Bahrain country history and information

Bahrain country History and information

Bahrain country History and information

Bahrain country History and information.png

Posted: 11/05/2012 01:36 PM IST
Bahrain country history and information

Bahrain_country

తలాపున సముద్రం ఉంచుకొని చాప దాహానికి ఏడ్చినట్లు.... అనే సామెత ఈ దేశానికి సరిగ్గా సరిపోతుందేమో అనిపిస్తుంది. ఆ దేశం పేరు బహ్రెయిన్. పేరుకి అర్థం రెండు సముద్రాలు. ఈ దేశానికి చుట్టూ నీరుంది... కానీ భూగర్భంలో లేదు. మొదటి చమురునిక్షేపం ఇక్కడిదే. ఇక్కడివాళ్లు ఖురాన్‌ని అక్షరాలా విశ్వసిస్తారు... ఆచరిస్తారు. అభివృద్ధి దిశగా ఆలోచిస్తారు... అదే దారిలో నడుస్తారు. ఆ దేశం విశేషాలు తెలుసుకుందాం.

బహ్రెయిన్ నిర్మాణం అంతా భారతీయుల కష్టమే. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ వరకు కీలకమైన రంగాలన్నింటిలోనూ భారతీయులు ఉన్నారు. పైగా ఇక్కడి వాళ్లు భారతీయులను బాగా విశ్వసిస్తారు. బ్యాంకులు, ఇతర ఆర్థికలావాదేవీల నిర్వహణలో తమిళ అయ్యంగార్లు ఎక్కువ. తమ దేశ నిర్మాణకర్తలుగా భారతీయులను అభిమానిస్తారు. మన విద్యావిధానాన్ని కూడా ఇష్టపడతారు. ఇక్కడ అరబిక్ స్కూళ్లతోపాటు బ్రిటిష్ స్కూల్, పాక్, బంగ్లాదేశ్ స్కూళ్లు, ఇండియన్ స్కూల్ ఉన్నాయి. ఇండియన్ స్కూల్‌లో సిబిఎస్‌ఇ సిలబస్ ఉంటుంది. ఈ స్కూల్లో తొమ్మిది వేల మంది చదువుతుంటే అందులో పదిహేను వందల మంది అరబిక్ పిల్లలే. బహ్రెయిన్ ప్రజలు హుందాగా ఉంటారు, ఎవరినీ కించపరచరు. వీరిది ప్రోగ్రెసివ్ కల్చర్ కూడ. మసీదులతోపాటు మన ఆలయాలు, చర్చ్‌లు, గురుద్వారాలున్నాయి. అయితే మన భక్తి మన వరకే, మైక్‌లు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించడం నిషేధం. సేవాకార్యక్రమాలు కూడా ఎక్కువే. ఇండియన్, అరబిక్ చారిటీలు ఉంటాయి.

Miss_arab_world_2007డ్రస్‌కోడ్ లేదు !

బహ్రెయిన్‌ది ఫ్రీ కల్చర్. డ్రస్‌కోడ్ లేదు. మహిళలు బురఖా ధరించవచ్చు కానీ ధరించి తీరాలన్న నిబంధన లేదు. మిడీ- టీ షర్టు వంటి పాశ్చాత్యదుస్తులు వేసుకున్నవాళ్లూ ఉంటారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా మగవాళ్లు షార్ట్స్‌లో తిరగవచ్చు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ హబ్. నియమాలు కఠినంగా ఉండే సౌదీ నుంచి, ఖతర్ నుంచి వీకెండ్స్‌కి బహ్రెయిన్ వస్తారు.

పన్నులు లేవు ! సౌకర్యాలున్నాయి !!

ఇది ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఇదొక్కటే కాదు ఏ గల్ఫ్ దేశంలోనూ పన్నులుండవు. ఇక్కడ ఏదీ పండదు కాబట్టి కూరగాయలు, దినుసుల ధరలు ఎక్కువే. ఉప్పు కూడా బయటి నుంచి రావాల్సిందే. మౌలిక వసతుల నిర్వహణ చక్కగా ఉంటుంది. కరెంట్ పోవడం, నీళ్లు రాకపోవడం అనేది ఉండదు. ఎప్పుడైనా రిపేర్లు వస్తే ముందురోజే మున్సిపల్ ఉద్యోగులు ఇంటికి నోటిస్ అతికిస్తారు. అది కూడా ఫలానా టైమ్ నుంచి ఫలానా టైమ్ వరకు అని కొద్ది గంటలకే. ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉండదు. సముద్రపు నీటిని డీసాల్టేషన్ చేసి సప్లై చేస్తారు. ఈ నీటిలో కొద్దిపాటి ఉప్పదనం ఉంటుంది. స్వీట్ వాటర్ కూడా ఉంటుంది. అవి వంటకు, తాగడానికి. ఇవి కాకుండా తాగడానికి బాటిల్డ్ వాటర్ దొరుకుతుంది. పౌరులతోపాటు దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సిపిఆర్ ఐడి కార్డు ఇస్తుంది.

ఒకనాటి పెర్ల్ సిటీ !

మెయిన్‌ల్యాండ్‌కు దూరంగా విసిరేసినట్లు చిన్న దీవులు ఉంటాయి. వాటిలో ప్రజలు చేపలు పట్టుకుని జీవిస్తుంటారు. గతంలో వీళ్లలో ఎక్కువమంది ముత్యాలు సేకరించేవారు. అప్పట్లో దీనిని పెర్ల్ సిటీ అనేవారు. ఇప్పుడు గోల్డ్ ఇండస్ట్రీ బాగుంది. 22 క్యారట్‌ల ఆభరణం అంటే కచ్చితంగా ఆ నాణ్యత ఉండి తీరుతుంది. ఇక్కడ వ్యాపారం ఉంది కానీ మోసాల్లేవు. దొంగతనం, నేరాలు, లంచం తీసుకోవడం, చివరికి అబద్ధం చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఖురాన్‌ని బాగా నమ్ముతారు. ప్రిన్సిపుల్డ్ లైఫ్‌ని గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఆస్తి కొనుగోలు నిబంధనలు మనకు కొత్తగా అనిపిస్తాయి. ఇల్లు కొనవచ్చు కానీ భూమి కొనరాదు. భూమిని కొనే హక్కు అరబ్బులకే పరిమితం. ఇతరులకు 99 ఏళ్లకు లీజుకిస్తారు.

బహ్రెయిన్‌లో స్వాతి వీక్లీ నుంచి మన వస్తువులన్నీ దొరుకుతాయి. మన సినిమాలు రిలీజవుతాయి. పెద్ద షాపింగ్ మాల్స్ నడుపుతున్నది కేరళ నుంచి వచ్చి స్థిరపడిన ముస్లిం. ఈ దేశానికి మనవాళ్లు చట్టబద్ధంగా వస్తే హాయిగా జీవించవచ్చు. అయితే ఇక్కడ ఎన్నేళ్లు జీవించినా ఈ దేశ పౌరసత్వం వస్తుందా రాదా అన్నది ప్రశ్నార్థకమే. పాతికేళ్లు జీవించి, అరబిక్ రాయడం, చదవడం నేర్చుకుంటే మన అభ్యర్థనను పరిశీలనకు స్వీకరిస్తారు. అప్పటికీ పౌరసత్వం ఇవ్వడానికి- ఇవ్వకపోవడానికి చాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీనే.

చూడాల్సినవి ఇవి!

జూ పార్క్, అల్ అరీన్ వైల్ట్ లైఫ్, జల్లాక్ బీచ్, నేషనల్ మ్యూజియం, అల్ ఫతే మసీదు, అల్ ఖామిష్ మసీదు, అరద్ ఫోర్ట్, బహ్రెయిన్ ఫోర్ట్, బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్, గోల్డ్ సిటీ, కింగ్ ఫహాద్ కాజ్‌వే, బహ్రెయిన్ సిటీ సెంటర్, రిప్ఫా గోల్ఫ్ క్లబ్ ఉన్నాయి. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో మనకు ఆశ్చర్యంగా అనిపించేది బాబర్ టెంపుల్. మనకు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగానే తెలుసు. కానీ ఇక్కడి వాళ్లు బాబర్‌ను దేవుడిగా కొలుస్తారు. అరబ్ దేశాల్లో చమురు నిక్షేపాలున్నట్లు తెలుసుకున్నది ఇక్కడే. తొలిసారి ఆయిల్ బావి ఇక్కడే ఉంది. దీనిని కూడా చూడవచ్చు. అలాగే ఇక్కడ ఒక చెట్టు ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది పాతిక అడుగుల ఎత్తున్న ఇసుక దిబ్బ మీద ఉంది. దీనిని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. దీనికి నీరు ఎలా అందుతోందనేది మిస్టరీ.బహ్రెయిన్ గురించి

Tree-of-lifeమరికొన్ని...

బహ్రెయిన్ రాజధాని మనామా. అధికార భాష అరబిక్.
దేశ కరెన్సీ బహ్రెయినీ దీనార్. ఇది దాదాపుగా 142 రూపాయలు.
బహ్రెయిన్ జనాభా 12,34,571.
బహ్రెయిన్ అంటే రెండు సముద్రాలు.
ట్రీ ఆఫ్ లైఫ్ అని 400 ఏళ్ల నాటి వృక్షం ఉంది ఇక్కడి ఎడారిలో. దీనికి నీరు ఎలా అందుతోందో అర్థం కాదు.
బహ్రెయిన్ 318 / 555 అడుగుల జాతీయ జెండాతో ప్రపంచ రికార్డు సాధించింది. తర్వాత ఆ రికార్డును ఇజ్రాయెల్ బ్రేక్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Information on austria
Belgium information and tourism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles