2016 నవంబర్ అందరికీ గుర్తుండిపోయే నెల. అందులోనూ ఇక ప్రత్యేకంగా 8వ తేదీ అనగానే దానిని తలుచుకుని బాధపడే కుటుంబాలు అనేకం. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీగా పేర్కోనాల్సిన రోజు అది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం పూర్తికాగానే ఏటీయం కేంద్రాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆ మురుసటి రోజు నుంచి దాదాపుగా ఆరు మాసాల వరకు ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఆ రోజున కేంద్రం ప్రకటించిన పాత పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశంలోని మధ్య, దిగువ తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చాటింది.
అయితే ఆ రోజున ప్రధాని జాతిని ఉద్దేశిస్తూ టీవీలలో చేసిన ప్రసంగంలో ఈ చర్యలు ఎందుకు చేపడుతున్నారో కూడా చెప్పారు. నల్ల ధనం కోరాలు తీయడానికి, అవినీతిని రూపుమాపడానికి, ఉగ్రవాద చర్యలకు డబ్బు అందకుండా చేయడానికి. కానీ ఈ కారణాలను వెలిబుచ్చినా.. ప్రధానంగా నల్లధనం, అవినీతి రూపుమాపడం మాత్రం నోట్ల రద్దుతో సాధ్యపడలేదన్నది వాస్తవం. దేశంలోని నల్లధన కుబేరులు తమ డబ్బును సామాన్యుల కన్నా ముందుగానే మార్చేసుకున్నారన్న అరోపణలు ఇప్పటికీ వున్నాయి. ఇక అవినీతి విషయానికి వస్తే ఇటీవలే ఈశాన్య ప్రాంతంలోని పశ్చిమ సరిహద్దు రైల్వేస్ కు చెందిన ఓ అధికారి కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఇక దీంతో పాత పెద్ద నోట్ల రద్దు పేరుతో రెట్టింపు పెద్ద నోటును కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి, నోట్ల రద్దు జరగలేదు.. కేవలం మార్పిడి మాత్రమే జరుగుతుందన్న వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొండను తొవ్వి ఎలుకను పట్టారన్న చందంగా సుమారు 50 వేల కోట్ల రూపాయలను ఖర్చుబెట్టి కొత్త కరెన్సీని తీసుకువచచిన కేంద్రం.. కేవలం సుమారుగా 11 వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని మాత్రమే బ్యాంకుల్లో డిఫాజిట్ కాలేదన్న గణంకాలు స్పష్టం చేస్తున్న విషయాన్ని ఎత్తిచూపుతూ ఇప్పటికీ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మరోమారు నోట్ల రద్దు అంశం తెరపైకి వస్తోండగా, దానిపై భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టతను ఇచ్చింది.
అయితే ప్రధాని నరేంద్రమోడీ హయాంలో చేపట్టిన ఈ నోట్ల రద్దు వ్యవహారం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో కానీ అప్పట్నించి సామాన్యులకు మాత్రం కంటి మీద కునుకు కరువైంది. దాదాపు ఆరు మాసాల పాటు కరెన్సీ నోట్లు లభించేందుకు నానా అగచాట్లు పడిన ప్రజలు.. ఆ తరువాత తమ చేతుల్లోకి వచ్చిన అతి పెద్ద కరెన్సీ నోటు రూ.2000 నోటుపై ఎప్పటికప్పుడు వస్తున్న వార్తలతో సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఈ నోటను రద్దు చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. దీనిపై తామేం చెప్పలేమని ఇక ఏం చెప్పాలన్నా అర్బీఐ మాత్రమే చెప్పాలని కొందరు ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు.
దీంతో ఈ వ్యవహారంపై పలు సందర్భాల్లో పార్లమెంటు సభ్యులు ప్రజల్లో రేకెత్తుతన్న అందోళనను ప్రశ్నల రూపంలో ఆర్థిక మంత్రులను లిఖిత పూర్వకంగా అడగి తదనుగుణ సమాధానాన్ని పోందారు. ఇక ఇప్పుడిప్పుడే దేశ కరెన్సీలోనే పెద్దదైన రూ.2000 నోటును చలామణి నుంచి తప్పించరన్న నమ్మకం కలుగుతున్న తరుణంలో మరో నోట్ల రద్దు తెరపైకి రావడం మధ్య, దిగువ తరగతి ప్రజలు అందోళనకు గురవుతున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా దేశ జాతీయోత్పత్తి దిగజారిపోయింది. ఇక ఈ సమయంలో అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది
పాత చిన్న నోట్లను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ మధ్య రద్దు చేయనుందన్న వార్త సంచలనంగా మారింది. కాగా, దీనిపై ఎట్టకేలకు భారతీయ సెంట్రల్ బ్యాంకైన రిజర్వు బ్యాంకు స్పష్టతను ఇచ్చింది, ఈ ఏడాది మార్చి నుంచి ఆ మూడు రకాల నోట్లు చెల్లుబాటు కావని ఊహాగానాలకు చెక్ చెప్పింది. పాత రూ.100, రూ.10, రూ.5 నోట్లను రద్దు చేస్తున్నారన్న వార్త సత్య దూరమని స్పష్టతను ఇచ్చింది. ఈ మేరకు మీడియాలోని ఓ వర్గంలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని తేల్చిచెప్పింది. తమకు అలాంటి ఉద్దేశాల్లేవని భారతీయ రిజర్వు బ్యాంకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అయితే చిన్న పాత నోట్ల రద్దు విషయంలో రిజర్వు బ్యాంకు వెనక్కు తగ్గడానికి కారణాలు లేకపోలేదు. ప్రతీ విషయంలోనూ గత ప్రభుత్వాల గుర్తులను చెరిపేసి తమదైన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో మాత్రం ఆచితూచి ఆడుగులు వేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి, పెద్ద పాత నోట్లను రద్దు చేసిన అంతకన్నా పెద్ద నోటును చలామణిలోకి తెచ్చిన కేంద్రంతో పాటు ఆర్బీఐపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అప్పటి మోడీ పాలనతో పాటు నిర్ణయాలను కూడా దేశ ప్రజలు స్వాగతించారు. ఆ వెంటనే వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపి విజయదుందుఃభి మ్రోగించింది.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితులకు దేశంలో భీటాలు వారాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒ వైపు రైతులు నిరసనలు, మరోవైపు దేశ అర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా లేకపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంకు పాత నోట్ల రద్దు విషయంలో వెనక్కు తగ్గిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇక దీనికి తోడు పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో చెప్పిన మూడు అంశాలు.. అవినీతి నిర్మూలణ, నల్లధనం వెలికితీత, ఉగ్రమూకలకు ఫండింగ్ చేరకూడదన్న అంశాలు పాత పెద్ద నోట్ల రద్దుతో అవిష్కృతం కాలేదు. దీంతోనే ఇక మరో మారు పాత నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తీసుకువస్తే అది తమకే శరాఘాతంలా తయారవుతుందని కేంద్రం భావిస్తోందేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Feb 05 | పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి... Read more
Feb 04 | తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక... Read more
Feb 03 | ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేది పత్రిక.. వారి తరపున వాకాల్లా పుచ్చుకుని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాడే పత్రికా ప్రతినిధి. ఈ విషయం తెలిసినా నీళ్లు వదిలేసిన కొందరు మీడియా పెద్దలు ప్రభుత్వాల తరపున... Read more
Feb 03 | మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి... Read more
Feb 02 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని..... Read more