తెలుగు రచయితల్లో కొంతమంది కొన్ని ప్రత్యేకకథనాల తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. అందులో కొడవటిగంటి కుటుంబరావు ఒకరు. ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పదిపన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేశారు. ముఖ్యంగా ‘‘చందమామ పత్రిక’’ను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా భావించిన ఆయన.. ఆ తరహాలోనే ఎన్నో రచనలు చేసి ప్రసిద్ధి చెందారు. ఈయన తన పేరుకంటే ‘‘కొకు’’ అనే పొడి అక్షరాల ద్వారా పేరుపొందాడు.
జీవిత చరిత్ర :
1909 అక్టోబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తన చిన్నవయస్సులోనే అంటే 1904లో తండ్రిని, 1920లో తల్లిని కోల్పోవడంతో మేమమామ వద్దే పెరిగాడు. దీంతో ఆయన చిన్నతనం మొత్తం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. తన పాఠశాల చదువును 1925 వరకు కొనసాగించారు. ఉన్నత విద్య పూర్తికాకముందే 11 ఏళ్ల పద్మావతితో ఆయన పెళ్లి జరిగింది. గుంటటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తిచేసిన అనంతరం.. 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బి.ఏ. ఫిజిక్సు చదివారు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. బి.ఏ. చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయాడు. కవి - రచయిత అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా ఈయన సాహితీ రంగప్రవేశం జరిగింది.
బి.ఏ. చదువుకుంటున్న సమయంలో 1930లో కొకు తొలిరచన ‘‘సినిమా’’ ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. తర్వాత ఆయన మొదటికథ ‘‘ప్రాణాధికం’’ గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానంలో పేరుగాంచింది. అయితే అప్పట్లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం అలుముకోవడంతో ఆయన ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. ఇక బతుకుదెరువు ఆయన 1931లో కొంతకాలంపాటు వరంగల్లులో పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. తర్వాత ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఆయన చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ‘‘యువపత్రిక’’ను ప్రారంభించారు. అంతా సాఫీగానే సాగుతున్న తరుణంలో కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆయన భార్య పద్మావతి 1939లో మరణించింది. ఆ బాధతో కొంతకాలం కుంగిపోయిన ఆయన.. తిరిగి 1940-42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేశారు.
1942లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి 1943 జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. 1944 లో ఒరిస్సా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు. ఈ కాలంలోనే ఆయన రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. కానీ ఆమె కూడా రెణ్ణెల్లకే అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. 1948లో మూణ్ణెల్లపాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. 1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. తర్వాత 1952 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి.. ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో సహాయసహకారాలు అందించారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more