Anjaneya swamy

Sri Anjaneya Swamy, anjaneya swamy, Lord Hanuman, srirama, power,

anjaneya swamy

శక్తి స్వరూపం కొలువయ్యి ఉన్న ప్రదేశాన్ని అన్వేషిద్దాం

Posted: 05/21/2013 03:25 PM IST
Anjaneya swamy

ఆంజనేయ స్వామిని ప్రార్ధిస్తే , భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని అందరి నమ్మకం . అందుకే , ఏ సంఘటన వల్ల కాని , ప్రమాదం ఎదురైనప్పుడు కాని , అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు కాని , 'ఆంజనీయ ' అంటూ మనం ఆ స్వామిని తలుచుకుంటాం , సమస్యను ఎదురుకునే శక్తిని ప్రసాదించమని కోరుకుంటాం , ధైర్యాన్ని మనకు ఇవ్వమని ప్రార్దిస్తాం . అందుకే , రామ భక్తుడైన ఆంజనేయ స్వామీ , దైవ స్వరూపంగా , శక్తికి , ధైర్యానికి ప్రతీకగా కొలవబడుతున్నాడు .

మరి ఇటువంటి దైవ స్వరూపం కొలువయ్యి ఉన్న ఆలయాలు , ప్రదేశాల ప్రాముఖ్యతలు చాలానే ఉన్నాయి . ఇటువంటి ఆలయాల్లో ప్రత్యేకమైనది , ప్రకాశం జిల్లా అడ్డంకి దగ్గర్లో ఉన్న శింగరకొండలో ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం .

మరి ఈ ఆలయ విశిష్టతను అన్వేషించాలి అంటే , స్థల పురాణం గురించి తెలుసుకోవలసిందే ...

శింగరకొండపై లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో ఒక మహా యోగి ఆ గ్రామానికి విచ్చేసి, కొండ దిగువన చెరువు గట్టున ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడం కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది.

దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నృసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు.

కేవలం భయం అనే రాక్షసి నుండి పీడింపబడటమే కాక , జీవితం లో విజయం సాధించెంతటి ధైర్యం సొంతం చేసుకోవాలన్నా కూడా , ఆంజనేయ స్వామీ ఆరాధనే శరణ్యం . మరి ఈ భగవత్స్వరూపం కొలువయ్యి ఉన్న ఒకానొక ఆలయాన్ని , ఆ ప్రదేశాన్ని ఇవాళ అన్వేషించాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles