The hyderabad city features which is called as pearl city

hyderabad city news, hyderabad pearl city, charminar news, baramati masjid hyderabad, makka masjid hyderabad, birla mandir hyderabad, hussain sagar hyderabad, historical structures hyderabad, golconda fort

the hyderabad city features which is called as pearl city

ముత్యాలనగరంగా పేరొందిన హైదరాబాద్ విశేషాలు!

Posted: 10/14/2014 05:54 PM IST
The hyderabad city features which is called as pearl city

మన భారతదేశంలో పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒక్కటి! అయితే ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కు ఒక ప్రత్యేకమైన విశిష్టత వుంది. అదేమిటంటే... చారిత్రక వైభవం నిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా రంగురంగులుగా దర్శనమిస్తుంటాయి. పురాతన నవాబుల కాలంనాటి స్మారకాలు, పురాతన భవనాలు, వీధులలో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన చారిత్రాత్మక కట్టడాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తాయి. కేవలం కట్టడాలు మాత్రమే కాదు.. ఇతర వ్యవహారాల్లోనూ హైదరాబాద్ కు ఒక ప్రత్యేక పేరు వుంది. ఇరానీ చాయ్, హైదరాబాది బిర్యాని ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచింది. అపురూపమైన ప్రదేశాలతోపాటు అద్భుత కట్టడాలు గల హైదరాబాద్ మరికొన్ని విశేషాలు

1.  చార్మినార్ : ఈ పేరు చెబితే చాలు... ఎవ్వరైనా హైదరాబాద్ నగరం పేరు ఇట్టే చెప్పేస్తారు. హైదరాబాద్ పాతబస్తీలో వున్న ఈ పురాతన కట్టడం నేటికీ అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. నగరంలోనే ఒక ప్రముఖమైన ఆకర్షణగా నిలిచిన ఈ ఛార్మినార్ చుట్టూ షాపింగ్ చేయడానికి అనువుగా వీధుల్లో ఎన్నో దుకాణాలు ఎంతో అందంగా కనువిందు చేస్తాయి. ఇక్కడ ఎన్నో రకాల వస్తువులు అందుబాటులో వుండటంవల్ల ఆ ప్రాంతం మొత్తం జనాలతో కిక్కిరిసి వుంటుంది.

2. మక్కా మసీదు : అతి పురాతనమైన ఈ మసీదు రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులతో ఎంతో అందంగా వెలిగిపోతూ వుంటుంది. ఇది చార్మినార్ కి అతిచేరువలోనే వుంటుంది. చాలాపురాతనమైన ఈ మసీదు.. నేటి కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులను చోటు చేసుకుంది.

3. హైదరాబాద్ నగర చరిత్రను తెలిపే కొన్ని అద్భుతమైన కట్టడాల్లో కుతుబ్ షాహి నవాబుల సమాధులు గోపురాలు ఒకటి! ఇవి చాలా పురాతనమైన కట్టడాలు. ఇవి చూడటానికి చాలా అందంగా, ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి.

4. బిర్లా మందిరం : ఇది పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షించే ఒక అద్భుతమైన కట్టడం. ఒక చిన్న కొండపై తెల్లని మార్బుల్ రాతితో నిర్మించిన ఈ బిర్లా మందిరం.. పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేసేస్తుంది.

5. హుస్సేన్ సాగర్ : హైదరాబాద్ లోని ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఇది ఒకటి! ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి దేశం నలుమూలలనుంచి ఎంతోమంది పర్యాటలకు వస్తుంటారు. సాయంత్రంవేళ ఇక్కడ బోటింగ్ ఎంతో అందంగా, ఆనందంగా వుంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో మెరిసే నీరు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది.

6. హైదరాబాద్ నగరంలో కొన్ని విశేషమైన దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తాయి. అందులో గోల్కొండ ఒకటి! ఇది ఎంతో పురాతనమైన కట్టడం కాబట్టి.. ఎంతోమంది పర్యాటకులు ఇక్కడ సందర్శిస్తుంటారు. ఈ కోటపై నుంచి దృశ్యాలు ఎంతో ఆకర్షణీయంగా కనబడుతాయి.

7. బారామతి మసీదు : రాతిగోడలతో నిర్మించిన ఈ పురాతన కట్టడంలో పచ్చని ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి.

8. సీతారాంబాగ్ టెంపుల్ : చాలా పురాతనమైన ఈ ఆలయం మైదరాబాద్ లోని మంగళ్ ఘాట్ ప్రాంతంలో ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. ఇది రాజస్థాని, మొఘల్, యూరోపియన్ తదితర స్టైల్ లో కనువిందు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad city  pearl cities  golconda fort  charminar  hussain sagar  

Other Articles