Ghantasala jayanti

Ghantasala Jayanti, Ghantasala Jayanthi Celebrations, Ghantasala, Ghantasala songs, Ghantasala hit songs, Ghantasala musical hits, Ghantasala hit list songs

Ghantasala Jayanti today.

Ghantasala Jayanti.png

Posted: 12/04/2012 04:49 PM IST
Ghantasala jayanti

ghantasala

పాటలను ప్రేమించే ప్రతీ శ్రోతకి, ఈ స్వరం సుపరిచితం... పల్లె పాట పరిమళాల గుభాళింపుని తన స్వరంలో అవగతం చేసుకుని ప్రేక్షకులని మైమరపించాలన్నా, మధురమైన ప్రేమ భావం పలికించే యుగళ గీతం సుమధురంగా
ఆలపించాలన్నా... సంగీత దర్శకుడు, పాటల రచయిత పోటీ పడి స్వరం సమకూర్చి, ఆ స్వరానికి మాటలు రాస్తే, గాయకుడిగా 200 శాతం న్యాయం చేసే స్వర మాధుర్యం, ఘంటసాల వారి సొంతం... చిత్ర సీమ లో 'మాస్టర్' గా
గంటసాల వారు పిలువబడ్డారు, పిలువబడుతున్నారు కూడా. ఈ మహా గాయకునికి, ఎంతోమంది ఏకలవ్య శిష్యులు.

ఎన్ని నూతన స్వరాలూ, నాటి నుండి నేటివరకు, పాటల ప్రపంచం లో పరవళ్ళు తొక్కుతున్నా, ఘంటసాల వారి స్వరం నాటి తరం వారికే కాదు, ఇప్పటి తరం వారికి కూడా ఆనందాన్ని అందజేస్తోంది.ఎన్నో వేల పాటలు ఆలపించిన, 100 కు పైగా విజయవంతమైన సినిమాలకు, సంగీతం అందించిన ఘనత, ఘంటసాల వారి సొంతం...

'శివసంకరి' వంటి భక్తీ రసం ప్రతిబింభించే గీతాలు ఆలపించాలన్నా, 'హాయి హాయిగా' వంటి ప్రేమ భావాన్ని ఒలికించే గీతాలు పలికించాలన్నా, రేలంగి, రాజబాబు వంటి హాస్య నటుల పాటలకి, ఆయా నటుల హావ భావాలకు తగ్గట్టుగా తన స్వరం మార్చి గీతాలను ఆలపించాలన్నా, ఘంటసాల మాస్టర్ కి వెన్నేతో పెట్టిన విద్య. ముఖ్యంగా తన ఇష్ట దైవం అయిన వెంకటేశ్వర స్వామి గూర్చి సినిమాల్లో, బయట కచేరీలలో గీతాలను ఆలపించాలంటే, ఘంటసాల మాస్టర్ ప్రత్యెక అభిమానం చూబించే వారు. యెంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఘంటసాల వారిది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా, తాను అగ్ర స్థానం లో ఉన్నప్పుడు కూడా, ఇతర సంగీత దర్శకుల దగ్గర, సినిమాలకు పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు, తనకు తెలిసిన సంగీత గమకాలని పక్కన పెట్టి, సంగీత దర్శకుడు చెప్పిన స్వరాన్నే శ్రద్ధగా అవగతం చేసుకుని పాడేవారు అంటే ఘంటసాల వారి నిరాడంబరత ఎంతటిదో చెప్పడానికి, వేరే ఉదాహరణ కావాలా?

పాటే తన ప్రపంచంగా బతికిన ఘంటసాల మాస్టర్, తన తండ్రి అభీష్టం మేరకు, గాయకుడిగా స్థిరపడాలి అని, వారాలు చేసుకుంటూ సంగీత కళాశాలలో, సరిగమల ఓనమాలు దిద్దుకుని, HMV వంటి సంస్థలకు ప్రయివేటు గీతాలు ఆలపించి, సినిమాలలో, తొలుత హాస్య నటులకు తన స్వరాన్ని అరువిచ్చి, పిమ్మట, యన్టీఆర్, ఎయనార్ వంటి హేమాహేమీలకు గీతాలాపన చేసారు. ఘంటసాల మాస్టర్, సంగీత దర్శకులకు దొరికిన ఒక వరం... దర్శకులకు వెతువంటి శ్రమ పెట్టకుండా, ఎటువంటి కష్టతరమైన స్వరాన్ని అయినా, అవలీలగా ఆలపించేవారు, మాస్టర్...ఘంటసాల వారు భౌతికంగా మనల్ని విడిచి ఇన్ని సంవత్సరాలు అయినా, ఆయన పాటల పూదోటలు, ఆయన అభిమానులు నేటికి మనకు అందిస్తున్నారు అంటే,

ఈ మహా గాయకుడు మూట గట్టుకున్న కీర్తి ఎంతటిదో... ఘంటసాల మాస్టర్ జయంతి ఈనాడు... రోజు లాగే ఈ రోజు కూడా, ఈ మధుర గాయకుడి స్వరం వింటూ, మన బాధలని మరచిపోయి, సంగీత ప్రపంచం యొక్క అద్భుతమైన లోకం లో విహరిద్దాం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mallemala sundara rami reddy vardhanthi
Comedy king relangi vardhanti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles