Subash chandrabose biography

Subash Chandrabose, Subash Chandrabose biography, Subash Chandrabose mystery, Subash Chandrabose death mystery, netaji, netaji alive, subash chandrabose alive, court on netaji alive, indian freedom fight, indian national congress history, latest news updates

Subash Chandrabose biography : he is one of main Indian Freedom Fighter with revolutionary thoughts. subash chandrabose started Indian National Army and for freedom bose supports nazi leader Hitler. Netaji death is a mytery for now also.

స్వాతంత్ర్యం కోసం జీవితం ధారపోసిన బోస్

Posted: 01/06/2015 03:50 PM IST
Subash chandrabose biography

భారత దేశ స్వాతంత్ర సంగ్రామానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. భరతమాత సంకెళ్ళు విడిపించేందుకు జీవితమంతా ఫణంగా పెట్టారు. ఎవరికి తోచిన విధంగా వారు ఉద్యమంగా కదిలారు. అందరి లక్ష్యం.., అంతిమ మార్గం ఒకటే అదే దేశాన్ని బ్రిటీష్ చెర నుంచి బయటకు తీసుకురావటం. ప్రాణాలు పోయినా సరే ప్రజలకు స్వేచ్ఛా పరిమళాలు అందించాలని పోరాడిన నేతలు ఎందరో ఉన్నవారు. ఆ వీరులందర్నీ మనం ఇప్పటికీ స్మరించుకుంటున్నాం. కానీ దేశ చరిత్రలో ఇప్పటికీ, ఎప్పటికీ ఓ అంశం మాయని మచ్చ మిగిలి ఉంది. అదే సుభాష్ చంద్రబోస్ అదృశ్య మిస్టరీ. అంతుచిక్కని అంశంగా ఉన్న ఈ వ్యవహారంపై ఎన్నో వివాదాలు, అనుమానాలు ఉన్నాయి. ఉద్యమం, హిట్లర్ తో సన్నిహిత సంబంధాలు, జీవితమంతా వివాదాల మయంగా గడిపిన నేతాజి గురించి ఓ సారి తెలుసుకుందాం.

నేతాజీగా పేరు పొందిన సుభాష్ చంద్రబోస్ ఒడిశాలోని కటక్ పట్టణంలో 1897లో పుట్టాడు. తండ్రి న్యాయవాది, తీవ్ర జాతీయ భావాలు కల వ్యక్తి. ధనికుల కుటుంబంలో పుట్టినా బోస్ కు ప్రజా సేవ, జాతీయ భావాలు తండ్రి నుంచి వచ్చాయి. బోస్ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో నాల్గవ ర్యాంకు సాధించాడు. సివిల్ సర్వీసు ఉద్యోగం వచ్చినా.., వదిలేశాడు. దేశ స్వాతంత్ర్యం కంటే ఉద్యోగం ముఖ్యం కాదనుకుని పోరాటం మొదలు పెట్టాడు. అప్పటికే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో గాంధీతో కలిసి పోరాటంలో ముందుకు కదిలాడు. మహాత్ముడి సూచనల ప్రకారం కలకత్తాలో సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టాడు. కాలక్రమంలో ఐరోపా వెళ్ళిన బోస్ అక్కడి పరిస్థితులు, పరిచయాలు కొత్త మార్గాలను చూపించాయి. భారత్ స్వతంత్ర్య దేశంగా ఏర్పడాలంటే ఇతర దేశాల సహకారం, సొంత సైన్యం తప్పనిసరి అని భావించాడు. ఇందుకోసం ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టాడు.

ఐరోపా నుంచి 1938లో తిరిగి వచ్చి గాంధీని వ్యతిరేకించాడు. భారత జాతీయ కాంగ్రెస్ అద్యక్షుడిగా పట్టాభి సీతారామయ్యపై గెలిచాడు. ఆ తర్వాత గాంధీతో ఏర్పడ్డ అభిప్రాయ విభేదాలు పార్టీకి బోస్ ను దూరం చేశాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ‘అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టి’ని స్థాపించాడు. ఆ తర్వాత దేశ పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చాయి. అప్పటికి దేశాన్ని పాలిస్తున్న బ్రిటీష్, కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారత్ తరపున యుద్ధం ప్రకటించింది. దీన్ని నేతాజీ తీవ్రంగా వ్యతిరేకించారు. తమపై నిరసనలు తెలుపుతున్న నేతాజీని జైల్లో పెట్టించింది. ఆ తర్వాత హౌజ్ అరెస్ట్ కూడా చేయించి నియంత్రణ విధించింది.

బ్రిటీష్ ఆంక్షలున్నా వేషం మార్చుకుని పాక్, ఆఫ్ఘన్ దేశాల నుంచి రష్యాకు అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళాడు. బెర్లిన్ చేరుకున్న బోస్ ఆజాద్ హింద్ రేడియో మొదలు పెట్టాడు. స్వాతంత్ర్య కాంక్షను చాటేలా ప్రసంగాలు చేసేవాడు. వివిధ ప్రాంతాల్లో బంధీలుగా ఉన్న భారతీయులను విడిపించాడు. వీరితో ఒక సైన్యంను తయారు చేశాడు. ఆ తర్వాత హిట్లర్ ఆధీనంలోని నాజీ సైన్యంతో చేతులు కలిపాడు. భారతీయులు, జర్మన్ జాతీయులు కలిసిన ఈ సైన్యం హిట్లర్, బోస్ కు విధేయులుగా ఉండేవారు. జర్మన్ ను కాపాడటంతో పాటు, భారత్ కు స్వతంత్ర్య పోరాటంలో సహకారం అందించే లక్ష్యంతో ఈ సైన్యం పనిచేసేది. అయితే బోస్ నిర్ణయాన్ని కొందరు జాతీయ వాదులు తప్పుబట్టారు. బ్రిటీష్ వారిని తరిమికొట్టిన తర్వాత నాజీలు దేశం విడిచి వెళ్తారని ఎలా నమ్మవచ్చు అని చాలామంది ప్రశ్నించారు.

అనుమానించినట్లుగానే జర్మన్ సైన్యం భారత్ అవసరాలను పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ అనేక మార్గాల ద్వారా సింగపూర్ చేరుకుని అప్పటికే కొనసాగుతున్న భారత జాతీయ సైన్యం పగ్గాలను చేపట్టాడు. బోస్ రాకతో కొత్త ఊపిరి పీల్చుకున్న సైన్యం.., దేశ పోరాటానికి సన్నద్ధమైంది. ‘మీరు రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’ అంటూ 1944లో చేసిన ప్రసంగం ఉత్తేజపరిచింది. ఎంతోమంది జాతీయ వాదులు సైన్యంలో చేరటంతో పాటు, ఆర్ధిక సాయం అందించారు. ఇలా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న జీవితం అనుకోని మలుపు తిరిగింది. 1945 ఆగస్టు 18న టోక్యోకు వెళ్ళేందుకు ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురయినట్లు వార్త వచ్చింది. ఈ ప్రమాదంలో బోస్ సహా మిగతా వ్యక్తులంతా చనిపోయారని చెప్పారు.

బోస్ మరణించినట్లు ప్రకటన వచ్చినా.., చాలామంది దాన్ని నమ్మలేదు. స్వాతంత్ర్యం వచ్చిన చాలా కాలానికి విచారణ చేపట్టిన ముఖర్జీ కమిటీ టోక్యో విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, అసలు తైవాన్ లో 1945 ఆగస్టు 18న ఏ విమానం కూలిపోలేదని నిర్ధారించింది. ఈ నివేదికను పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. అయితే నాటి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదికను తిరస్కరించింది. ఇలా అనేక మలుపులు తిరిగిన నేతాజీ జీవితం నేటికి మిస్టరీగా మిగిలింది. ఈ మద్య కూడా ఓ వ్యక్తి నేతాజీ బ్రతికి ఉన్నారనీ.., కోర్టు అనుమతి ఇస్తే ప్రవేశపెడతామని చెప్పాడు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విచారణతో అయినా మహనీయుడి మరణం మిస్టరీ వీడాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subash Chandrabose  Netaji mystery  latest news  

Other Articles

Today on Telugu Wishesh