darbha ramsha biography | famous telugu news editor

Darbha ramsha biography famous telugu writer news editor

darbha ramsha news, darbha ramsha biography, darbha ramsha history, darbha ramsha wikipedia, darbha ramsha stories, darbha ramsha life story

darbha ramsha biography famous telugu writer news editor : The Biography of Famous Andhra telugu Editor Darbha Ramsha. He wroter number of stories which impressed everyone.

‘ఆంధ్రాహేవలాక్‌ ఎల్లీస్‌’గా పిలువబడే రాంషా

Posted: 03/25/2015 07:22 PM IST
Darbha ramsha biography famous telugu writer news editor

రాంషా.. పేరుమోసిన ఒక గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన తన కథలు, నవలలు, నాటకాలు, కవితలు, విమర్శలు తదితర కళల ద్వారా ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థిదశలోనే సాహిత్యరంగంలో ప్రవేశించిన ఈయన.. అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. 24 ఏళ్లు పూర్తిగా నిండేలోపే ఇతడి కలం ద్వారా వెలువడిన రచనలు ఈయనకు ఖ్యాతి తెచ్చిపెట్టాయి.

జీవిత చరిత్ర :

1924 జూలై 30వ తేదీన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో నివాసముండే వేంకటరత్నం, దర్భా వేంకటరమణయ్య దంపతులకు రాంషా జన్మించారు. ఈయన అసలు పేరు వేంకటరామశాస్త్రి! రాంషా పుట్టింది ధనిక కుటుంబంలోనే అయినప్పటికీ.. తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల ఇతడి విద్యాభ్యాసం, మధ్య వయస్సు జీవితం పేదరికంలోనూ, సమస్యల ముళ్ళబాటలోనూ గడిచింది. ఈయన లేతవయసులో వుండగానే తల్లి మరణించగా.. పెదతల్లి పెంపకంలో అనాదరణ అనుభవించాల్సి వచ్చింది. దాంతో చిన్నవయసులోనే గ్రంధ పఠనాన్ని ఆశ్రయించడం జరిగింది.

ఇక ఈయన విద్యాభ్యాసం.. స్కూలు ఫైనల్ వరకూ సామర్లకోటలోనూ, కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఎఫ్.ఎ. చదివారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ఈయన ‘శిలాప్రతిమ’ అనే నాటిక రచించి రజత పతకం బహుమతి పొందారు. ఆనాడు ఈయనలో దాగి వున్న ప్రతిభని నిడుదవోలు వేంకటరావు గుర్తించి.. ఇతడికి “విఙ్ఞానానికి పరాకాష్ఠగా విలసిల్లాలని” ‘రాంషా’ (రామ్ శాహ్) అని పేరు పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఈయన కొన్ని తరాలపాటు రాంషాగా ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు. 1948లో శిరీషతో ఈయన వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు స౦తాన౦.

జీవిత విశేషాలు :

రాంషా కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఈయనకు కళాశాల విద్యార్థి నాయకుడూ, యువకవీ అయిన శ్రీ సోమసుందర్‌ తో పరిచయం ఏర్పడింది. ఆనాటినుంచే వారిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. అలా స్నేహితులుగా మారిన వీళ్లిద్దరు కలిసి 1944 నుంచి 1955 వరకు కమ్యూనిస్ట్ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించారు. అప్పట్లో ‘మార్క్స్’ రచనలు ఇతడిని బాగా ప్రభావితం చేశాయి. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థల గురించి మార్క్స్ వ్యాఖ్యానిస్తూ అప్పటికి వ్యాప్తంలో ఉన్న బ్రాహ్మణ ఆర్థిక వ్యవస్థ ఔన్నత్యాన్ని పదే పదే చెబుతూ ఉండేవాడు. అయితే.. కాలక్రమంలో సంసార బాధ్యతల వల్ల సంపాదనావసరాలు పెరిగి ఉద్యోగాన్వేషణలో పడ్డాడు. దీంతో కమ్యూనిష్టు ఉద్యమంలోంచి విరమించుకున్నాడు.

మొదట చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ కాలం గడిపిన ఈయన.. 1957లో జీవనోపాధికై ‘ధర్మచక్ర పవర్ ప్రెస్’ను స్థాపించడం జరిగింది. కానీ.. ఆ ప్రెస్ కి అచ్చు వేయించుకున్నవారు మళ్లీ వచ్చేవారు కాదట. దాంతో తనే పుస్తకాలు వ్రాసి తనే అచ్చువేసుకుని అమ్ముకోవటం మొదలు పెట్టారు. 1960లో ధనికొండ హనుమంతరావు తన అభిసారిక పత్రిక నిర్వహణను చేపట్టమని రాంషాకు సూచించటం జరిగింది. ఆనాటి నుంచీ ఈయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 30 ఏళ్ళపాటు ఈ పత్రికను నడుపుతూ ఉన్నత స్థాయికి తీసుకువచ్చారు.

1990, ఫిబ్రవరి 8వ తేదీన రాజమండ్రిలో ఏటేటా జరిగే పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవాన్ని తిలకించేందుకు, తన కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆర్‌.టి.సి. బస్సు ఢీకొనడంతో, కవి మిత్రుడు గోదావరిశర్మతో సహా రాంషా దుర్మరణం పాలయ్యాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : darbha ramsha  telugu editors  telugu writers  

Other Articles