాటి రావడంతో ఎంతగానో సంతోషించిన రత్నావళి.. ‘‘నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. కనుక కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు సహాయ పడుతుంది’’ అని చెప్పింది. ఈ మాటలు విన్న తులసీదాస్ మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. అతను తక్షణమే బదరీని విడిచిపెట్టాడు. ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. అతనిని ఎంత వెదికినా జాడ దొరకలేదు. దీంతో భర్తలేని కారణంగా రత్నావళి తన సుఖాలన్ని వదులుకుని వైరాగ్య జీవితాన్ని గడిపింది. అటు తులసీదాస్ బదిరి నుంచి వెళ్లిన అనంతరం దేశదిమ్మరి అయిన ఒక సంగీత పాటకునిగా, కొన్ని సమయాల్లో అద్భుత క్రియలు చేస్తూ జీవితం కొనసాగించాడు. కొంతకాలంపాటు చిత్రకూటంలో, అయోధ్యలో నివసించాడు. వారణాసిలో వున్న సమయంలో ఈయన అక్కడ సంకటమోచన్ దేవాలయాన్ని కట్టించారు. ప్రస్తుతం ఇది హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tulsidas  telugu famous writers  telugu spiritual writers  valmiki  

Other Articles