Tollywood real star the real hero srihari

tollywood real star the real hero srihari, Telugu actor Real star Srihari died, Telugu actor Raghumudri Srihari, Real star srihari Nomore, Telugu actor Real star Srihari died in Mumbai Leelvathi hospital, Srihari died in mumbai

tollywood real star the real hero srihari, Telugu actor Real star Srihari died, Telugu actor Raghumudri Srihari,

తెలుగు తెర ఆణిముత్యం రియల్ స్టార్ శ్రీహరి

Posted: 10/10/2013 09:00 AM IST
Tollywood real star the real hero srihari

ప్రముఖ సినీనటుడు, రియల్ హీరో రఘుముద్రి శ్రీహరి . ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ దిగ్ర్భాంతి చెందింది. గత కొద్ది కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీహరి .. ముంబయ్ లోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాలేయ వ్యాధితో గత కొద్ది కాలంగా బాధపడుతున్నారని టాలీవుడ్ లో సన్నిహితులు చెబుతున్నారు.

రియల్ స్టార్ గా పేరుపొందిన శ్రీహరి.. 1986లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 97 చిత్రాల్లో యాక్ట్ చేసిన ఆయన 28 చిత్రాల్లో .. హీరోగా నటించారు. హీరోగా చేసిన మొదటి చిత్రం 'పోలీస్' అయితే.. చివరి చిత్రం 'పోలీస్ గేమ్' కావడం విశేషం. స్టంట్ ఫైటర్ గా ఆయన తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అలా 'రియల్ స్టార్'గా ఎదిగారు.

ఆగష్టు 151964లో శ్రీహరి బాలానగర్ లో జన్మించారు. 1998లో డిస్కోశాంతిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు.. ఒక కూతురు ఉన్నారు. తన కూతురు 'అక్షర' నాలుగు నెలల వయస్సులోనే చనిపోవడంతో ఆమె పేరుతో ఓ ఫౌండేషన్ ప్రారంభించారు. దీని ద్వారా పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా రాణించారు. ఆయన నటించిన నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, మగధీర, బృందావనం, భైరవ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.

అయితే ఆయన మరణంపై సినీ ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురై ప్రగాఢ సంతాపం ప్రకటించింది. సినీ ప్రముఖులు.. ఆయన చనిపోవడం టాలీవుడ్ కు తీరని లోటు' అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్రం మంత్రి చిరంజీవి, పీసీపీ అద్యక్షడు బొత్స తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు శ్రీహరి మృతికి సంతాపం ప్రకటించారు.

రియల్ హీరో శ్రీహరి

 

శ్రీహరి క్రమశిక్షణ గల మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా పలువురి హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హీరోగా, విలన్ గా‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందారు శ్రీహరి. కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అగ్రస్థానంలో ఉన్న శ్రీహరి సేవాకార్యక్రమాలలో కూడా ముందుండేవారు. అక్షర ఫౌండేషన్ ద్వారా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించిన, పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించిన, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న రియల్ హీరో శ్రీహరి.

తన కుమార్తె జ్ఞాపకార్ధం అక్షర ఫౌండేషన్‌ స్థాపించి ఎంతో మందికి సహాయం అందించారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా అనేకమందికి సహాయం అందించారు. తన సంపాదనలో సగ భాగాన్ని ఈ ఫౌండేషన్ కు ఇస్తానని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నగర శివారు మేడ్చల్‌ మండలంలోని ఫ్లోరైడ్ బాధిత గ్రామాలను గుర్తించారు. వారికి 2009 నుంచి ఫౌండేషన్ ద్వారా శుద్ధి చేసిన నీటిని అందించేందుకు పూనుకున్నారు. లక్ష్మాపూర్, అనంతారం, నారాయణపూర్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించారు. ఈ గ్రామాలకు స్వచ్చమైన నీరు అందించేందుకు ఒక నీటి శుద్ధి ప్లాంట్ ను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు పలు సౌకర్యాలు కల్పించారు. ఆ గ్రామల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు పేద విద్యార్థులు ప్లేట్లు, యూనిఫారాలను పంపిణీ చేశారు. అక్షర ఫౌండేషన్ తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆ గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము నీటి సమస్యతో సతమతమవుతున్నామని ఆ గ్రామస్తులు, విద్యార్థులు చెప్పారు. శ్రీహరి స్పందించి అక్షర ఫౌండేషన్‌ ద్వారా మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి, ఇంటింటికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారని తెలిపారు. శ్రీహరి సాయం మరిచి పోలేమని చెప్పారు.

ఇతర ప్రాంతాలలోని వారికి కూడా సహాయసహకారాలు అందించారు. నెల్లూరు జిల్లా కావలి అరుంధతీవాడలో బడి పిల్లలకు అక్షర ఫౌండేషన్‌ ద్వారా పుస్తకములు, పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. సరిహద్దులో కాపుకాసే సైనికుల వల్లే మనం కంటినిండా నిద్రపోతున్నామని, అలాంటి వీరులు యుద్ధంలో మరణిస్తే వారి పిల్లలు అనాధలవుతున్నారని, అటువంటివారి పిల్లలను దత్తత తీసుకుని వారికి కూడా సహాయం చేద్దామని అనుకున్నారు. ఎంతో కష్టపడి స్వయం కృషితో హీరోగా ఎదిగిన శ్రీహరి ఎంతోమందికి సహాయం చేసి మంచి మనిషిగా గుర్తింపుపొందారు. ఎంత ఎత్తుకు ఎదిగా ఒదిగి ఉండే మనస్తతత్వం శ్రీహరిదని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిచారు. తక్కువ వయసులోనే శ్రీహరి కన్నుమూయడం బాధాకరం.

శ్రీహరి మృతితో ‘అక్షర’ గ్రామాల్లో విషాదం

పేదల జీవితాల్లో వెలుగు నింపి.. చిరునవ్వులు కురిపించిన ‘అక్షర’ ఫౌండేషన్‌ అధినేత, సినీనటుడు శ్రీహరి ఇక లేరన్న వార్త మండలంలోని లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామాల్లో విషాదాన్ని నింపింది. సినీనటుడుగా, మంచి వక్తగా, రియల్‌ హీరోగా ఆయనకు మంచి పేరుంది. తన కూతురు అక్షర పేరిట అక్షర ఫౌండేషన్‌ ద్వారా పేద ప్రజలకు తనవంతుగా సహాయాన్ని అందించి నిజ జీవితంలోనూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. గుక్కెడు నీరు దొరక్క ఉక్కిరిబిక్కిరి అవుతున్న నిరుపేదలకు అక్షర ఫౌండేషన్‌ ద్వారా దాహార్తిని తీర్చి వారిలో చిరునవ్వుల వెలుగులు చిందించారు. గత నాలుగేళ్ల క్రితం ఆయన మండలంలోని అనంతారం, లక్ష్మాపూర్‌ గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిన్నారులకు, పేదవారికి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలుసేవా కార్యక్రమాలు అందిస్తున్నారు.

పేదల జీవితాల్లో చిరునవ్వులు నింపిన సినీనటుడు శ్రీహరి మృతి తీరని లోటని లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామస్తులు పేర్కొన్నారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన శ్రీహరికి లక్ష్మాపూర్‌, అనంతారం గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీహరి మృతికి సంతాపంగా గురువారం గ్రామంలో బైక్‌ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని లక్ష్మాపూర్‌ గ్రామస్తులు తెలిపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles