The Biography Of Megnad Swaha Who Was An Indian Astrophysicist | Indian Famous Scientists | Indian famous People

Megnad swaha biography indian astrophysicist chemical physical conditions in stars

Megnad Swaha Biography, Megnad Swaha History, Megnad Swaha updates, Megnad Swaha researches, swaha equation, Megnad Swaha life history, indian famous scientists, indian best scientists, indian famous people, stars equations

Megnad Swaha Biography Indian Astrophysicist Chemical Physical Conditions In Stars : Meghnad Saha FRS was an Indian astrophysicist best known for his development of the Saha equation, used to describe chemical and physical conditions in stars.

నక్షత్రాల్లో జరిగే మార్పులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త

Posted: 10/07/2015 01:49 PM IST
Megnad swaha biography indian astrophysicist chemical physical conditions in stars

మేఘనాధ్ సాహా.. భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన.. అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన ఈయన సక్సెస్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇతరుల సహకారం ఏమాత్రం లేకుండా కేవలం తన చదువుతో అందనంత ఎత్తుకు ఎదిగారు. ‘డబ్బులు లేకపోయినా చదువుతో ప్రపంచాన్ని జయించొచ్చు’ అన్న మాటకు నిదర్శనంగా నిలిచారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే వున్న ఆ కాలంలోనూ తన మేధోశక్తితో నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొని ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుకున్నారు.

జీవిత విశేషాలు :

1893 అక్టోబర్ 6వ తేదీన ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగమైన ఢాకాలోని సియోర్‌తలి గ్రామంలో మేఘనాథ్ సాహా ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఆదాయం చాలకపోవడంతో ఆ కుటుంబం తరచు పస్తులతో గడిపేది. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టడానికి తండ్రి ప్రయత్నించేవాడు. అయితే సాహా చురుకుదనాన్ని గమనించిన ఉపాధ్యాయులు తండ్రికి నచ్చచెప్పి దాతల సాయంతో ఓ బోర్డింగ్‌ స్కూలులో చేర్చారు. సాహా చక్కగా చదువుతూ స్కాలర్‌షిప్‌లు సాధించి పై చదవుల కోసం ఢాకా వెళ్లారు. అదే సమయంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించినందుకు నిరసనగా.. గవర్నర్‌ తమ స్కూలును సందర్శిస్తున్న కార్యక్రమాన్ని సాహా తన స్నేహితులతో కలిసి బహిష్కరించి, డిస్మిస్‌ అయ్యారు. అనంతరం మరో స్కూల్లో చేరి అక్కడ కూడా స్కాలర్‌షిప్‌ సాధిస్తూ తన చదువును కొనసాగించారు.

ఎమ్మెస్సీ తర్వాత బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక పోవడంతో ఉపాధి కోసం ట్యూషన్లు జీవితాన్నొ కొనసాగించారు. ఆ సమయంలో పరిశోధనల్లో కూడా నిమగ్నమయ్యారు. కొన్నాళ్ల  తర్వాత కలకత్తాలో అధ్యాపకుడిగా చేరిన ఆయన ఖగోళ భౌతిక శాస్త్రంపై పట్టు సాధించారు. గాజు పట్టకం ద్వారా సూర్యకాంతి ప్రసరించినప్పుడు ‘వర్ణపటం’ (Spectrum) ఎందుకు ఏర్పడుతుందో చెబుతూ.. ‘అయనీకరణ’ సూత్రాన్ని ప్రతిపాదించారు. దీని వల్ల సూర్యుని ఉష్ణోగ్రతలు, సౌష్టవం, సంయోజనం లాంటి ధర్మాలను విశ్లేషించారు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ (లండన్‌)గా ఎన్నికయ్యారు. అలహాబాదు యూనివర్శిటీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా వర్ణపట విజ్ఞానం (Spectroscopy), అయనావరణం (Ionosphere)పై పరిశోధనలు చేశారు. సూర్యకిరణాల బరువును, వత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఇంకా పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగాన్ని ప్రారంభించారు. దేశంలో పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్‌ ఆయన పర్యవేక్షణలోనే నిర్మితమైంది.

1923లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. అనంతరం 1927లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1938లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ కలకత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా ఖగోళ శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసి, ఎన్నో గౌరవాలు అందుకున్న ఈయన.. 1956 ఫిబ్రవరి 16వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megnad Swaha  Indian Astrophysicist  Indian Famous Scientists  

Other Articles