The Biography Of Adavi Baapiraju Who Was a famous Telugu novelist, poet, playwright, painter and art director | Telugu Famous People

Adavi baapiraju biography famous telugu novelist indian activist poet art director

Adavi Baapiraju biography, indian activists, non co-operation movement, british anti movements india, Adavi Baapiraju life story, telugu novelist, telugu famous peoples, telugu art directors, indian activists list

Adavi Baapiraju Biography Famous Telugu Novelist Indian Activist Poet Art Director : The Biography Of Adavi Baapiraju Who Was a famous Telugu novelist, poet, playwright, painter and art director. He is known for his works like Gonaganna Reddy, Narayanarao, Himabindu etc.

‘బాపి బావ’గా పేరుగాంచిన బహుముఖ ప్రజ్ఞశాలి

Posted: 09/22/2015 05:48 PM IST
Adavi baapiraju biography famous telugu novelist indian activist poet art director

అడివి బాపిరాజు.. ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన ఒకేసారి ఐదారు రంగాల్లో తన ప్రతిభ కనబరిచి ‘బహుముఖ ప్రజ్ఞాశీలి’ పేరుగాంచారు. లాయర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత ఎన్నో రచనలు చేశారు. నాటకాల్లో వున్న మక్కువ కారణంగా ఆ రంగంవైపు అడుగులు వేశారు. అంతేకాదు.. గొప్ప కళాకారుడు కూడా! ఈయన గురించి చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈయన స్వాంతంత్ర్య సమరయోధుడు కూడా!

బ్రిటీష్ పరిపాలనాకాలంలో వారి అరాచకాలను అణిచివేసేందుకు వెలుగులోకి వచ్చిన ఉద్యమాల్లోనూ ఈయన కీలకపాత్ర పోషించారు. ఆనాడు జైలు జీవితం కూడా అనుభవించారు. అప్పుడు ఆయన తన జైలు జీవితానుభవాలను, స్వాతంత్ర్యం విశిష్టతను వివరిస్తూ ‘తొలకరి’ నవలను రచించారు. మరొక విశేషం ఏమిటంటే.. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న ‘బావా బావా పన్నీరు’ పాట రాసింది ఈయనే. ఈ పాట బాగా పాపులర్ అవడంతో ఆనాడు సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా ‘బాపి బావ’ అని పిలిచేవారు. అలా ఆ విధంగా ఆయనకాపేరు వచ్చింది.

జీవిత విశేషాలు :

1895 అక్టోబర్ 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు బాపిరాజు జన్మించారు. భీమవరంలోనే హైస్కూలులో చదువు పూర్తి చేసిన ఈయన.. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివారు. ఆ తర్వాత మద్రాస్ ‘లా’ కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొందారు. పట్టా పొందిన అనంతరం న్యాయవాద వృత్తిలో చేరారు. ఆ వృత్తిలో కొంతకాలం కొనసాగిన ఆయన.. తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించారు.

1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా కొన్నాళ్లు పని చేశారు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. ‘నవ్య సాహిత్య పరిషత్’ స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. కాలక్రమంలో ఆయన తన కలంకు మరింత పదును చెప్పి.. చైతన్యం కలిగించే రచనలు, నవలలు రాసే స్థాయికి ఎదిగారు. ఈయన రాసిన నవల ‘నారాయణరావు’కు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో ‘సముద్ర గుప్తుడు’, ‘తిక్కన’ ప్రసిద్ధమయ్యాయి. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించారు.

అంతకన్నా ముందు.. బ్రిటీష్ పరిపాలకుల్ని దేశం నుంచి తరిమికొట్టేందుకు ఆనాడు అమరవీరులు చేసిన పోరాటాల్లో ఈయన కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్యం విశిష్టత వివరించి, తన వాక్చాతుర్యంతో ప్రజల్లో చైతన్యం కల్పించి, ఉద్యమం దిశగా నడిపిన వ్యక్తుల్లో బాపిరాజు ఒకరు. 1922లో సహాయ నిరాకరణోద్యమంలో బాపిరాజు పాల్గొన్నారు. ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. తన జైలు జీవితానుభవాలను ‘తొలకరి’ నవలలో పొందుపరచారు. ఈయన 1952 సెప్టెంబరు 22వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adavi Baapiraju  Telugu Famous Novelist  

Other Articles