Information on austria

Information on Austria.png

Posted: 11/12/2012 05:12 PM IST
Information on austria

Austria

ఆ ప్రదేశం ప్రకృతి దృశ్యాల సుమహారం. ప్రపంచ వారసత్వ సంపదను రాజధానిగా చేసుకున్న దేశం. మధ్యయుగపు జీవనశైలి- ఆధునిక టెక్నాలజీల సమ్మేళనం ఈ నేల. క్రిస్టల్‌కి క్రియేటివిని తోడు చేసిన ప్రదేశం. ఆల్ప్స్ సాక్షిగా మన సినిమాల్లో కనిపించే నేలనే ఈ ఆస్ట్రియా మనకు అంతగా పరిచయం లేని దేశం యొక్క విశేషాల పై ఓ కన్నేద్దాం.

ఆస్ట్రియాతో మనకు పరిచయం తక్కువే, కానీ ఇక్కడి సీనరీలు సుపరిచితమే. నీలిరంగు హిమానీనదాలు, ఇన్స్ నది మీద విహారం, గోల్డెన్ రూఫ్ రాయల్‌ బాల్కనీ, వీధి పొడవున ఉండే భవనాలు, క్రిస్టల్ మ్యూజియం... వీటిలో ఏదో ఒకటి సినిమాల్లో కనిపించే ఉంటుంది. ముఖ్యంగా యశ్‌రాజ్ సినిమాల్లో. స్వరోవ్‌స్కీ క్రిస్టల్ మ్యూజియం గురించి ఎంత సేపు మాట్లాడుకున్నా తక్కువే. క్రిస్టల్‌వాల్, క్రిస్టమస్ ట్రీ, క్రిస్టల్ ఉంగరం, ఫ్లూట్... నుంచి మన తాజ్‌మహల్ వరకు వందల కళాఖండాలు ఉన్నాయి. ప్రతిదీ దేనికదే ఒక అద్భుతం. మ్యూజియానికి అనుబంధంగా క్రిస్టల్ షాప్ ఉంది. అందులో ఇంటీరియర్ డెకరేటివ్ పీసెస్ నుంచి నెక్లెస్‌ల వంటి రకరకాల ఆభరణాలు ఉంటాయి. మొత్తం 14 ఛాంబర్స్, వైల్డ్ లైఫ్, ఆర్ట్, చారిత్రక వారసత్వం వంటి కాన్సెప్ట్‌లతో ఒక్కో చాంబర్ ఒక్కో థీమ్‌తో ఉంటుంది. ఈ మ్యూజియం ఇన్స్‌బ్రుక్ నగరంలో ఉంది. ఇన్స్‌బ్రుక్ అంటే ఇన్స్‌బ్రిడ్జి అని అర్థం. ఇన్స్ నది మీద కట్టిన వంతెన ఇది. దాని ఆధారంగా ఏర్పడిన నగరం కూడా అదే పేరుతో వ్యవహారంలోకి వచ్చింది. ఈ వంతెన కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్నదే. దీనిని కీ.శ. 1000లో కట్టారు. మనకు ప్రారంభోత్సవం లోపే కుంగిపోయే వంతెనలు తెలుసు, కానీ వెయ్యేళ్ల బ్రిడ్జి అంటే ఆశ్చర్యమే మరి.ఈ బ్రిడ్జి ఒక్కటే కాదు 15-16 శతాబ్దాల నాటి భవనాలు వాడుకలో ఉన్నాయి.

Austria_ఇన్స్‌బ్రుక్‌లో 15వ శతాబ్దానికి చెందిన రాజభవనం గోల్డెన్ రూఫ్. ఇది నగరంలో పెద్ద ల్యాండ్ మార్క్. గోథిక్- బరోక్ సమ్మేళనం ఈ నిర్మాణం. రాజు ఈ బాల్కనీలో నుంచి నగరంలో జరిగే వేడుకలను, టోర్నమెంట్‌లను (భవనం ముందు స్క్వేర్‌లో జరిగేవి) పర్యవేక్షించేవాడట. ఈ బాల్కనీని రాయల్‌బాక్స్ అంటారు. ఇది అప్పట్లో నగరానికి నడిబొడ్డు. దీని మెయింటెనెన్స్ ఎంత బాగా ఉంటుందంటే ఏ పదేళ్ల క్రితమో కట్టినట్లుంటుంది. ఇది ఒక్కటే కాదు ఇక్కడ ప్రతి భవనాన్ని అంతే చక్కగా చూస్తారు. 15వ శతాబ్దానికి చెందిన భవనాల్లో జనం ఇప్పటికీ నివసిస్తున్నారు.ఆస్ట్రియా వాళ్లు ఇళ్లను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ, ఆధునీకరిస్తారు. ఉడెన్ ఫ్లోరింగ్ ఇళ్లు, గోడలకు ఫ్యాబ్రికేట్ టైల్స్‌ను తలపించే త్రీడీ ఆర్ట్ పెయింటింగ్‌లు, గోడలకు సునిశితమైన ఇంట్రికేట్ వర్క్... జానపద సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి వాళ్లకు గార్డెనింగ్ కూడా చాలా ఇష్టం. విరగబూసిన చెట్లు కిటికీ నుంచి బయటకు చూస్తూ ఉంటాయి. యూరప్ అంతటా గార్డెనింగ్ బాగుంటుంది, కానీ ఆస్ట్రియాలో మరింత ఎక్కువ. వీటిని చూస్తూ ఇక్కడ గుర్రపు బగ్గీలో తిరుగుతుంటే మధ్యయుగం కళ్లకు కడుతుంది.వారసత్వ సంపదలను పరిరక్షించుకోవడం, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా జీవించడం, మౌలిక వసతుల నిర్వహణ వంటి ఆరోగ్యకరమైన పోటీ ఇది. పైగా ఇక్కడ నీటి వనరులను చక్కగా నిర్వహిస్తారు. మనకు యమునోత్రి దగ్గర ప్రవాహం మొదలైనప్పుడు స్వచ్ఛంగా ఉండే యమున నీరు ఢిల్లీ చేరే సరికి కలుషితం అవుతోంది. ఇక్కడ మాత్రం ఇన్స్ నది నీళ్లు ప్రవాహం పొడవునా స్వచ్ఛంగా ఉంటాయి.

మన వాళ్ళు !
ఇక్కడ పర్యాటకరంగాన్ని మన భారతీయులే నిర్వహిస్తున్నారా అనిపిస్తుంది. ఇండియన్ టూరిస్టులు ఎక్కువ. ఇండియన్ రెస్టారెంట్‌లు ఎక్కువ. సంఘం రెస్టారెంట్ అనే పేరు కనపడగానే మనవాళ్లకు ప్రాణం లేచివచ్చినట్లవుతుంది. ఇది బెంగాలీలు నిర్వహిస్తున్న రెస్టారెంట్. పర్యాటకం పేరుతో మన డబ్బు పాశ్చాత్యదేశాలకు పోతోందని కొంచెం బెంగగా ఉంటుంది, కానీ టూరిజం ఆధారంగా ఇక్కడ మనవాళ్లు ఉపాధి పొందుతున్న తీరు చూస్తే సంతోషంగా ఉంటుంది. సీజన్‌లో ఇక్కడికి ఇండియా నుంచి వంట, ఇతర పనులకు చాలా మంది వస్తారు. హోటళ్లు నిర్వహించేవాళ్లలో పంజాబీలు ఎక్కువ. ఇండియన్ ఫుడ్ అంటే ప్రధానంగా నార్త్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి, వాటితోపాటు ఆవకాయ, అప్పడం, పెరుగు ఇస్తారు. దీంతో దక్షిణాది వాళ్లు ఖుషీ అవుతారు. జూలై, ఆగస్టు నెలలు ఇక్కడ వేసవి కాలం. మనవాళ్లు ఆ నెలల్లోనే ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు కూడా లైట్ ఉలెన్ స్వెటర్ వెంట తెచ్చుకుంటే మంచిది. వేసవిలో సూర్యుడు ఐదు గంటలకు ఉదయించి రాత్రి ఎనిమిది తర్వాత అస్తమిస్తాడు. తొమ్మిదింటికి కానీ చీకటి పడదు. శీతాకాలం ఏడుగంటలకు ఉదయించి సాయంత్రం ఐదింటికే మబ్బుల చాటుకు పోతాడు. ఆ రోజుల్లో ఇక్కడ మంచు కురవడంతోపాటు పగటి నిడివి తక్కువ. టూర్‌కు అనుకూలంగా ఉండదు.

ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో హిస్టారికల్ ఆర్చ్, ఇంపీరియల్ ప్యాలెస్,పార్లమెంట్ భవనం, వియెన్నా కెథడ్రాల్, బల్వెడేర్ ప్యాలెస్, ఇంకా అనేక మ్యూజియాలను చూడవచ్చు. అన్నట్లు హిట్లర్ పుట్టింది ఆస్ట్రియాలోనే. బ్రానో అనే చిన్న గ్రామంలో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tourist information on singapore
Bahrain country history and information  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh