Bangalore best indian city to live

Bangalore,HR consultancy Mercer,New Delhi, Bangalore best Indian city

Technology hub Bangalore has emerged as the best city to live in India, pipping other metro cities such as New Delhi, Mumbai and Kolkata, in terms of overall quality of living, according to a latest worldwide survey of cities by global HR consultancy Mercer.

Bangalore best Indian city to live.png

Posted: 12/06/2012 03:09 PM IST
Bangalore best indian city to live

Bangalore_city__సందడి సందడిగా ఉండే దుకాణాలు, కిక్కిరిసిన రోడ్లు, ఆకాశ హర్మ్యాలతో, సమకాలీన భారతదేశానికి బెంగళూరు ఒక కొత్త ముఖాన్ని ఇచ్చింది. యువతరం తనను తాను ప్రతిబింబించుకునేలా విజయనగర సామ్రాజ్యపు సామంతరాజు కెంపె గౌడ 1537లో ఈ పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పట్టణమే....వేగంగా అభివృద్ధిని సాధిస్తూ.... ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా 139వ స్థానంలో నిలిచింది. మొత్తంగా జీవన నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎంపిక జరిగింది. అంతర్జాతీయ మానవ వనరుల కన్సల్టెల్సీ సంస్థ మెర్సెర్‌ తాజాగా నగరాలపై చేపట్టిన సర్వేలో ఈ అంశం తేలింది. ‘మెర్సెర్స్‌ 2012 జీవన నాణ్యత సూచి’లో బెంగళూరు 139వ స్థానం ఆక్రమించింది. బెంగళూరు నగరంలో ఉన్న సౌకర్యాలు, నాణ్యత, విదేశీయుల రాకపోకలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చిన రేటింగ్స్‌కు కారణమని చెప్పవచ్చు. లివింగ్‌ ఇండెక్స్‌ నివేదికలో మెర్సర్‌ వాటి నాణ్యతా ప్రమాణాలను వెళ్ళడించింది. ఈ గ్లోబల్‌ ర్యాంకింగ్‌ ఈ సంవత్సరం ర్యాంకింగ్‌కు విద్యుత్‌ సరఫరా, నీటి లభ్యత, టెలిఫోన్‌, మెయిల్‌ సేవలు, ప్రజారవాణా, ట్రాఫిక్‌ సమస్యలు, స్థానిక విమానాశ్రయాల నుండి అంతర్జాతీయ విమానాల రాకపోకల శ్రేణి ఆధారంగా ఉత్తమ మౌలిక వసతుల నగరాలను గుర్తించింది. 2011లో ఈ నగరానికి ఇచ్చిన ర్యాంకింగ్‌ హోదా141, తాజా సర్వేలో 139వ ర్యాంక్‌కు వచ్చింది.

వరల్డ్‌ సిటీస్‌తో బెంగళూరు

దేశంలో ఐటి విప్లవానికి పర్యాయపదంగా ఉన్న బెంగళూరు దేశంలో మూడవ అతిపెద్ద నగరం. దేశపు సిలికాన్‌ వ్యాలీగా పేరు సంపాదించింది. అలాగే ‘గార్డెన్‌సిటీగా కూడా పేరు సంపాదించింది. బెంగళూరు గతంలో కంటే ఇప్పుడు వ్యాపార పరంగా పేరుగాంచింది. ప్రపంచం మొత్తానికి ఎక్కడికైనా ఇక్కడి నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, నిపుణులు వెళ్ళాల్సిందే. బెంగళూరు నగరం ఇప్పుడు అనేక పబ్లిక్‌ సెక్టార్‌ కార్యాచరణాలు ఉనికిని రాష్ర్టంలో పారిశ్రామిక కార్యకలాపాలు బలమైన కేంద్రంగా ఉంది. ఎలక్ట్రానిక్స్‌ సిటీ, ఐటిపిఎల్‌, ఇతర భారీ ఐటి పార్కులుతో బెంగళూరు ప్రపంచం మొత్తానికి వ్యాపార గమ్యస్థానంగా మారింది.వాతావరణం కూడా లెక్కే
ఈ నగరం సముద్ర మట్టానికి 949 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఈ నగరం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిఉంటుంది. ఉష్ణమండల వాతావరణం వల్ల నగరంలో తరచుగా పడే వర్షాలతో పాటు వెచ్చని వేసవికాలం, చలిగా ఉండే శీతాకాలను కలిగి ఉంటుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇక్కడ ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారు. వేసవిలో 20 నుంచి 36 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 17 నుండి 27 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత ఉంటుంది.

Bangalore_cityప్రయాణ సౌకర్యం

ఈ నగరం చాలా బాగా అనుసంధానించబడి ఉండడం వల్ల నగరంలోకి, పరిసరాలకీ ప్రయాణాలు చాలా సులభంగా ఉంటాయి. బెంగళూరు రోడ్డు, రెైలు, విమానాల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.

సంస్కృతి వారసత్వం

బెంగళూరు ఒక బహుళ సాంస్కృతిక నగరం అయినప్పటికీ... ఎక్కువగా హిందు మతస్థులే ఉంటారు. ఇక్కడ స్థిరపడ్డ వారు కాస్మోపాలిటన్‌ సంస్కృతికి అలవాటుపడ్డారు. ముంబెై తరువాత అత్యధిక అక్షరాస్యత కలిగిన నగరం బెంగళూరు ఇక్కడ 86శాతం మంది అక్షరాస్యత కలిగి ఉన్నారు.

Bangalore_city_వరల్డ్‌హబ్‌

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ స్పేస్‌ రీసర్స్‌ ఆర్ఘనెైజేషన్‌, లాంటి సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన ఇన్ఫోసిస్‌, విఫ్రో, టీసిఎస్‌ లాంటి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను బెంగళూరులో స్థాపించడంతో నగర ఆర్థిక వ్యవస్థ బాగా ఊపందుకుంది. బెంగళూరులో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఇతర కంపెనీలలో ఎల్‌జీ, శామ్‌సంగ్‌, ఐబీఎం ఉన్నాయి. ఇక్కడి ఉద్యోగ విపణి అన్ని దేశాల నుంచి ఉద్యోగార్థులను ఆకర్షించడం వల్ల నగరం బహుళ సంస్కృతి, బహుళజాతి నగరంగా రూపంతరం చెందింది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seychelles tourism and informatin
Sri lanka information and tourism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles