Surendranath banerjee biography first indian political leader cast discrimination indian freedom fighters

surendranath banerjee news, surendranath banerjee biography, surendranath banerjee history, surendranath banerjee life history, surendranath banerjee indian politician, surendranath banerjee wikipedia, surendranath banerjee wiki in telugu, surendranath banerjee telugu news, indian politician, indian national congress

surendranath banerjee biography first indian political leader cast discrimination indian freedom fighters

బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకుడు

Posted: 11/29/2014 01:06 PM IST
Surendranath banerjee biography first indian political leader cast discrimination indian freedom fighters

బ్రిటీష్ పరిపాలన కాలంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఆనాటి తొలి రాజకీయ నాయకుల్లో సర్ సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. బ్రిటీష్ కాలంలో జాతివివక్షకు గురైన ఈయన.. అందుకు వ్యతిరేకంగా గళం విప్పి జనాకర్షణకు గురయ్యారు. అలా ఆ విధంగా ప్రసంగాలతో ప్రజలమధ్యలో చేరిన ఆయన.. ఆ నేపథ్యంలో జాతీయవాద, ఉదారవాద రాజకీయ అంశాలతోబాటు భారతీయ చరిత్రపై కూడా బహిరంగంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు. విద్యార్థి జీవితంలో తాను అనుభవించిన కష్టాలు మరొకరు ఎదుర్కోకూడదనే భావనతో ఆయన విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. అలా జనాల మధ్యలో వచ్చిన ఆయన.. రాజకీయరంగంలో ప్రవేశించి దేశానికి తనదైన సహాయాన్ని అందించారు.

జీవిత విశేషాలు :

1848 నవంబర్ 10వ తేదీన బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సురేంద్రనాథ్ బెనర్జీ జన్మించారు. ఆయన తన ప్రాథమిక విద్యను పేరెంటల్ అకడెమిక్ ఇన్స్టిట్యూషన్, హిందూ కాలేజ్‌లలో అభ్యసించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడు అయిన ఆయన.. ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షల్లో పోటీపడేందుకు 1868లో ఇంగ్లాండుకు వెళ్లగా.. 1869లో అందులో ఉత్తీర్ణులయ్యారు. అయితే ఆనాడు ఆయన ఖచ్చితమైన వయస్సుపై వివాదం రావడంతో ఆయన బహిష్కరించబడ్డారు. కానీ పట్టువదలకుండా ఆయన తన వయస్సు విషయాన్ని పరిష్కరించుకున్న అనంతరం తిరిగి 1871లో ఆ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. దాంతో ఆయన సిల్హెట్లో మాజిస్ట్రేట్ గా నియమించబడ్డారు. అయితే ఆనాడు జాతివివక్ష వల్ల ఆ ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. దీనిని ఆక్షేపించేందుకు ఆయన ఇంగ్లాండుకు వెళ్లి ఎన్నో ప్రయత్నాలు చేశారుగానీ.. చివరకు విఫలమయ్యారు. దీంతో ఆయన 1875 జూన్’లో ఇంగ్లాండు నుంచి దేశానికి తిరిగొచ్చారు. వచ్చిన అనంతరం మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూషన్, ఫ్రీచర్చ్ ఇన్స్టిట్యూషన్’లతోబాటు ఆయనచే స్థాపించబడిన రిపన్ కాలేజ్‌లలో ఆంగ్ల భాష ఆచార్యుడిగా కొనసాగారు.

రాజకీయ జీవితం :

జాతివివక్షకు గురైన బెనర్జీ ఆ విషయం ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో ఆయన జాతీయవాద, ఉదారవాద రాజకీయ అంశాలతోపాటు భారతీయ చరిత్రపై కూడా బహిరంగ ఉపన్యాసాలివ్వడం ప్రారంభించారు. 1876వ సంవత్సరం జూలై 26న ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌’ పేరిట మొదటి రాజకీయసంస్థను స్థాపించారు. ICS పరీక్షలకు హాజరయ్యే భారతీయ విద్యార్థుల వయో-పరిమితి అంశాన్ని ఎదుర్కొనేందుకు ఆయన ఈ సంస్థను ఉపయోగించారు. దేశమంతటా ఉపన్యాసాలతో భారతదేశంలో బ్రిటీషు అధికారులచే నిర్వహించబడిన జాతి వివక్షను ఖండించారు. ఇదే ఆయనను జనాకర్షకునిగా చేసింది. 1879లో ఆయన ‘ది బెంగాలీ’ వార్తాపత్రికను స్థాపించారు. 1883లో తన పత్రికలో కొన్ని సంచలన వ్యాఖ్యలను ప్రచురించినందుకు న్యాయస్థానధిక్కారం క్రింద ఆయన నిర్బంధింపబడ్డాడు. ఆ సమయంలో బెంగాల్’తోబాటు ఆగ్రా, ఫైజాబాద్, అమ్రిత్‌సర్, లాహోర్, పూణే వంటి భారతీయ నగరాలలో నిరసనలు భగ్గుమన్నాయి.

1885లో బొంబాయిలో ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌’ను స్థాపించిన తరువాత వారి ఉమ్మడి లక్ష్యాలు, సభ్యత్వాల వల్ల బెనర్జీ తనసంస్థను దానిలో విలీనం చేశారు. 1895లో పూనాలో, 1902లో అహ్మదాబాదులో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1905లో బెంగాల్ రాష్ట్రవిభజనను వ్యతిరేకించిన ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ అత్యంత ప్రముఖులు. ఆనాడు ఆయన చేసిన ఉద్యమాల వల్ల చివరకు 1912లో విభజనను బ్రిటీషువారి నిష్ర్కమించారు. రాజకీయ స్వాతంత్ర్యానికై వాదించిన ‘‘అతివాదులు’’ 1906వ సంవత్సరంలో పార్టీని విడిచిపెట్టిన తరువాత బ్రిటీషు వారితో సర్దుబాటు చేసుకునేందుకు ఇష్టపడిన అత్యంత జ్యేష్ఠ ‘మితవాద’ కాంగ్రెస్ నాయకులలో బెనర్జీ కూడా ఒకరు. విదేశీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారతదేశంలో తయారుచేయబడిన వస్తువులకై వాదించిన బెనర్జీ స్వదేశీ ఉద్యమంలో ఒక ముఖ్య వ్యక్తి. శిఖరాగ్రంపై ఉన్న ఆయన జనాకర్షణ, అభిమానుల మాటలలో ‘‘బెంగాల్ కిరీటంలేని రాజు’’ను చేసింది.

1925వ సంవత్సరంలో మరణించిన బెనర్జీ... రాజకీయంగా సామ్రాజ్యాన్ని సమర్థించినందుకు ‘నైట్’ బిరుదుతో సత్కరింపబడ్డారు. బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించే సమయంలో ఆయన కలకత్తా మునిసిపల్ కార్పోరేషన్‌ను మరింత ప్రజాస్వామిక వ్యవస్థగా చేశారు. భారత రాజకీయాల అధికారీకరణకు మొదటిగా బాట వేసిన వానిగా - నేడు ఆయన భారత రాజకీయాల మార్గదర్శ నాయకునిగా బాగా గుర్తుంచుకోబడుతున్నారు. విరివిగా శ్లాఘించబడిన ‘‘ఎ నేషన్ ఇన్ మేకింగ్’’ అనే ఒక ముఖ్యమైన రచనను ఆయన ప్రచురించారు. బ్రిటీషువారు ఆయన చివరి సంవత్సరాలలో ‘‘సరెండర్ నాట్’’ బెనర్జీగా గౌరవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh