Dr cingireddy narayana reddy

cingireddy narayana reddy, cnr, indian poet and writer, jnanpith award in 1988, padmabhushan dr.c. narayana reddy

Dr. Cingireddy Narayana Reddy

తన శైలి లో విజయం సాధించిన సినారె

Posted: 05/09/2013 07:42 PM IST
Dr cingireddy narayana reddy

గులేబకావళి' కథ (1962) లోని 'నన్నుదోచుకుందువటే' పాటనుండి 'అరుంధతి' లో 'జేజమ్మ' పాటవరకు ఆయనప్రస్థానం సాగింది. ఇంతకాలం తెలుగులో గేయరచయితగా సాగించిన ఆయన మరెవరోకాదు సి. నారాయణరెడ్డి. నారాయణరెడ్డిగారు సినారే పేరుతో పాటలురాసేవారు. 1962 లో 'ఆత్మబందువు' మొదటిచిత్రం చేసినఆయన 50 వసంతాలు పూర్తిచేసుకున్నారు. ఆయన తెలుగు భాషలో 3000 పైగా పాటలు రాసారు. ఆయన కీర్తిశేషులు నందమూరితారకరామారావుగారికి మంచిస్న్హేహితుడు. అలాగే నారాయణరెడ్డిగారు మల్లెమాలసుందరరామిరెడ్డిగారితో కూడా చాలా దగ్గరిస్నేహం ఉంది. జూలై 29 1931 లో కరీంనగర్జిల్లాలో సింగిరెడ్డినారాయణరెడ్డిగా జన్మించిన ఆయన తెలుగుభాషపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. 1997 లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన 1992 లో పద్మభూషణ్ అందుకున్నారు. అలగే విశ్వంభర పుస్తకం రాసినందుకుగాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు. ఆయన మూడుతరాలకు సాహిత్యం అందించారు.

తెలుగుపాటకు ఒరవడి దిద్దిన సినారె వందల సినిమా పాటలను రాశారు. భారతప్రభుత్వం బహుకరించే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఉన్నతచదువులు చదివిన సినారె ఉస్మానియాయూ నివర్శిటీలో అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు రచనలో అన్నివిభాగాల్లోనూ ఆయన రచనలు సాగించారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ్ అవార్డు సినారెకు దక్కింది. సినారె 1962 సంవత్సరంలో సినిమా రంగంలో కిప్రవేశించారు. గులేభకావళికథ సినిమాకోసం ఆయనరాసిన 'నన్నుదోచుకుందువటేవన్నెలదొరసాని' ఎంతో సూపర్హిట్ అయింది. ఇక అప్నటి నుంచి ఎన్నోహిట్సినిమాలకు ఎన్నోసూపర్హిట్పాటలు రాసారు.

సమయానికిరావడం, తానుచెప్పాలనుకున్నవిషయాలుసూటిగాచెప్పటం, సమయానికి విలువనివ్వడంలో సినారెదిట్ట... నేటికి, తెలుగుదనాన్నిప్రతిమ్బిమ్బించేలా ఉంటుంది సినారె వస్త్రాదరణ.

సమాజంలోఎటువంటి అభిప్రాయబేధాలు తలెత్తినా, సినారె ఏం అంటారో, ఆయన భావన వినడానికి ఎదురు చూసేవారు ఎందరో... 'నా కాలానికి ప్రాణం ఉన్నంతవరకు రాస్తాను, రాస్తూనేపోతాను', అనేన్తటి ధైర్యం, రచనపై ప్రేమ కలిగిన వ్యక్తీ సినారె... అందుకే, డాక్టరేట్ నుండి పద్మభూషణ్ వరకు సినారె అందుకొని ప్రశంస లేదు...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles