Lyrics writer anantha sriram birthday spcial

ananta sriram, lyrics writer anantha sriram, ananth sriram movies, ananth sriram biography, lyrics writer anantha sriram birthday spcial

lyrics writer anantha sriram birthday spcial

తెలుగు భాషకు గర్వకారణం అనంత శ్రీ రామ్

Posted: 04/07/2013 06:58 PM IST
Lyrics writer anantha sriram birthday spcial

 పాటంటే ఊహల్లో విహరించాలి , మనసును కరిగించాలి , ఉత్తేజాన్ని రగిలించాలి , ఒక్క మాటలో చెప్పాలి అంటే నవరసాలని పలికించాలి ... అయితే ఇది కేవలం సంగీత దర్శకుడి అద్భుత బాణీల వల్ల మాత్రమె సాధ్యం కాదు ... పాటకు , స్వరానికీ సరిగ్గా సరిపోయే మాట ఇందుకు తోడవ్వాలి ... అందుకే , ఘంటసాల దగ్గరి నుండి ఇళయరాజా వంటి సంగీత దర్శకులని , ఘంటసాల మాస్టర్ , బాల సుబ్రహ్మణ్యం , జానకి , సుశీల , చిత్ర వంటి గాయనీమణులని మనం ఎంతగా ఆరదిస్తామో , వేటూరి , ఆరుద్ర , సిరివెన్నెల వంటి రచయితలని కూడా అంతగానే అభిమానిస్తాం ...

 ఈ మధ్య కాలం లో తెలుగు భాషకు , తెలుగు సినిమా పాటకు గుర్తింపు గా నిలిచినా యువ పాటల రచయితా ఎవరు అంటే , తడుముకోకుండా మనం చెప్పే పేరు 'అనంత శ్రీరాం ' ... ఇంజినీరింగ్ చదువుని కూడా పక్కన పెట్టి తన మనసు చెప్పిన బాటన నడిచాడు కాబట్టే , అనంత శ్రీరాం ఈ రోజు అటు పౌరాణిక చిత్రాలకు , ఇటు కుటుంబ కధ , యాక్షన్ చిత్రాలు , ప్రేమ కధలు ఇలా అన్ని భావాలలో చిత్రాలకి పాటల రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు ...

 'ఎం మాయ చేసావే' చిత్రం లోని పాటలు ఇప్పటికీ మన మనసుని దోచాయి అంటే , ఏ . ఆర్ . రెహ్మాన్ సంగీతానికి అనంత శ్రీ రామ్ కలం కూడా తోడవ్వడమే ... అత్యంత అధికంగా ప్రేక్షకాదరణ పొందిన 'బొమ్మరిల్లు' చిత్రం లో అంతే ప్రాముఖ్యత పొందిన పాట 'అప్పుడో ఇప్పుడో', ఈ పాట ద్వారా పాటల రచయిత గా తెలుగు సినిమా రంగం లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనంత శ్రీ రామ్ ...

ఎంతటి చేయి తిరిగిన రచయితకి అయినా , ఒక్కోసారి పాటకు మాటలు కరువవుతాయి ... ఆలోచన పని చెయ్యడం ఆగిపోతుంది ఇటువంటి సమయం లో కాస్త సమయం తీసుకుని అయినా , అద్భుతమైన పాటలు రాయడం రచయిత వంతు ... అనంత శ్రీరాం కి ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది ఒకసారి ... చందమామ సినిమా లో 'నాలో ఊహలు ' పాట రాయడానికి ఏకంగా 33 రోజులు సమయం తీసుకున్నాడు , ఈ రచయిత ... ఆశా భోంస్లే చేత ఈ పాట పాడిస్తున్నారు అని తెలియగానే , అటు వంటి మహా గాయని పాడుతున్నప్పుడు , చిత్రం లో ఈ పాటకు ముందు వచ్చే సన్నివేశం ప్రేమ భావాన్ని ఎంత మధురంగా పలికించినప్పుడు , తన పాటకూడా అంతే సమానంగా ఉండాలి అనుకున్న శ్రీ రామ్ , అనుకున్నట్టుగానే , తోలి సారిగా ప్రేమ యొక్క మాధుర్యాన్ని చవి చూసే ప్రతీ హృదయం లో ని భావం ఇలాగే ఉంటుంది అని అనిపించేంత చందంగా ఈ పాట రాసాడు .

'అరుంధతి ' చిత్రం మనల్ని ఎంతగా భయపెట్టిందో , మనందరికీ గుర్తే ... అయితే ఈ చిత్రం లో ఒళ్ళు గగుర్పాటు పెట్టె సన్నివేశానికి ముందు , దివ్యమైన , మంగళకరమైన పెళ్లి పాట , పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న కధానాయిక సౌందర్యాన్ని వర్ణించే పాట 'చందమామ నువ్వే నువ్వే ' అనే పాట ... అనంత శ్రీ రామ్ కలం మాయాజాలం వల్ల ఈ పాటకు యెనలేని గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి ...

ఇలా ఇప్పటి తరం పాటల రచయితలలో , తెలుగు ని తెలుగుగానే , ఇటు తేలికగా , అటు భాషలోని భావాలని లోతుగా తన రచనల ద్వారా అందించే అనంత శ్రీ రామ్ పుట్టిన రోజు ఈ రోజు ... ఈ సందర్భంగా ఈ యువ కెరటానికి జన్మదిన శుభాకాంక్షలు 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles