Horsetail fall

Horsetail Fall, Horsetail Falls, falls, waterfalls, fire, fire fall, firefall, Glacier Point

Horsetail Fall, Horsetail Falls, falls, waterfalls, fire, fire fall, firefall, Glacier Point

హార్స్‌టెయిల్‌ వాటర్‌ఫాల్స్‌

Posted: 07/29/2013 08:41 PM IST
Horsetail fall

అదొక అద్భుత జలపాతం... ఏటా కొన్ని రోజులు మాత్రం ఆ జలపాతంలో ఓ అద్భుతం చోటు చేసుకుంటుంది. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి ఏటా వేలల్లో పర్యాటకులు విచ్చేస్తుంటారు. ప్రపంచ పర్యటకులు వచ్చి చూస్తారు. అదే హార్స్‌టెయిల్‌ జలపాతం. ఇంతకీ ఆ అద్భుతంఏంటో తెలుసుకోవాలని వుందా? మరింకెందుకాలస్యం పదండి హార్స్‌టెయిల్‌ వాటర్‌ఫాల్స్‌ చూసొద్దాం..!

ఉత్తర అమెరికా ఖండంలో ప్రతి ఏటా రెండు వారాలు మాత్రమే... హార్స్‌టెయిల్‌ జలపాతం వద్ద ఓ అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. ఇంతకీ ఆ అద్భుతం ఏంటంటే... ఆ జలపాతం నుండి జలజలా జాలువారే నీరు మంటల్లా కనిపిస్తాయి. పైనుండి జలజల దూకే జలపాతం ఇలా కాంతిపుంజాల్ని విరజిమ్ముతోందేమిటి? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడే ముందు ఇది ఎప్పటి కథనో చూద్దాం. 1960 నాటి మాట. బహుశా అంతకు మునుపేనేమో? ఇదమిత్థంగా తెలీదు. ఇది అసలు జలపాతం కాదు. మానవుడు సృష్టించిన అభూత కల్పన. యోసేమైట్‌ పార్క్‌లో ఎత్తయిన శిఖరాలపై నుంచి మందుగుండు సామాగ్రిని పేల్చి - గలగల దుమికే అగ్ని శిఖల్ని దొర్లించటం ఇక్కడి ప్రత్యేకత. గ్లేసియర్‌ పాయింట్‌ మొదలుకొని పేల్చే ఫైర్‌వర్క్‌‌స అనతికాలంలోనే ప్రాచుర్యం పొంది ఉన్నట్టుండి అదృశ్యమైపోవటానికి కారణం - ఇది ప్రమాదభరితమైన అంశం కావటమే. అడపాదడపా యోసేమైట్‌ పార్క్‌ వచ్చి వెళ్లే సందర్శకులను మరింత ఆకర్షించటానికి ఈ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఫిబ్రవరిలో రెండు వారాలపాటు జరిగే ఈ తంతు ఆ లోయకే కొత్త అందాల్ని తెచ్చిపెట్టాయి. అందుకే ముద్దుగా ‘హార్స్‌టెయిల్‌ ఫాల్‌’ అంటూ స్థానికులు పిలుచుకుంటూంటారు.

అయితే ఎప్పుడుపడితే అప్పుడు వెళితే ఆ దృశ్యాన్ని చూడలేం. ఏడాదిలో కేవలం రెండు వారాలు మాత్రమే అవకాశం. ఆ రోజుల్లో సూర్యుడు అస్తమించేటప్పుడు కొద్ది క్షణాల పాటు నీళ్లన్నీ కిందికి దూకుతున్న మంటల్లా మారిపోతాయి. సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో పడేటప్పుడు జరిగే వింత ఇది. అందుకే దీన్ని ‘పైర్‌ ఫాల్స్‌’ ని కూడా అంటారు.యోస్‌మైట్‌ జాతీయ పార్కులో ఎల్‌క్యాపిటన్‌ అనే కొండపై నుండి పడే ఈ జలపాతం కేవలం కొన్ని ఋతువుల్లో మాత్రమే ఏర్పడుతుంది.ఏటా ఫిబ్రవరి చివరి రెండు వారాలు మాత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ జలపాతం రంగులు మారిపోతాయి. తెల్లని నీళ్ల ధార క్రమంగా బంగారు రంగులోకి మారుతుంది. కాసేపటిలోనే ఎరుపు రంగును పులుముకుంటుంది. అప్పుడు మంటలు దూకుతున్నట్టే అనిపిస్తుంది.
ఆ రెండు వారాల కోసారి దేశదేశాల నుంచి వేలాది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఫొటోలు తీసుకుంటారు. అంతేకాదండోయ్‌ ఈ కొండ ప్రపంచంలోనే అతి పెద్ద గ్రానైట్‌ కొండ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles