The biography of madhura town where srikrishna spent his child and teenage life

madhura town, madhura tourism, madhura history, madhura sri krishna, lord sri krishna history, madhura lord krishna news, madhura tourism spots

the biography of madhura town where srikrishna spent his child and teenage life

శ్రీకృష్ణుడి జ్ఞాపకాల నిలయంగా వున్న ‘‘మధుర’’ ప్రాంతం!

Posted: 10/10/2014 03:30 PM IST
The biography of madhura town where srikrishna spent his child and teenage life

సంస్కృతీ - సంప్రదాయాలకు నిలయంగా నిలిచిన మన భారతదేశంలో ఇప్పటికీ ప్రాచీన కాలానికి సంబంధించిన విశేషాలను కలిగివున్న ప్రాంతాలు ఎన్నో వున్నాయి. అందులో మథుర నగరం ఒకటి! ఈ నగరానికి ఎప్పటినుంచే బ్రాజ్ భూమి లేదా అంతులేని ప్రేమ కల భూమిగా అభివర్ణించడం జరుగుతోంది. ఎందుకంటే.. పురాణకథనాల ప్రకారం శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని, ఎదిగే వయస్సును ఇక్కడే గడపడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని పేర్కొంటుంటారు. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడి రాసలీలలకు సంబంధించిన ఎన్నో కథనాలు హిందూపురాణాల్లో పేర్కోవడం జరిగింది. అంతేకాదు.. ఆయన దేవాలయాలు, భజనలను, అనేక కలాక్రుతలను శ్రీకృష్ణుడిపేరుపై ప్రచారాలు చేసుకుంటూ. తనివితీరా ఆనందిస్తూ వుంటారు. వాస్తవానికి హిందూ మత కలాక్రుతులలో శ్రీ కృష్ణుడి రాస లీలలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా కనపడుతూంటాయి. మథుర, దాని చుట్టూ పక్కల 16వ శతాబ్దంలో నిజమని కనుగొనే వరకూ శ్రీకృష్ణుడి లీలలు మిధ్య అనే నమ్మేవారు అందరూ!

8వ శతాబ్దానికి ముందు ఈ పట్టణం మొత్తం బౌద్ధులకు సంబంధించినదిగా వుండేది. బౌద్ధమతానికి చెందిన అనేక బౌద్ధ ఆరామాలు, వాటిలో 3,000 మంది బౌద్ధ సన్యాసులు వుండేవారు. అయితే 8వ శతాబ్దం తరువాత శ్రీకృష్ణుడు - ఆయన ప్రియురాలు రాధ ఇద్దరికీ సంబంధించిన అనేక దేవాలయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచి ఈ పట్టణం హిందువులకు ఆలయంగా మారిపోయింది. దీంతో ఈ పట్టణం హిందువులకు ప్రధాన యాత్రాస్థలంగా వుండేదని కొన్ని పురాణకథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ఆఫ్ఘన్ యుద్ధ ప్రభువు మహమ్మద్ గజనీ, అనంతరం ఔరంగజేబ్ 16వ శతాబ్దంలో ఈ పట్టణంపై దండేత్తి.. ఇక్కడున్న అనేక ప్రసిద్ధ దేవాలయాలను.. అక్కడ నిర్మించిన మసీదులతోసహా ధ్వంసం చేశారు. భారతీయ సంస్కృతి, నాగరికతలకు కేంద్రంగా వుండే ఈ పట్టణం యమునా నది ఒడ్డున వుంది. మధురను హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పవిత్రంగా భావిస్తారు. దేశంలోవున్న చాలామంది పర్యాకులు ప్రశాంతంగా గడపడానికి ఇక్కడున్న ఆశ్రమాలకు వచ్చి ఆనందంగా తమ సమయాన్ని కేటాయిస్తారు.

మధురలో వున్న ఆకర్షణీయమైన ప్రాంతాలు :

మధురలో శ్రీ కృష్ణ జన్మ భూమి టెంపుల్ చాలా పవిత్రంగా భావిస్తారు. మధుర ఆకర్షణ అంతా కృష్ణుడితో ముడిపడి వుంది. ఇక విశ్రాం ఘాట్ ప్రదేశానికి వస్తే.. ఇక్కడ శ్రీకృష్ణుడు తన మేన మామ కంసుడిని వధించిన తర్వాత.. కొంత సమయం విశ్రాంతి పొందాడట. ఇక్కడ కల ద్వారకదీష్ టెంపుల్ ప్రధాన టెంపుల్. హిందూ పండుగలలో ఈ టెంపుల్ ను అతి వైభవంగా అలంకరిస్తారు. హిందువుల పండుగలు అయిన, జన్మాష్టమి, గీతా మందిర్ వంటివి అతి వైభవంగా ఆచరిస్తారు. క్రి.శ.1661లో నిర్మించిన జామా మసీదు కొంత వరకూ ఇక్కడ కల ముస్లిం జనాభాను సూచిస్తుంది.

ఇక్కడ డేమ్పియర్ పార్క్ లో కల ప్రభుత్వ మ్యూజియంలో గుప్తుల కాలం నుండి కుషాన్ రాజుల కాలం వరకూ అంటే సుమారు క్రి.పూ.400 సంవత్సరాల నుండి క్రి.శ.1200 సంవత్సరాల వరకూ సేకరించిన అనేక చారిత్రక అంశాలు వుంటాయి. ఇంకా ఇక్కడ కల ఆకర్షణలలో కాంస్ కిలా, పోతన కుండ్, మధుర లోని ఘాట్ లు అనేకం కలవు. మధురకు వెళ్ళేటపుడు, పక్కనే కల బృందావనం నగరం కూడా తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhura  lord sri krishna  madhura tourism  telugu news  

Other Articles