Mistry behind burning Woman Tashlidar alive- Is it a sketch? తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ‘రియల్’ హస్తాలు..?

Mistry behind burning woman tashlidar alive is it a sketch

Vijaya Reddy, Tehsildar attack, Abdullapurmet MRO, Suresh Mudhiraj, durgaiah, land controversy, realtors skecth, realtors beyond vijaya reddy brutal murder, Pass book, petrol, Sabitha Indra Reddy, Rangareddy, Hyderabad’s Outer Ring Road, Telangana Crime

In a horrific incident of Vijaya Reddy, an on-duty Tehsildar of Abdullapurmet mandal, police are investigating the depth of the case in various directions. How come a mentally ill suresh argued with mro and who is beyond the entire episode.

తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ‘రియల్’ హస్తాలు..?

Posted: 11/05/2019 01:44 PM IST
Mistry behind burning woman tashlidar alive is it a sketch

హైదరాబాద్ నగరశివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం వెనుక రియల్ హస్తాలు వున్నట్లు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కు చెందిన పెద్దలు వెనుకగా వ్యవహరిస్తూ.. అమెపై దారుణ చర్యలకు పాల్పడేలా చేశారా.? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మండల ప్రజలకు న్యాయం అందించే స్థానంలో వున్న అమెపై అన్యాయంతో గెలిచేందుకు రియల్ మూకలు పన్నిన కుట్రలలో అమె బలైపోయిందా.? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. తమ దారిలోకి రాని అమెను అడ్డుతొలగించుకునేందుకు మతిస్థిమితం లేని వ్యక్తిని పావుగా వాడుకున్నారా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

ముక్కుసూటిగా తన విధులను నిర్వహిస్తున్న అధికారిని.. డబ్బు, పరపతి సహా ఎలాంటివాటికి లొంగకపోవడంతో అమె ప్రాణాలను సైతం హరిస్తామని.. బెదిరింపులకు కూడా అమె జంకకపోవడంతో అమెను అత్యంత భయానకంగా సజీవ దహనం చేయించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి.. తన అకుంఠిత దీక్షతో గ్రూప్ పరీక్షలు రాసిన అమె.. పరీక్షలలో ఉత్తీర్ణురాలై ఎమ్మార్వోగా పదవీ బాధ్యతలను చేపట్టారు. అలా పదవీ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే అమె రంగారెడ్డి జిల్లా కలక్టర్ చేతుల మీదుగా జిల్లాలో ఉత్తమ ఎమ్మార్వోగా కూడా అవార్డులను అందుకున్నారు.

ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సురేష్ ముదిరాజ్ అనే మతిస్థిమితం లేని రైత్తు తానే ఈ దారుణానికి పాల్పడ్డానని అంగీకరించడం.. తాను చనిపోదామని బావించానని చెప్పడం వెనుకునున్న అసలు రహస్యాలు ఏమై వుంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే తన పొలం పాస్ బుక్ విషయమై గత కొన్ని నెలలుగా తాను ఎమ్మార్వో విజయారెడ్డి చుట్టూ తిరుగుతున్నానని, కానీ అమె తనకు పాస్ బుక్ మంజూరు చేయలేదని సురేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. అయితే ఈ పోలం న్యాయపరమైన చిక్కుల్లో వుండటం.. అందునా జిల్లా జాయింట్ కలక్టర్ నుంచి కూడా సదరు పోలం పాస్ బుక్ లు మంజూరు చేయకూడదని స్పష్టమైన అదేశాలు వున్నాయి.

ఈ విషయం ఎమ్మార్వో చెప్పిన తరువాత కూడా సురేష్.. అమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం ఎందుకు చేశాడు. నిందితుడ్ని ఎవరు ప్రేరేపించారు.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది. ఇక నిందితుడు దారుణ ఘటనకు ఒడిగట్టే ముందు ఎమ్మార్వో కార్యాలయంలో తన పెదనాన్న దుర్గయ్యతో అనేక పర్యాయలు ఫోన్ ద్వారా సంబాషించాడని పోలీసులు గుర్తించారు. అయితే తెరపైకి సురేశ్ ను నిలిపిన దుర్గయ్య.. తన వెనుకునున్నది ఎవరన్న విషయాలను కూడా తెలపాల్సి వుంది. అయితే దుర్గయ్య వెనుక రియల్ ఎస్టేట్ రంగానాకి చెందిన బడాబాబులు వున్నారని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఎందుకంటే భూబాకాసురల చేతుల్లో బలైపోయిన తహశీల్దార్ విజయారెడ్డి తనకు ప్రమాదం పొంచివుందన్న విషయాన్ని ముందుగానే ఊహించారని ఆమె బంధువుల తెలిపారు. విజయారెడ్డి హత్యపై స్పందించిన ఆమె మేనమామ వెంకట్ రెడ్డి... కొద్దిరోజుల క్రితమే కలక్టర్ కార్యాలయంలో తనకు సెక్యూరిటీ విషయమై అమె పిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.  ఇక్కడే అనుమానాలకు తావిస్తోంది. సురేశ్ లాంటి మతిస్థిమితం తప్పిన రైతులు బెదిరించినంత మాత్రాన ఎమ్మార్వో స్థాయి అధికారి తన భద్రత కోసం జిల్లా కలక్టర్ వద్దకు పిర్యాదు చేయరన్న వాదనలు వినబుడుతున్నాయి. అయితే సురేశ్, దుర్గయ్యల వెనుకునున్న రియల్ గద్దలు ఈ దారుణానికి పాల్పడి వుంటాయన్న అనుమానాలు వినబడుతున్నాయి.

భూ వివాదాన్ని పరిష్కరించకపోవడంతో తహసీల్దార్‌ ఎదుటే ఆత్మహత్య చేసుకోవాలని సురేశ్‌ను పంపించి ఉంటారని.. అయితే, తీవ్ర వాగ్వివాదం జరగడంతో క్షణికావేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిజానికి అంతకు ముందెప్పుడూ సురేశ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి సురేశ్‌కు అసలు అవగాహనే లేదంటున్నారు. మతిస్థిమితం లేని సురేశ్‌ ఎవరైనా రెచ్చగొట్టగానే రెచ్చిపోతాడని, అతడి బలహీనతను ఎవరో ఇలా వాడుకుని ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేయించారని నిందితుడు సురేశ్ తల్లి కూర పద్మ పేర్కొంది. ఇంతటి ఘాతుకానికి పాల్పడే ధైర్యం అతడికి లేదని ఆమె తెలిపింది. అసలేం జరిగిందీ.? వెనుకున్నదెవరన్న అంశాలను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaya Reddy  Tehsildar attack  Abdullapurmet MRO  Suresh  Durgaiah  realtors skecth  Telangana Crime  

Other Articles