డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడు | krishna birthday special story

Krishna birthday special story

superstar krishna, 74 birthday.celebrations, సూపర్ స్టార్ కృష్ణ, 74వ బర్త్ డే, latest news, entertainment

superstar krishna celebrate his 74 birthday.

డేరింగ్ అండ్ డాషింగ్ నటశేఖరుడు

Posted: 05/31/2016 04:34 PM IST
Krishna birthday special story

మూస చిత్రాలతో ఒకే రూట్ లో వెళ్తున్న తెలుగు చిత్రాలను తన వైవిధ్యంలో ఒక్కసారిగా మార్చిపడేశాడు నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ. డేరింగ్ అండ్ డేషింగ్ అనే దానికి పర్యాయ పదంగా ఆయన పేరు చెప్పుకోవచ్చు. తెలుగు హీరోల్లో ఇంతవరకు ఎవరూ  చేయని ప్రయోగాలు ఆయన సొంతం. టాలీవుడ్ కు సాంకేతిక విలువలు అందించిన హీరోగా ఆయన పేరు చరిత్ర పేజీల్లో ఎక్కింది. నిర్మాతల పాలిట కల్పతరువుగా, సాహసమే ఊపిరిగా సాగిన కృష్ణ ప్రస్థానం గురించి ఆయన పుట్టిన రోజు(మే 31న) ప్రత్యేక స్టోరీ...

- 1942 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో శ్రీ వీరరాఘవయ్య చౌదరి, శ్రీమతి నాగరత్న దంపతులకు అగ్ర సంతానంగా జన్మించాడు. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ.

- సొంతూర్లనే బీఎస్ సీ దాకా విద్యాభాస్యం పూర్తి చేశారు.

- ఎఎన్నార్ ప్రేరణతో మద్రాసుకి వెళ్లి అక్కడ నటనావకాశాల కోసం ప్రయత్నించారు. అదే సమయంలో శోభన్‌బాబుతో కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించాడు. కళావాచస్పతి జగ్గయ్య నిర్మించిన 'పదండి     ముందుకు' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారు.

- ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చిత్రంతో కృష్ణగా మారి సినీ ఎంట్రీ ఇచ్చాడు. 1962 లో ప్రారంభమైన కెరీర్ 50 ఏళ్లపాటు 350 చిత్రాలతో నిర్విరామంగా కొనసాగింది.

- 1965 లో దగ్గరి బంధువు ఇందిరతో ఆయన వివాహం జరిగింది

- పౌరాణిక, సాంఘిక చిత్రాల హవా కొనసాగుతున్న సమయంలో గూఢచారి 116 అంటూ జేమ్స్ బాండ్ తరహా చిత్రాన్ని అందించి సక్సెస్ అయ్యాడు.

- సూపర్ స్టార్ సున్నితమైన వ్యక్తి. అన్ని తన సినిమాల ద్వారా అన్ని నేర్చేసుకున్నారు. తొలి హిట్ తేనెమనసులుతో డైలాగులు చెప్పడం, డ్యాన్సు చెయ్యడం, స్కూటరు, కారు నడపటం నేర్చుకుంటే,     'కన్నెమనసులు' ద్వారా ఈత కొట్టటం, గుర్రపు స్వారీ చెయ్యడం, ఫోక్ డ్యాన్సు చెయ్యడం నేర్చుకున్నారంట. కృష్ణ కెరీర్ లో మైలు రాయిగా చెప్పుకునే  'గూఢచారి116' ద్వారా తుపాకీ వాడకం, ఫైటింగులు చెయ్యడం    అలవాటు చేసుకున్నారు.

- తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. తొలి సినిమా స్కోప్ కూడా ఇదే.

- తెలుగులో తొలి 70ఎంఎం చిత్రం కూడా ఆయనదే. అదే సింహసనం. స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టంతో తెరకెక్కిన ఈ చిత్రం 1986లో విడుదలై ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయ లో ఈ     చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే లతో ఎడిటింగ్  కూడా కృష్ణే కావటం విశేషం.

- కెరీర్ లో తన వందో సినిమాను ప్రతిష్టాత్మకంగా, గుర్తుండిపోయేలా తీసింది బహుశా ఈయనేమో. అదే అల్లూరి సీతారామరాజు. ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటుడు అల్లూరిపై సినిమా తీయాలా వద్దా అన్న    సంగ్ధిగ్దంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా తీయటమే కాదు, ఎన్టీఆర్ చేత శభాష్ అనిపించుకున్నాడు సూపర్ స్టార్.

- తెలుగులో ఎక్కువ మల్టీ స్టారర్ చిత్రాలు తీసింది కూడా ఈయనే. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబులాంటి సీనియర్ నటులతోనే కాదు, చిరంజీవి, నాగార్జున, రవితేజ లాంటి తర్వాతి జనరేషన్ స్టార్లతో కూడా ఆయన స్క్రీన్ పంచుకున్నారు.

- నిర్మాతగా ఇక్కడే కాదు బాలీవుడ్ లోనూ సక్సెస్ లు అందుకున్నారు. హిమ్మత్ వాలా, తోఫా వంటి పలు చిత్రాలను పద్మాలయా బ్యానర్ లో తెరకెక్కించారు. బాలీవుడ్ లో ఆయన ఒక చిత్రానికి దర్శకత్వం   కూడా వహించారు. 2004లో డినోమోరియా, బిపాసాబసు కాంబినేషన్లో వచ్చిన ఇష్క్ హై తుమ్ సే చిత్రానికి ఆయనే డైరక్టర్. కానీ, ఆ చిత్రం అంతగా ఆడలేదు.

- రాజకీయాలను ప్రశ్నిస్తూ ఈనాడు లాంటి హాట్ టాపిక్ చిత్రంతోపాటు, గండికోట రహాస్యం వంటి వ్యంగ్య చిత్రాలు రూపొందించిన కృష్ణ ఎట్టకేలకు అందులోకి ప్రవేశించాల్సి వచ్చింది. ఏలూరు నుంచి 1989లో కాంగ్రెస్ ఎంపీగా ఆయన గెలుపొందాడు. అయితే 1991 ఓటమి చెందిన ఆయన ఆ తర్వాత రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు.

ఒకే ఏడాది ఆయన నటించిన దాదాపు డజను చిత్రాలు విడుదలయ్యాయంటే ఆయన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సీజన్ ను సరిగ్గా క్యాష్ చేసుకున్న హీరోగా కృష్ణకు పేరుంది. రోటీన్ చిత్రాలతో  విసిగి వేసారిన తెలుగు ప్రేక్షకులకు తన సినిమాలతో అసలు మజా ఏంటో చూపడమే కాదు, భారీ బడ్జెట్ చిత్రాలకు ఆద్యుడిగా మారాడు. ఆయన తీసిన చిత్రాలతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగింది. ఇలాంటి పుట్టిన రోజులు ఈ నటశేఖరుడు మరిన్నీ జరుపుకోవాలని ఆశిస్తూ తెలుగు విశేష్ తరపున విషెస్ తెలియజేస్తున్నాం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : superstar krishna  74 birthday.celebrations  

Other Articles

Today on Telugu Wishesh