Seychelles tourism and informatin

Seychelles vacations, Seychelles tourism, Seychelles packages, Seychelles vacation packages,

Seychelles islands offering everything you need to plan for your holiday in our tropical paradise islands

Seychelles tourism and informatin.png

Posted: 12/11/2012 11:55 AM IST
Seychelles tourism and informatin

Seychelles

నీలాలరాశుల మధ్య... మరకతంలా మెరిసే దేశం ఇది. ఆఫ్రికా ఖండం నుంచి రాలినట్లుండే ఈ నేల పలుకులు... పచ్చదనపు లోగిళ్లు. చందమామ కథలోని రాజకుమారుడు... రెక్కల గుర్రం మీద చుట్టి వచ్చిన దీవులివి. బాలమిత్ర కథలోని రాజకుమారి... విహరించిన పగడపు దీవులూ ఇవే. మన రాష్ట్రపతులు ముచ్చటపడి... మరీ పర్యటించిన దేశం ఇది. మమ్మల్ని కడుపులో దాచుకుంటున్నది ఇండియన్ ఓషనే కాదు... ఇండియా కూడ! అని మురిసిపోయే ప్రజలున్న దేశం !! సీషెల్స్... నగరం విశేషాలను గురించి తెలుసుకుందాం.

సీషెల్స్ దేశం దీవుల సమూహం. ఈ దీవులన్నీ హిందూమహాసముద్రంలో ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉంటాయి. ఇక్కడ స్థిరపడిన వారిలో ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువ. ఇక్కడి భారతీయులు తమిళులు, గుజరాతీలు, తెలుగువాళ్లు మాత్రమే. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లలో హైదరాబాద్ వాళ్లు ఎక్కువ. ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ ఉండవు, చిన్న క్లినిక్‌లు, కనీస సౌకర్యాలున్న ఒక మోస్తరు హాస్పిటల్‌లున్నాయి. ఇక్కడ టూరిజం ఆధారంగా డెవలప్ అయిన హోటల్, రెస్టారెంట్ వంటి ప్రైవేట్ వ్యాపారాలు ప్రధానమైనవి. ఇక్కడ ఆహారపంటలేవీ పండించరు, సాగు చేసే పరిస్థితులూ లేవు. మామిడి, పనస చెట్లు వాటి కవి మొలిచి కాయలు కాస్తుంటాయి. ఇక్కడ ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క చెట్లు పెరుగుతాయి.

పురాతన కాలంలో స్థానికులు సముద్రంలో చేపల వేట మీద బతికేవాళ్లు, మరికొంత నైపుణ్యం ఉన్నవాళ్లు పగడాల అన్వేషణతో ఉపాధి పొందేవాళ్లు. మడులు, గుంటలు చేసి సముద్రపు నీటితో చేపలు పెంచుతున్నారు. ఇక్కడికి అన్ని ఖండాల నుంచి పర్యాటకులు రావడానికి ప్రధాన కారణం ఆహ్లాదకరమైన వాతావరణమే. ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించదు. ఏడాదంతా ఒకేరకంగా ఉంటుంది. వర్షం రోజూ రెండు జల్లులు పడుతుంది. ఇక్కడ చూడడానికి చారిత్రక కట్టడాలు లేవు, ప్రాచీన సంస్కృతి ఆనవాళ్లు కనిపించవు. కానీ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. కొండవాలులో ఇళ్లను చూస్తూ బీచ్‌లో విహరించడం, రిసార్టులో సేదదీరడం ఇక్కడ మధురానుభూతి. మన మాజీ రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ మేలో ఇక్కడ అధికారిక పర్యటన చేసి 75 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించారు. 1989లో అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ కూడా పర్యటించారు. సీషెల్స్ అభివృద్ధికి చాలా దేశాలు ఏదో ఓ రూపంలో సహకరిస్తున్నాయి. చైనా, అమెరికా వంటి దేశాలు టెక్నాలజీ సాయం అందిస్తున్నాయి.

ఆహారం ఇలా !

స్థానికుల ఆహారపు అలవాట్లు సముద్రం ఆధారంగానే ఉంటాయి. చేపలు, పీతలు, రొయ్యలు వంటి సీఫుడ్‌ను రైస్‌తో తింటారు. ఇది బ్రిటిష్ పాలనలో ఉన్న దేశం అయినప్పటికీ ఆహారపు అలవాట్లలో ఫ్రెంచ్ ప్రభావం కూడా ఉంది. కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర వస్తువులు దుబాయ్, మారిషస్, కెన్యాల నుంచి దిగుమతి అవుతాయి. దేశంలో బర్గర్‌కింగ్ చైన్ రెస్టారెంట్‌లు కనిపిస్తాయి. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు కానీ బీర్ ఫ్యాక్టరీ మాత్రం ఉంది. ఇక్కడి వాళ్లు పనిచేయడానికి ఇష్టపడరు, జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ప్రధానం. సంగీతం అంటే చాలా ఇష్టం. సెఘా, ముఛా అని రెండు రకాల సంప్రదాయ నాట్యరీతులున్నాయి. విందు వినోదాల్లో తేలుతూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేయడం వీళ్లకు తప్పనిసరి వ్యాపకం.

రవాణా ఇలా!

ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి క్యాట్‌ కోకోస్ అని పెద్ద బోట్‌లు ఉంటాయి, హెలికాప్టర్‌లో కూడా వెళ్తారు. అదే దీవిలో తిరగడానికి బస్సులు ఉంటాయి. దీవిని చుట్టి వచ్చినా ఇరవై కిలోమీటర్లకు మించదు. చాలా దీవుల్లో ఒక వైపు బీచ్ మరో వైపు కొండ ఉంటుంది. కొన్ని దీవులు పగడపు దిబ్బల మయం, మరికొన్ని ప్రపంచంలోకి పెద్ద తాబేళ్లకు నిలయాలు. ఇక్కడ పెద్ద అడవులు ఉండవు కానీ గ్రీనరీ బాగుంటుంది. సీషెల్ దీవుల్లో కోకోడమేర్ అని ఒక రకం చెట్టు ఉంటుంది. దాని గింజ 16 కేజీల బరువుంటుంది. ఇది రికార్డు. ఈ చెట్టు మీద పేటెంట్ రైట్స్ తెచ్చుకుంది దేశం. ఈ గింజ వెయ్యి రూపాయలుంటుంది. ఈ సీడ్‌ను ఇతర దేశాలకు తీసుకురావాలంటే కొన్నట్లు ధృవీకరణ పత్రం ఉండాలి. ఇందులో ఔషధగుణాలుంటాయి, మందుల తయారీలో వాడతారు. దీని ఆకులు తాటి ఆకుల్లాగా, కాయలు కొబ్బరికాయల్లాగా ఉంటాయి. ఇది శ్రీలంకలో కూడా ఉంది. హిందూ మహాసముద్రంలోని చాలా దీవుల్లో ఉండవచ్చని అంచనా. సీషెల్స్ దీవుల మయమే అయినా కీటకాల కాటుతో వచ్చే కలరా, మలేరియా జ్వరాలు ఉండవు. ఇవి పర్యాటకుల ద్వారా దేశంలోకి వస్తుంటాయి. పర్యాటక రంగం విపరీతంగా విస్తరించిందనడానికి నిదర్శనం లెక్కలేనన్ని థీమ్‌పార్కులు, రిసార్టులే.

కిరణాలు చుర్రుమనిపిస్తాయి!

ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం, పగటినిడివి మనకున్నట్లే ఉంటాయి. విపరీతమైన ఎండ ఉండదు, కానీ కిరణాలు నేరుగా తాకుతున్నట్లు చుర్రుమంటుంది. వాతావరణంలో తేడాను ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ ఇడ్లీపిండి పొండగానికి రాత్రంతా అవసరం లేదు, గ్రైండ్ చేసిన గంటకే ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ, చర్చిలు చాలానే ఉన్నాయి. ఇక్కడ జనాభాలో ఇరవై వేలకు పైగా భారతీయులుంటే అందులో నాలుగు వేల మంది తమిళులే. వీళ్ల ప్రభావం ఇక్కడి నవశాంతి వినాయగన్ ఆలయంలో కనిపిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం ‘సీషెల్స్ హిందూ కోవిల్ సంఘం’ అని ధార్మిక సంస్థను స్థాపించారు. వినాయకుడి ఆలయంలో మురుగన్, దుర్గా శ్రీనివాస పెరుమాళ్, భైరవ, చండేకేశ్వర్‌లను ప్రతిష్టించారు. రోజువారీ పూజాదికాలు నిర్వహిస్తూ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తైప్పూసమ్ కావడి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. రథాన్ని ఊరేగించడం వంటి వేడుకలు చేస్తారు. ప్రభుత్వం ఈ పండుగ రోజును హిందువులకు సెలవుగా ప్రకటించింది.

ఖండాల కలబోత !

స్థానికుల్లో ఆఫ్రికన్‌తోపాటు మిక్స్‌డ్ ఆరిజన్ కూడా ఉంది. కొంతమంది ఆసియావాసుల్లాగ, అందులోనూ భారతీయుల్లా కనిపిస్తారు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ లేదు. వీరిది లివింగ్ టుగెదర్ సంస్కృతి. కుటుంబపరమైన భద్రత లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వచట్టాలున్నాయి. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత ఆ జంట విడిపోయినా బిడ్డ బాధ్యత తండ్రిదే. బిడ్డ ఇష్టానుసారం తల్లి దగ్గర లేదా తండ్రి దగ్గర పెరగవచ్చు. తల్లి దగ్గర పెరుగుతున్నట్లయితే ఆ బిడ్డ పోషణకు తండ్రి నెలనెలా డబ్బు ఇవ్వాలి. చదువు, ఆరోగ్యం వంటి అవసరాలన్నీ ప్రభుత్వమే చూస్తుంది. దేశంలో అందరికీ ఫ్రీ మెడికల్ సర్వీస్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఉన్నత విద్యకోసం బయటి దేశాలకు వెళ్లడానికి ప్రభుత్వం స్కాలర్‌షిప్ ఇస్తుంది. ఇక్కడ కేంబ్రిడ్జి యూనివర్శిటీ సిలబస్‌తో నడిచే బ్రిటిష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Historic place of orugallu
Bangalore best indian city to live  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles