The Biography Of Aluri Venkata Subbarao Who Is Famous With His Pen Name Chakrapani | Indian film Industry

Chakrapani aluri venkata subbarao biography indian film multilingual writer

Aluri Chakrapani, Aluri Chakrapani history, Aluri Chakrapani biography. Aluri Chakrapani history, Aluri Chakrapani special story, Aluri Chakrapani photos, Aluri Venkata Subba Rao, Aluri Chakrapani Writings

Chakrapani Aluri Venkata Subbarao Biography Indian film multilingual writer : The Biography Of Aluri Venkata Subbarao Who Is Famous With His Pen Name Chakrapani. He was an Indian film multilingual writer, producer and director known for his works in predominantly in Telugu cinema & he won 2 Filmfare Awards for Telugu films.

చక్రపాణి.. ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త-రచయిత

Posted: 08/06/2015 04:14 PM IST
Chakrapani aluri venkata subbarao biography indian film multilingual writer

ఏదైనా ఓ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని కృషి చేసిన వారిలో చక్రపాణి ఒకరు. ఈయన అసలు పేరు ఆలూరు వెంకట సుబ్బారావు. ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని బహుభాషావేత్తగా ఎదిగారు. తెలుగు రచయితగా ప్రఖ్యాతిపేరు గడించారు. అంతేకాదు.. సినీరంగంలో ఓ నిర్మాతగా, దర్శకుడిగా ప్రత్యేక ముద్ర వేయించుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈయనను బహుముఖ ప్రజ్ఞశాలిగా అభివర్ణించవచ్చు.

జీవిత విశేషాలు :

1908 ఆగష్టు 5వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు చక్రపాణి జన్మించారు. వీరిది ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. చక్రపాణి బాల్యం నుంచే ఎంతో చురుకుగా వుండేవారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి.. యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి కృషి చేసిన వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. ఈ క్రమంలోనే ఆయన రచనలు మొదలుపెట్టారు.

‘చక్రపాణి’ అనే కలం పేరును తనకుతానే ఆయన ప్రసాదించాడు. ఆ తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం పొందారు. 1932లో చక్రపాణి క్షయ వ్యాధిగ్రస్తుడైనప్పుడు మదనపల్లిలోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు వున్న ఈయన.. సాటి రోగి అయిన ఒక పండితుని సహాయంతో బెంగాలీ భాషను కూడా నేర్చుకొన్నారు. అలా ఆ భాషను నేర్చుకున్న అనంతరం ఈయన ‘బెంగాలీ’ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.

చిత్రపరిశ్రమలో చక్రపాణి పాత్ర :

రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన ఈయన.. కొన్ని సినిమాలకు రచయితగానూ పనిచేశారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ స్థానానికి చేరుకున్న అనంతరం నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 1940లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ‘ధర్మపత్ని’ కోసం ఈయన మాటలు వ్రాసారు. ఆ తర్వాత బి.ఎన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’కు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళారు.

ఆ సమయంలోనే అంటే.. 1949-1950లో ఈయనకు నాగిరెడ్డితో పరిచయం కావడం.. వారిద్దరూ కలిసి విజయా ప్రొడక్షన్స్ ను స్థాపించడం... సినిమాలు తీయాలని నిర్ణయించడం అంతా జరిగిపోయింది. జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అద్భుత ఖండాలను తెరకెక్కించారు.

చక్రపాణి కేవలం సినిమాలకే పరిమతం కాకుండా నాగిరెడ్డితో కలసి పిల్లలకోసం ‘చందమామ కథల’ పుస్తకం ప్రారంభించారు. 1934-1935లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను ప్రారంభించారు. 1960లో దీనిని హైదరాబాదుకు తరలించారు. ఇలా అన్నిరంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈయన.. 1975 సెప్టెంబరు 24వ తేదీన తుదిశ్వాస విడిచారు.

రచయితలు :

* స్వయంవర్ (1980) (కథ)
* శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (రచయిత)
* జూలీ (1975) (చిత్రానువాదం)
* గుండమ్మకథ (1962) (కథ)
* మనిదన్ మారవిల్లై (1962) (చిత్రానువాదం)
* రేచుక్క పగటిచుక్క (1959) (చిత్రానువాదం)
* అప్పుచేసి పప్పు కూడు (1958) (చిత్రానువాదం)
* మాయాబజార్ (1957/II) (చిత్రానువాదం)
* మిస్సమ్మ (1955) (రచయిత)
* చంద్రహారం (1954) (రచయిత)
* పెళ్లిచేసి చూడు (1952) (రచయిత)
* షావుకారు (1950) (రచయిత)
* స్వర్గసీమ (1945) (మాటలు, కథ)
* ధర్మపత్ని (1941/I) (మాటలు)
* ధర్మపత్ని (1941/II) (మాటలు)
* చక్రదత్త (బెంగాలీ నవలకు అనువాదం)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aluri Chakrapani  Telugu Writers  Indian Film Industry  

Other Articles