Karnataka CM Basavaraj Bommai to quit? సీఎం నోట వైరాగ్యం.. మళ్లీ మార్పు తప్పదా.?

Posts of power not permanent says karnataka cm bommai

Karnataka CM, Karnataka Chief Minister, Basavaraj Bommai, Emotion, change of CM in karnataka, posts are temporary, Bharatiya Janata Party, karnataka bjp, B S Yediyurappa, Karnataka chief minister, Shiggaon, Haveri district, BJP government, Bengaluru, Karnataka, politics, crime

Karnataka CM Basavaraj Bommai in an emotional address to the people of his constituency said nothing is permanent in this world including posts and positions. "Nothing is eternal in this world. This life itself is not forever. We don't know how long we will be here in such a situation, these posts and positions are also not forever. I am aware of this fact every moment," he said.

కర్ణాటక సీఎం బొమ్మై నోట వైరాగ్యం.. దేనికి సంకేతం..?

Posted: 12/20/2021 07:30 PM IST
Posts of power not permanent says karnataka cm bommai

కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. తన సోంత నియోజకవర్గంలోని ప్రజల వద్దకు చేరుకున్న ఆయన.. అక్కడి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజల ప్రేమను మించిన పదవులు, అధికారం ఏదీ లేదంటూ వైరాగ్యాన్ని ప్రదర్శించారు. దీంతో రాజకీయ పరిశీలకులు మాత్రం రాష్ట్రంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు తప్పదా?.. అంటూ రాజకీయ వేడిని రాజేశారు. అదేమంటే ఈ ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వ్యాఖ్యలు ఔననే ఊహాగానాలకు తెలరలేపుతున్నాయని అంటున్నారు.

ముఖ్యమంత్రి బొమ్మై తన సొంత నియోజకవర్గమైన షిగ్గాన్‌లో కిట్టూర్ రాణి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సీఎం హోదాలో వచ్చిన తమ నియోజకవర్గ ఎమ్మెల్యేను చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడి పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవులు సహా ఈ సృష్టిలో మనకు ఏదీ శాశ్వతం కాదని అన్నారు. మనం ఇలా ఎంతకాలం ఉంటామో ఎవరికీ తెలియదని, ఈ పదవులు, అధికారాలు కూడా శాశ్వతం కాదని అన్నారు. ఈ విషయాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకునే నడుచుకుంటానని చెప్పి సీఎం మార్పుపై సంకేతాలిచ్చారు.

నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ బసవరాజ్‌ను మాత్రమేనని, ముఖ్యమంత్రిని కాదని అన్నారు. గతంలో హోంశాఖ మంత్రిగా, సాగునీటి మంత్రిగా పనిచేశానని పేర్కొన్న సీఎం.. తాను ఎప్పుడు ఇక్కడకు వచ్చినా బసవరాజ్‌ను మాత్రమేనని, పదవుల కంటే బసవరాజ్ మాత్రమే శాశ్వతంగా ఉంటాడని భావోద్వేగంగా చెప్పారు. గొప్ప విషయాలు చెప్పడానికి ఏమీ లేవని, మీరు ఆశించినట్టుగా తాను బతికితే చాలని, మీ ప్రేమ, నమ్మకం కంటే గొప్పదైన అధికారం ఏదీ లేదని తాను భావిస్తానని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సీఎం మార్పు తప్పదన్న సంకేతాలకు నిదర్శనమని పలువురు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles