Indian cinematographer aloysius vincent

Aloysius Vincent born June 14, 1928 in Calicut, Kerala, India is an Indian cinematographer of Hindi movies and director of Malayalam movies. Since the mid 1960s he has directed some 30 movies. He also won the Filmfare Best Cinematographer Award for Prem Nagar (1974).

Aloysius Vincent born June 14, 1928 in Calicut, Kerala, India is an Indian cinematographer of Hindi movies and director of Malayalam movies. Since the mid 1960s he has directed some 30 movies. He also won the Filmfare Best Cinematographer Award for Prem Nagar (1974).

Indian cinematographer Aloysius Vincent.png

Posted: 08/23/2012 01:32 PM IST
Indian cinematographer aloysius vincent

Cinematographer_Aloysius_Vincent

Aloysius_Vincent‘అడవి రాముడు’లో లోయలోకి గుర్రపు బండి జారిపోవడం... ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’లో శ్రీదేవి స్వర్గం నుంచి భూమ్మీదకు రావడం... ‘అన్నమయ్య’లో నిజంగా వేంకటేశ్వరస్వామి మన కళ్లముందే ప్రత్యక్షమైనట్టుగా అనిపించడం... ‘ఆత్మబంధం’లో ఆత్మ కనబడటం... ఇవన్నీ విన్సెంట్ కెమెరా మాయాజాలంలోని కొన్ని మెరుపు మీగడ తరకలు. కెమెరాని భూమిలో పాతేసినట్టుగా కాకుండా మన మనసు చుట్టూ, మన కలల చుట్టూ, మన జీవితం చుట్టూ పరిభ్రమించినట్టుగా షాట్స్ తీయడమే విన్సెంట్ మ్యాజిక్. గ్రాఫిక్స్ అంటే తెలీని రోజుల్లోనే కెమెరాతోనూ, లైటింగ్‌తోనూ అద్భుతాలు సృష్టించాడాయన. విన్సెంట్ అంటే చీకటి వెలుగుల రహస్యం తెలిసిన మాంత్రికుడు. ఆర్టిస్టిక్ కంపోజిషన్... స్టయిలిష్ కెమెరా యాంగిల్స్... క్వాలిటీ ఎక్స్‌పోజర్... ఎక్స్‌ట్రార్డినరీ లైటింగ్ స్టయిల్... వెరసి మాస్టర్ ఆఫ్ లైట్ అండ్ షాడో విన్సెంట్. చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్న ఛాయాగ్రహ జగదేకవీరుడు ‘విన్సెంట్’ మనకు చెప్పిన కొన్ని విషయాలు....

మీరు కెమెరా గురించి అడుగుతుంటే, నా మనసు క్యాలికట్ వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. క్యాలికట్ అంటే నేను పుట్టిన ఊరు. నా జీవన రథానికి మార్గం చూపిన ఊరు. కేరళలో ఊళ్లన్నీ పచ్చగా ఉంటాయి. క్యాలికట్‌లో అయితే అణువణువూ సౌందర్యమే. అది బ్రిటిషు మలబారు ప్రాంతం. 1928 జూన్ 14న పుట్టాన్నేను.‘అలోషియస్’ అనేది మా ఇంటి పేరు. ‘అలోషియస్’ అంటే మేం పూజించే దేవత పేరు.

మా నాన్నగారికి అక్కడో ఫొటోస్టూడియో ఉండేది. ఆయన గొప్ప ఫొటోగ్రాఫరే కాదు, గొప్ప ఆర్టిస్టు కూడా. నేను స్కూల్లో కన్నా ఫొటోస్టూడియోలోనే ఎక్కువ ఉండేవాణ్ని. ఉదయం ఏడున్నరకు వెళ్తే రాత్రి ఎనిమిది వరకూ అక్కడే నా విడిది. నాన్నగారు ఫొటోలు తీస్తుంటే ఆసక్తిగా గమనిస్తుండేవాణ్ని. ఆ చీకటి వెలుగుల మ్యాజిక్కు, ఫ్రేమింగులు నన్ను మంత్రముగ్ధుణ్ని చేస్తుండేవి.అలా ఫొటోగ్రఫీ నా ఆరోప్రాణమై కూర్చుంది. నాన్నగారు అలా బయటకు వెళ్లగానే కెమెరా తీసుకుని రకరకాల ప్రయోగాలు చేస్తుండేవాణ్ని. ఓసారి ఎలాగైనా డబుల్ ఫోజు తీద్దామని ప్రయత్నించా. చాలా గొప్పగా వచ్చింది. ఇక నాలో ఎక్కడ లేని హుషారు. కెమెరాతోనే నా జీవితం ముడిపడి ఉందని ఆ క్షణంలో నాకనిపించింది. అప్పుడంతా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సీనియర్ ఇంటర్ పూర్తవడం పాపం... చలో మద్రాస్. అప్పుడు నా వయసు పదిహేడేళ్లు.

జెమినీ స్టూడియోలో అప్రెంటిస్‌గా...

జెమినీ స్టూడియో అంటే అప్పట్లో చాలా ఫేమస్. శైలేన్‌బోస్ లాంటి ఎందరెందరో హేమాహేమీలు పనిచేసిన ప్లేసు అది. ఎలాగోలా ఛాయాగ్రహణ శాఖలో అప్రెంటిస్‌గా చేరిపోయాను. నచ్చిన పని చేస్తూ ఉంటూ వచ్చే మజా ఏమిటో అప్పుడు నాకర్థమైంది. అప్రెంటిస్ నుంచి కెమెరా అసిస్టెంట్. అక్కడ నుంచి అసిస్టెంట్ కెమెరామెన్... ఇలా టకటకా ప్రమోషన్లు. అక్కడ పనిచేసిన అయిదేళ్లే నా యాభయ్యేళ్ల కెరీర్‌కు బలమైన పునాదిరాళ్లు.

కమల్‌ఘోష్ తెలుసుగా... కెమెరామెన్లకి ఆదిగురువు లాంటివాడు. అప్పుడాయన జెమినీలోనే ఉండేవాడు. ఆయనది పక్కా బెంగాలీ తరహా చిత్రీకరణ. డేలైట్ ఎఫెక్ట్ బాగా వాడేవారు. ‘అపూర్వ సహోదరులు’ అనే తమిళ సినిమా ఇప్పుడు చూసినా నాకు ఆయనే గుర్తుకొస్తారు. అంత గొప్ప కెమెరా వర్క్ చేశారు. హీరో రంజిత్‌ని డ్యూయల్ రోల్‌లో చూపించాలి. మిచెల్ కెమెరాతో వండర్‌ఫుల్‌గా తీశారు. దీన్నే హిందీలో ‘నిషాన్’గా రీమేక్ చేశారు. దానికీ కమల్‌ఘోష్ దగ్గర నేను పనిచేశాను.తెలుగులో ‘బ్రతుకు తెరువు’...ఇక తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘బ్రతుకు తెరువు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించారందులో. రామకృష్ణ దర్శకత్వంలో కోవెలమూడి భాస్కర్రావు నిర్మించారు. ‘అందమె ఆనందం... ఆనందమె జీవిత మకరందం...’ అనే హిట్ పాట అందులోదే!

తెలుగులో చాలా సినిమాలు చేశాను. నాకు తెలుగు మాట్లాడటం, చదవడం కూడా వచ్చు. కె.ఎస్.ప్రకాశరావు, వాళ్లబ్బాయి కె.రాఘవేంద్రరావు చిత్రాలకు ఎక్కువ పనిచేశాను. 1975 ప్రాంతంలో కలర్ సినిమాల హడావిడి ఎక్కువైంది. అయినా కూడా నేను, రాఘవేంద్రరావు కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్‌లోనే చేశాం. ‘ప్రేమలేఖలు’ సినిమాను కొడక్ కంపెనీ ‘బ్లాక్ అండ్ వైట్ ’ స్టాక్‌తో షూట్ చేశాం. ఇక హిందీ విషయానికొస్తే, అమితాబ్ బచ్చన్ నటించిన ‘మహాన్ ’, రాజేశ్‌ఖన్నా ‘ప్రేమ్‌నగర్’, జితేంద్ర ‘ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి’ ఇత్యాది చిత్రాలకు ఛాయాగ్రహణం చేశాను. హిందీ ‘ప్రేమ్‌నగర్ ’ (1974)కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది.

Aloysius_Vincent_దక్షిణాదిలోనే తొలి జూమ్‌లెన్స్ షాట్...

శివాజీ గణేశన్ హీరోగా తాతినేని ప్రకాశరావు ‘ఉత్తమ పుత్రన్ (1958)’ అనే తమిళ చిత్రం చేస్తున్నారు. మైసూర్ బృందావన్ గార్డెన్స్‌లో శివాజీ గణేశన్, పద్మినిపై పాట తీస్తున్నాం. అక్కడున్న లలిత మహల్ ప్యాలెస్ (తర్వాత దీన్ని హోటల్‌గా మార్చేశారు)పై పద్మిని, కింద వాటర్ ఫాల్ దగ్గర శివాజీ నిలబడి ఉన్నారు. వీరిద్దరినీ కలిపి షాట్ తీయాలి. చాలా దూరంగా కెమెరా పెడితే కానీ ఇద్దరూ ఫ్రేమ్‌లోకి రావడం లేదు. ఆ లాంగ్ షాట్‌లో ఇద్దరి మొహాలూ సరిగ్గా కనబడటం లేదు.ఈ పాట తీస్తున్నప్పుడే ఓ ఫ్రెంచ్ లేడీ టూరిస్ట్ అక్కడకు వచ్చింది. ఆమె దగ్గరో స్టిల్ కెమెరా ఉంది. దానికి పవర్‌ఫుల్ లెన్స్ కూడా ఉంది. సాధారణంగా నాకు కెమెరాలంటే ఇష్టం కాబట్టి, ఆవిణ్ని ఓసారి కెమెరా అడిగి తీసుకున్నా. ఆ లెన్స్ చూశాక నాకో ఆలోచన వచ్చింది. దాన్ని 16 ఎం.ఎం. మూవీ కెమెరాకి పెడితే కరెక్ట్‌గా సెట్ అయ్యింది. లెన్స్ ఉంది కాబట్టి జూమ్ చేసి షాట్ తీయొచ్చు. వెంటనే డెరైక్టర్‌కి చెప్పి కొన్ని షాట్స్ తీశాను. శివాజీ గణేశన్, పద్మిని ఇద్దరినీ ఒక షాట్‌లో చూపించి, కట్ చేయకుండా పద్మిని క్లోజప్ కూడా షూట్ చేశాను. కెమెరా ఇచ్చినావిడని కబుర్లలో పెట్టి ఆ సాయంత్రం వరకూ అక్కడే ఉంచేశాం.

ఆవిడ లెన్స్‌తో సినిమా షూటింగ్ చేశామని తెలియగానే చాలా థ్రిల్ అయిపోయింది. అప్పటికి ఇండియాలో జూమ్ లెన్స్ అనేది లేదు. 16 ఎం.ఎం. కెమెరాతో తీసిన షాట్స్‌ని 35 ఎం.ఎం. కెమెరాకి బ్లోఅప్ చేయాలి. దాని ప్రాసెసింగ్‌కి లండన్ పంపించాం. అక్కడి వాళ్లు నేను చేసిన విధానం గురించి అడిగి సర్‌ప్రైజ్ అయిపోయారు. అవుట్‌పుట్ చూసి శివాజీ గణేశన్ స్టన్ అయ్యారు. అప్పుడు ఇండస్ట్రీలో ఇదో పెద్ద టాపిక్ అయిపోయింది. దక్షిణాదిలో తొలి జూమ్ లెన్స్ షాట్ అదే.

తెలుగులో డెరైక్షన్ చేయలేకపోయా...

నాకు మొదటినుంచీ డెరైక్షన్ అంటే స్పెషల్ ఇంట్రస్ట్. కెమెరామెన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే మెగాఫోన్ చేతబట్టాను. ‘భార్గవి నిలయం’ అనే మలయాళ సినిమాతో దర్శకునిగా నా ప్రయాణం మొదలైంది. హీరోయిన్‌గా విజయనిర్మల తొలి సినిమా కూడా ఇదే. మలయాళంలో 45 చిత్రాలు డెరైక్ట్ చేశాను. తమిళంలో కూడా మూడు నాలుగు సినిమాలు చేసుంటాను. తెలుగులో మాత్రం చేయలేకపోయాను. మలయాళంలో నేను డెరైక్ట్ చేసిన ‘తులాభారం’ నాకు పరిపూర్ణ సంతృప్తినిచ్చింది. ప్రముఖ మలయాళ రచయిత శ్రీ బాసి రాసిన ‘తులాభారం’ నవల చదివి ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాను. శారదను ఏరి కోరి తీసుకున్నా. ఈ సినిమా ద్వారా శారదకు రెండోసారి ‘ఊర్వశి’ అవార్డు రావడం నాకు గర్వకారణం.

Aloysius_Vincent__‘అన్నమయ్య’తో ఆఖరు...

ఛాయాగ్రాహకునిగా నా ఆఖరి సినిమా ‘అన్నమయ్య’. ఈ సినిమా తెచ్చిన పేరుతో చాలా సంతృప్తిగా రిటైర్మెంట్ తీసుకున్నా. ఇందులో కొన్ని షాట్స్ ఎలా తీశారని చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే ఎక్కడా గ్రాఫిక్స్ వాడకుండా కేవలం కెమెరా, లైటింగ్‌తో చేసిన మ్యాజిక్స్ అవి. ఓ చోట వెంకటేశ్వరస్వామి రూపం చిన్న మెరుపులాగా కనిపిస్తుంది. అదేం స్పెషల్ ఎఫెక్ట్ కాదు. ఆ మెరుపుని ఫాగ్‌లైట్ నుంచి క్రియేట్ చేశాం.

విన్సెంట్ సినిమాటోగ్రఫీ చేసిన కొన్ని హిట్ తెలుగు చిత్రాలు

బ్రతుకు తెరువు (1953), నజరానా (1961), కులగోత్రాలు (1962), లేత మనసులు (1966), భక్త ప్రహ్లాద (1967), ప్రేమనగర్ (1974), సోగ్గాడు (1975),
ప్రేమలేఖలు (1977), అడవి రాముడు (1977), రాజపుత్ర రహస్యం (1978), జగదేక వీరుడు - అతిలోక సుందరి (1990) , ఆత్మబంధం (1990),
ఘరానామొగుడు (1992), ఆపద్బాంధవుడు (1992), ధర్మక్షేత్రం (1992) , సాహసవీరుడు - సాగరకన్య (1996), అన్నమయ్య (1997).

నాకు ఇద్దరు కొడుకులు. జయనన్ విన్సెంట్, అజయ్ విన్సెంట్. ఇద్దరూ ఛాయాగ్రాహకులే. ఎవరి శైలిలో వాళ్లు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇద్దరూ నా దగ్గరే శిష్యరికం చేశారు. జయనన్ ఇప్పుడు కెనడాలో స్థిరపడ్డాడు. ఇక్కడ సినిమాలుంటే వచ్చి పనిచేసి వెళ్తున్నాడు. ఆ మధ్య పవన్‌కల్యాణ్ ‘తీన్‌మార్’, ‘గబ్బర్‌సింగ్’ సినిమాలకు తనే పనిచేశాడు. ఇప్పుడు నాకు కాలక్షేపం పుస్తకాలే. అప్పుడప్పుడూ సినిమాలు చూస్తుంటాను. ఎఫ్.ఎం. రేడియో వింటుంటాను. అంటూ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu language day
Dr c narayana reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Great saint of modern india sadguru kasireddy nayana who feed the hungry

  క్షుద్భాదను తీర్చుతున్న సద్గురువు.. భగవాన్ శ్రీ కాశీరెడ్డినాయన

  Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more

 • Freedom fighter father of telangana konda laxman bapuji

  తెలంగాణ ఉద్యమాలకు నాంది.. కొండా లక్ష్మణ్ బాపూజీ

  Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more

 • Telanagana recalls professor jayashanker on his death annivesary

  తెలంగాణ జాతిపిత.. సిద్ధాంతకర్త.. ప్రోఫెసర్ జయశంకర్

  Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more

 • Prominent freedom fighter subash chandrabose biography

  అజాద్ హింద్ ఫౌజ్ జవజీవాలను తెచ్చిన నేతాజీ..

  Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more

 • A tribute to ghantasala venkateswara rao on his birthday

  ఘనా గాన గంధర్వుడు.. చిరంజీవుడు.. ఘంటసాల

  Dec 22 | తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఒలలాడించిన ఘనా ఘన గాన గంధర్వుడు ఆయన. ఆయన ఆలపించిన పాటలతో అటు నిత్య దైవతారాధనను ప్రారంభించడంతో... Read more

Today on Telugu Wishesh