Happy 63rd birthday superstar rajinikanth

Rajinikanth, Superstar Rajinikanth, 63rd birthday Superstar Rajinikanth Rajinikanth birthday special, Rajinikanth turns 63,

Happy 63rd birthday Superstar Rajinikanth

రజనీ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని అభిమానులు ఫిక్స్‌య్యారు

Posted: 12/12/2013 09:25 PM IST
Happy 63rd birthday superstar rajinikanth

ఆయన తెరమీద కనిపిస్తే చాలు అది స్టైలుకు స్టైలు. ఇండియన్ ఫిల్మ్‌ స్టామినాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి విదేశాల్లోనూ తన సినిమా పట్ల క్రేజ్‌ క్రియేట్‌ చేసుకున్న నటుడు రజనీకాంత్‌. రజనీ డైలాగ్‌ చెప్పినా.. నడిచినా.. పరుగెత్తినా.. చేయి ఊపినా.. గన్‌ తిప్పినా.. సిగరెట్‌ వెలిగించినా.. ఆ స్టయిలే ఓ డిఫరెంట్‌. సౌతిండియా సినిమాల్లో నంబర్‌వన్‌గా ఎదిగిన రజనీకాంత్. ఈ రోజు తమిళనాడులో పెద్ద పండగ రోజు. అక్కడ ఆయన అభిమానులు ఆనందంతో ఊగిపోతారు. సూపర్ స్టార్ రజనీకి బర్త్ డే విషెస్ అందిస్తూ సూపర్ సినీ కెరీర్ విశేషాలు ..

 

పట్టుదలే పెట్టుబడిగా తారజువ్వలా తార స్థాయికి ఎదిగిన నటుడు రజినీకాంత్‌. ఆయన జీవితమే ఒక సినిమా. సాధారణ కండక్టర్ గా జీవితం ప్రారంభించిన రజనీ శివాజీ సినిమాకు తీసుకున్న ఫీజు అక్షరాలా నలభై కోట్ల రూపాయలు. అప్పుడు ఇది ఆసియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్. తమిళ్‌, తెలుగు, హిందీ బాషల్లో రిలీజైన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్‌ చేసింది. అంతేకాదు అప్పట్లోనే ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీయే అంటూ నేషనల్ మీడియా కోడై కోసింది.

 

నా దారి రహదారి.. డొంట్‌ కమిన్‌ మై వే.. అన్న రజినీకాంత్‌ జీవితం, సినీ జీవితం రహదారి ఏం కాదు. 1950 డిసెంబర్‌ 12న బెంగుళూర్‌లోని ఓ పోలీస్‌ కానిస్టెబుల్‌ కుటుంబంలో పుట్టాడు. ఆయన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌. ఐదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. తండ్రిది అంతంత మాత్రం ఆదాయం. రజినీది అంతంత మాత్రం చదువు. ధ్యాసంతా నటనపైనా, నాటకాలపైనా. బతుకు దెరువు కోసం బస్‌ కండక్టర్‌గా చేశాడు. ఇంటి దగ్గర వున్న హనుమంతుడి గుడి దగ్గర ఫైట్స్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. బస్‌ కండక్టర్‌గా చేస్తూ ప్యాసింజర్ల హావభావాలను శ్రద్దగా పరిశీలించేవాడు. రజినీ వాటం చూసిన ప్రయాణీకులు ఎప్పటికైనా హీరో అవుతావని దీవించే వారు. అదే రజినీలో నటుడ్ని సజీవంగా వుంచాయి.

 

పడి లేచిన కెరటం..

ఓ నిరంతర శ్రమ.. ఓ నిత్యకృషి .. ఓ ఆశయం.. ఓ ఆదర్శం.. ఇవన్నీ కలిస్తే అది రజినీకాంత్‌. ఎన్నో కష్టాల ఆటుపోట్లు.. ఎన్నో కన్నీళ్ల ఆలలు.. ఎన్నో ఆడ్డంకులు .. ఇవన్నీ ఎదుర్కోని సూపర్‌స్టార్‌గా ఎదిగిన గ్రేట్‌ యాక్టర్‌ ఆయన. చిన్న వయసు నుంచే గుండెలనిండా.. మెండుగా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని సినీ కెరీర్‌ ప్రారంభించాడు.

 

రజనీ ఇరవై నాలుగేళ్ల వయసులో మద్రాస్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. కె.బాలచందర్‌ దృష్టిలో పడ్డ రజినీకాంత్‌ అపూర్వ రాగంగల్‌ సినిమాతో తొలి అడుగు వేశాడు. మరుసటి ఏడాది కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్‌ కథ సంగమ చిత్రంలో నటించాడు. చిన్నా చితక సినిమాల్లో నటించిన రజినీకి బ్రేక్‌ ఇచ్చింది ఎస్పీ ముత్తురామన్‌ తీసిన భువన ఒరు కెల్విక్కురి. ఫస్ట్‌ హప్‌లో విలన్‌గా, సెకండ్‌ హఫ్‌లో హీరోగా నటించిన రజినీని తమిళ ప్రేక్షకులు ఆహ్వానించారు. అంతులేని కథలో చెల్లిలితో వెటకారం ఆడుతూ జీవిత తత్వాన్ని చెప్పే తాగుబోతుగా రజినీ తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

 

రజినీకాంత్‌ కెరీర్‌ బిల్లా సినిమాతో ఓ మలుపు తిరిగింది. హిందీ డాన్‌కు తమిళ రూపం. మురాత్తు కాలై, పోకిరి రాజా, తనికట్టు రాజా, నాన్‌ మహన్‌ అల్ల, పుదుకవితై, వేలైక్కారన్‌, థీ ఎన్నో సినిమాలు రజినీని తమిళంలో సూపర్‌స్టార్‌ని చేశాయి. ఆమెకథ, అన్నదమ్ముల సవాల్‌, వయసు పిలిచింది, రాం రాబర్ట్‌ రహీం, దళపతి లాంటి చిత్రాలతో తెలుగులో కూడా పూర్తి స్థాయి హీరోగా రజినీని రిసీవ్‌ చేసుకున్నారు. రజనీ ప్రతి సినిమా ఓ సెన్సేషనే. దళపతి లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించినా.. రజనీ టాలీవుడ్‌ ఆడియెన్స్‌కు దగ్గరయ్యింది మాత్రం బాషా చిత్రంతోనే. రజనీ ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టే అని అభిమానులు ఫిక్స్‌య్యారు.

 

ముత్తు సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. విచిత్రమేమిటంటే ఈ సినిమాతో జపాన్‌ వాసుల్లోనూ రజనీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా… రజనీ అంటే ఇప్పటికి ముత్తు హీరోగానే చూస్తారు జపాన్‌ వాసులు.. అంతలా వారిని ఆకట్టుకుంది ఈ చిత్రం. శివాజీ తర్వాత రజినీ-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చి అందరినీ ఊర్రూతలూగించిన సినిమా రోబో. ఈ సినిమా కోసం ఆరు పదుల వయస్సులో కూడా చలాకీగా ఉంటూ.. డాన్స్‌లు, ఎమోషన్స్ బాగా పండించాడు రజినీ. అతని స్టైల్‌కు థియేటర్లలో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. పాటలకు కాగితపు పూలు పడ్డాయి. హాలీవుడ్ రేంజ్‌లో టెక్నికల్ డెవలప్‌మెంట్స్ ఈ చిత్రంలో చూడముచ్చటగా ఉన్నాయి.

 

కోచాడియాన్ గా

రోబో తర్వాత అనారోగ్యంతో కొంతకాలం కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన రజినీ.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కూతురు సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న ‘కోచాడియాన్’ చిత్రం తెలుగు వెర్షన్‌కి ‘విక్రమసింహా’ అనే పేరును ఖరారు చేశారు. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోంది. రజనీ విభిన్న అవతారంలో కనిపించే కొచ్చాడియాన్ పోస్టర్లు, ట్రైలర్స్ ఇప్పటికే అభిమానులతో సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి. మరి రజినీ.. ఈ సినిమాతో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో మరి కొద్ది రోజుల్లోనే తేలబోతోంది.

 

రజినీ రాజకీయాల్లోకి వస్తాడా..? వస్తే ఎప్పుడు..? ఇంతకీ రజినీ మనసులో ఏముంది..? ఇది దేశవ్యాప్తంగా ఎప్పటినుంచో వినిపిస్తున్న ప్రశ్న. అయితే.. ఏం చేయాలన్నా పై నుంచి ఆదేశం రావాలన్నట్టు స్టైల్‌గా పైకి చూసే రజినీ ఒక్కసారి చెబితే.. వంద సార్లు చెప్పినట్టే..!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles