Thotakura venkata raju biography telugu tamil music director

thotakura venkata raju biography, thotakura venkata raju music director, thotakura venkata raju life story, thotakura venkata raju history, thotakura venkata raju movies, thotakura venkata raju story, thotakura venkata raju family members

thotakura venkata raju biography telugu tamil music director : The biography of a famous music director thotakura venkataraju who is worked in tamil and telugu industries.

తెలుగు-తమిళ భాషాచిత్రాల్లో సుస్వరాలు అందించిన రాజు

Posted: 02/21/2015 07:30 PM IST
Thotakura venkata raju biography telugu tamil music director

చలనచిత్ర రంగంలో సంగీత దర్శకుని పాత్ర ఎంతో కీలకంగా వుంటుందన్న విషయం తెలిసిందే! అతను అందించే బాణీలు ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే.. తమ పాటల ద్వారే సినిమాను నడింపించినవారు ఎంతోమంది వున్నారు. అంటే.. ఎంతో అద్భుతంగా, మరణీయంగా పాటలు సమకూర్చి, ప్రేక్షకుల గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయినవారు చాలామంది వున్నారు. అటువంటివారిలో టి.వి.రాజు ఒకరు! ఈయన తెలుగు, తమిళ భాషాచిత్రాలకు తన మధురమైన బాణీలను అందించారు.

జీవిత చరిత్ర :

1921 అక్టోబరు 25వ తేదీన రాజమండ్రి తాలూకా రఘుదేవపురంలో జన్మించారు. ఈయన పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. బాల్యం నుంచే ఈయనకు సంగీతం అంటే ఎంతో ఆసక్తి వుండేది. అందుకే.. ఈయన స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. ఆ సమయంలోనే ఈయన ఎంతో అద్భుతంగా స్వరాలు సమకూర్చేవారు. అదిచూసి ఆచార్యులు ఈయనను ప్రశంసించేవారు. ఇలా ఒక్కొక్కరి సంగీత దర్శకుల దగ్గర ఈయన పనిచేస్తూ.. వారి నుంచి స్వరపాఠాలు నేర్చుకునేవారు.

ఈ క్రమంలోనే ఈయన సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు దగ్గర సహాయకునిగా పనిచేశారు. 1950లో విడుదలైన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాకు ఆదినారాయణ పాటలు అందించగా.. అప్పుడు ఆయనతో రాజు కూడా సహాయనికునిగా పనిచేశాడు. అదే ఆయన జీవితంలో మలుపు తిప్పింది. ఆయన అందించిన స్వరాలు ప్రేక్షకులకు బాగానే నచ్చాయి. దీంతో ఆయనకు సంగీత దర్శకునిగా అవకాశం వచ్చింది. 1952లో వచ్చిన ‘టింగురంగ’ చిత్రానికి ఈక్ష్న సంగీత దర్శకునిగా పనిచేసి, తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు.

70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీయార్, కె.విశ్వనాథ్‌ల సినిమాలకు సంగీతం సమకూర్చారు. ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని సంచలన విజయంగా నిలిచాయి. ఏ విధంగా అయితే సినిమాలు విజయం సాధించాయో.. అదేవిధంగా ఆ సినిమాలు రాజును సంగీత దర్శకునిగా అందనంత ఎత్తుకు తీసుకెళ్లాయి. అందులో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి.

వ్యక్తిగత జీవితం :

సంగీత దర్శకునిగా తనను తాను నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఈయన తన 33వ ఏటలో సావిత్రితో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. వారిలో పెద్దవాడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు గిటారిస్ట్ గా పేరుపొందగా.. రెండవ కుమారుడు తోటకూర సోమరాజు. ఈయన ‘సిసింద్రీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thotakura venkata raju biography  telugu famous music directors  

Other Articles

  • Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

    క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

    Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more

  • Freedom fighter father of telangana konda laxman bapuji

    తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

    Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

  • Telanagana recalls professor jayashanker on his death annivesary

    తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

    Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

  • Prominent freedom fighter subash chandrabose biography

    అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

    Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

  • A tribute to ghantasala venkateswara rao on his birthday

    ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

    Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more

Today on Telugu Wishesh