Information about munnar in kerala

Munnar situated at the confluence of three mountain streams is one of the most popular hill stations located in Idukki district, Kerala. Eravikulam National Park, Anamudi peak, Mattupetty, Pallivasal, Chinnakanal, Anayirangal, Top Station, Tea Museum are some of the major tourist spots in Munnar

Munnar situated at the confluence of three mountain streams is one of the most popular hill stations located in Idukki district, Kerala. Eravikulam National Park, Anamudi peak, Mattupetty, Pallivasal, Chinnakanal, Anayirangal, Top Station, Tea Museum are some of the major tourist spots in Munnar

భూతల స్వర్గం మున్నార్

Posted: 08/05/2013 06:57 PM IST
Information about munnar in kerala

ఈ భూ ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మున్నార్ ప్రాంతం ఒకటి. మున్నార్‌ని క్వీన్‌ అఫ్‌ గాడ్గ్స్ ఓన్‌ ల్యాండ్స్ అంటారు, నిజంగానే ఈ ప్రదేశం భూతల స్వర్గమే. మున్నార్‌ ప్రదేశం నీలాకాశంతో నిగ నిగలాడుతూ, పచ్చదనాన్ని సంతరించుకొని దేశ విదేశ వాసులకు ఆహ్వానం పలుకుతోంది. సూర్యోదయం, సూర్యాస్తమయమున సుమనోహరమైన దృశ్యాలతో విరాజిల్లుతూ, సముద్ర తీరాలూ, సెలయేటి గలగలలు తేయాకు తోటల పరిమళాలతో సంతరించుకున్న ఈ స్థలం ప్రతి ఒక్కరినీ మైమరిపిస్తుంది. 

మున్నార్‌లో చూడదగ్గ ప్రదేశాలు ఏంటంటే... మున్నాట్‌ సీ.టీ.సీ టీ, టీ మ్యూజియం, అడవి జంతువులూ, మంచి సీనరీస్‌, వ్యూ అఫ్‌ తమిళనాడు, కుండలినీ డ్యాం, గంధపు చెక్కల అడవులు, సినిమా షూటింగ్‌ స్పాట్లు, నీలగిరి తారు, అందమైన కొండలు, టీ ఎస్టేట్లు, ఎత్తయిన జలపాతాలు, మసాజ్‌ సెంటర్లు, నోరూరించే ఆహార పదార్థాలు. ఇవన్నీ గాక ఇంకా మరెన్నో ఈ స్థల విశేషాలు హనీమూన్‌ జంటలను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హాలిడే ను గడపడానికి మున్నార్‌ ఒక అత్యద్భుత ప్రదేశమనే కొనియాడవచ్చు.మున్నార్‌ అందాలను చూసిన వారెవరికైనా కవిత్వం పొంగుకొస్తుంది. ప్రతి దృశ్యం ఒక అద్భుతమే. కొచ్చి, బెంగళూరు వాసులు మున్నార్‌ కు ఒక వీకండ్‌ ట్రిప్‌ లాగా రావచ్చు. కొచ్చి నుంచి మున్నార్‌ కు వెళ్ళే మార్గమధ్యలో ఎతైనచెట్లు ఇరుకైన రోడ్లు కనువిందు చేస్తూ దారిలో కిలోమీటర్ల పొడవునా టీ ఎస్టేట్‌లను చూసి ఆనందించవచ్చు. మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రతి మలుపులో అందమైన దృశ్యాలను మీ కెమెరాలలో బంధించవచ్చు. ఒక రోజంతా మతుపెట్టి రోడ్‌ను చూడడానికే గడపవచ్చు.

ఇక్కడ మతు పెట్టి డాం, స్పీడ్‌ బోటింగ్‌లలో ఎంజాయ్‌ చేయవచ్చు.సాయంకాలం మున్నార్‌లోని మార్కెట్‌లో గడపడానికి టూరిస్టులు ఇష్టపడతారు. అక్కడ దొరికే వివిధ ఆట బొమ్మలు, అమ్మాయిలకు కావాల్సిన నిత్య అలంకార, వివిధ సామగ్రి లభ్యమగును. మార్గంలో ఉన్న టాటా మ్యూజియంలో మున్నార్‌ విశేషాలను టీ తోటల గురించిన ఆసక్తికర విషయాలను పొందుపరచారు.మున్నార్‌ కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన పర్వతశ్రేణుల నడుమన వెలసి ఉంది. తమిళంలో మను అంటే మూడు ఆరు అంటే నది. ఇక్కడ మధుర పూజా, నల్ల తన్ని, కుండలిని అనే నదులు సంగమిస్తున్నందుకే ఈ స్థలానికి మున్నార్‌ అనే పేరు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles