Sri lanka information and tourism

magnificent landscapes featuring lazy lagoons, fertile wetlands, ecologically-wondrous types of forest, imposing mountains, bounteous rivers and waterfalls, an abundance of wildlife - much of it endemic - unique ecosystems, inspiring heritage sites from ancient cities to colonial forts, a vibrant culture including fine arts and crafts and grand festivals, and a people of diverse ethnicity and religious persuasion, charming and hospitable, sri lanka tour ,sri lanka, srilanka tour, sri lanka travel

Sri lanka information and tourism.

Sri lanka information and tourism.png

Posted: 11/27/2012 12:24 PM IST
Sri lanka information and tourism

Temple_in_Sri_lanka

సేతుబంధనంతో... రాముడు వేసింది ఇతిహాస బంధం. బౌద్ధంతో... అశోకుడు వేసింది చారిత్రక బంధం. ఇతిహాసకాలం నుంచి చారిత్రక కాలం వరకు మనకు సుపరిచితం ఈ నేల. ఈ బంధాన్ని పర్యాటకం పటిష్టం చేస్తోంది. అదే శ్రీలంక. దాని గురించి తెలుసుకుందాం.

శ్రీలంకలో పర్యటిస్తుంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉన్నట్లే ఉంటుంది. కేరళలో ఉన్నట్లే పచ్చదనం ఉంది, ఒకటి - రెండు అంతస్తుల ఎర్ర పెంకు పైకప్పు ఇళ్లు ఉంటాయి. ఇక్కడ విశాలమైన ప్రాంగణాలు, పెద్ద ఇళ్లు కనిపించవు. అపార్ట్‌మెంట్ కల్చర్ అసలే లేదు. పెద్ద హోటళ్లు కూడా మూడు-నాలుగు ఫ్లోర్స్‌కు మించవు. ఇక్కడ బీడు వారిన నేల కనిపించదు. కొండల మీద కూడా తక్కువ లోతులో నీళ్లు పడతాయి.

రెండు వర్షాకాలాలతో చల్లగా, పచ్చగా ఉంటుంది దేశం.క్యాలీఫ్లవర్ నుంచి చాలా కూరగాయలు పండిస్తారు. కానీ ఇక్కడ సీఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. భోజనంలో చేపలు ప్రధానం, అన్నం తక్కువ, గోధుమరొట్టెలు ఎక్కువ. ఇక్కడ అందరివీ శ్రమిస్తే తప్ప కడుపునిండని జీవితాలుగానే కనిపిస్తాయి. కానీ పర్యాటకులను మోసం చేసే తత్వం ఉండదు. బౌద్ధం ప్రభావంతో కాబోలు ప్రజలు ఒబీడియెంట్‌గా కనిపిస్తారు. సింహళీయులు, తమిళులు బౌద్ధాన్నే అనుసరిస్తున్నారు. ఇక్కడ హిందూ ఆలయాలను కూడా బౌద్ధ ట్రస్టులే నిర్వహిస్తున్నాయి.శ్రీలంకలో పాలఉత్పత్తులు ఎక్కువ. మన దగ్గర కూరగాయలు, పండ్లు అమ్మినట్టు ఇక్కడ రోడ్డు పక్కన పాలు, పెరుగు కుండల్లో అమ్ముతారు. మనం రాముడు శ్రీలంక చేరడానికి కట్టినట్లు చెప్పుకుంటున్న రామసేతు క్రీ.శ 1640 వరకు వాడుకలో ఉండేది. ఆ బ్రిడ్జి మీద నుంచి తిరుకేశ్వరం నుంచి రామేశ్వరానికి గుర్రం బండిలో పాలు వచ్చేవని, ఆ పాలతోనే రామేశ్వర ఆలయంలో లింగానికి అభిషేకం చేసేవారని చెబుతారు. దేశంలో టీ ఆకు, రంగురాళ్ల పరిశ్రమలు ప్రధాన ఉపాధి రంగాలు. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత టూరిజం కూడా ఆదాయవనరు అయింది. హోటల్ వ్యాపారం, లగ్జరీ రిసార్టులు, థీమ్‌పార్కుల నిర్మాణంతో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.

బోధి వృక్షం సాక్షిగా !

మన గయలో ఉన్నట్లే ఇక్కడి కెలనియా నగరంలో బోధి వృక్షం ఉంది. అది కూడా గయ బోధి వృక్షం నుంచి తెచ్చిన కొమ్మ. వేల ఏళ్ల క్రితం నాటిన కొమ్మ మహావృక్షమై భారతీయ బౌద్ధానికి ఆనవాలుగా ఉంది. కెలనియా విభీషణుడికి లక్ష్మణుడు పట్టాభిషేకం చేసిన ప్రదేశం. ఇక్కడ పూజారులు ప్రశాంతంగా పూజ చేసి, ప్రసాదంగా పటిక పంచదార ఇస్తారు. నల్లరాతి విగ్రహాలను చేమంతి పూలతో అలంకరిస్తారు. చిల్లవ్ పట్టణంలో మున్నేశ్వరం ఆలయం ఎంతటి పురాతనమైనదంటే... రామ రావణయుద్ధం తర్వాత రాముడు సీతతో పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరి మార్గమధ్యంలో ఇక్కడ దిగి శివుణ్ని దర్శనం చేసుకున్నాడంటారు.

సీతమ్మ జ్ఞాపకాలుగా !

అశోకవనంలో సీతాదేవి కూర్చున్న స్థానంలో ఆలయం కట్టారు. ఈ ఆలయాన్ని ఆనుకుని వెనుకవైపు చిన్న సెలయేరు ప్రవహిస్తోంది. సీతాదేవి ఈ నదిలోనే స్నానం చేసేదని చెబుతారు. సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన స్థలాన్ని రుమాసలా అంటారు. ఇక్కడ దింపురోలా అనే ప్రదేశం ప్రసిద్ధి. సింహళభాషలో దింపురోలా అంటే ప్రమాణం చేసే చోటు. ఇప్పటికీ గొడవపడినవాళ్లు ఇక్కడికి వచ్చి ప్రమాణం చేస్తారు. ఇక్కడ అబద్ధం ప్రమాణం చేయడానికి ఎవరూ సాహసించరు.

తమిళుల స్థావరం !

ట్రింకోమలై... ఈ పేరు దశాబ్దాలపాటు మనకు రేడియోలో వినిపించేది. టీవీల పర్వానికి ముందు ప్రతి ఇంటి రేడియో గొంతు ఇక్కడ జరుగుతున్న ఊచకోతల వార్తలతో గద్గదమైపోయేది. ఎల్‌టిటిఈ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ట్రింకోమలైలో సగానికి పైగా ఇండియా నుంచి వచ్చి స్థిరపడిన తమిళ సంతతి ఉంది. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పే శాంకరీదేవి ఆలయం ఉంది. ఈ ప్రదేశం మిలటరీ కంటోన్మెంట్ ఆధీనంలో ఉంది. వాహనాలను అనుమతించరు. కిలోమీటరు దూరంలో బస్సు దిగి సైకిల్ రిక్షాలో వెళ్లాలి. శ్రీలంక దీవిలో ఎత్తై కొండలతోపాటు ఉష్ణగుండాలూ ఉన్నాయి. ‘కన్నియ’లో ఒకేచోట ఏడు ఉష్ణగుండాలున్నాయి. వీటిలో నీటి ఉష్ణోగ్రత ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది.

lion_hillసింహం కొండ !

సిగిరియా కొండ శిఖరం నిటారుగా, సింహం తల ఆకారంలో ఉంటుంది. ఇది మంచి మౌంటనియరింగ్ జోన్. మెట్ల పక్కనే గొలుసులు ఉంటాయి. వాటి ఆధారంగా కొండ శిఖరం మీదకు వెళ్లవచ్చు. సిగిరియా కొండమీద రెండువందల మీటర్ల ఎత్తులో దుర్గం ఉంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ కోటను క్రీ.శ ఐదవశతాబ్దంలో కశ్యపుడు అనే సింహళరాజు శత్రుదుర్భేద్యంగా నిర్మించాడు. కోట చుట్ట కందకం, ప్రాకారాలు, బురుజులు, కోట లోపల స్నాన వాటికలు, ఉద్యానవనాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangalore best indian city to live
Tourist information on singapore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles