Is YS Jagan agenda only the power.? ఓట్లు, నోట్లు, అధికారమే జగన్ పరమావధా.?

Why ys jagan targets pawan kalyan personally

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, Jagan, YS Jagan, jagan comments, pawan kalyan critises jagan, west godavari, bhimavaram, leg injury, pawan kalyan porata yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Why Leader of the opposition YS Jagan targets Jana Sena Chief Pawan Kalyan, attacks him with personally.. even when power star is proving the ruling party policies wrong.

పవన్ పంథా మార్చడంతో దిక్కుతోచక.. జగన్ ఇలా..

Posted: 07/26/2018 05:10 PM IST
Why ys jagan targets pawan kalyan personally

రెండు వందల రోజులకు పైగా ప్రజాప్రస్తానం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ లభిస్తుందన్న తరుణంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రత్యర్థులపై ఆయన సంధిస్తున్న వ్యక్తిగత విమర్శనాస్త్రాలు ఆయనను వారిక దూరం చేస్తున్నాయా.? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణ నంద్యాల ఉపఎన్నిక. ఎన్నికల ప్రచారంలో పది రోజులు పాటు అక్కడే మకాం వేసి వీధివీధినా, గ్రామగ్రామన ప్రచారం చేసినా.. గెలుపు మాత్రం అధికార పార్టీనే వరించింది. అయినా ఆయన తన తప్పును తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదా.? అంటే.. ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.

అధికార టీడీపీపై ప్రజల్లో వున్న వ్యతిరేకతను తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభ ద్వారా ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ను ప్రతిపక్ష హోదాలో వున్న పార్టీ తమకు మిత్రుడు లభించాడని అనందించాల్సింది పోయి.. ఇలా వ్యక్తిగత విమర్శలు చేసి ఎందుకు మకిలిని అంటించుకుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికార పక్షాన్ని వ్యతిరేకించే విపక్ష పార్టీలతో గొంతు కలపడంతో బలం పెరుగుతుంది.. వారు చేసే విమర్శలు, అరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశముంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

నాలుగేళ్ల పాటు అధికార టీడీపీ పార్టీతో జతకలసిన తరువాత.. ప్రజలకిచ్చిన హామీలను పూర్తి చేయడంలో విఫలమైన అధికార టీడీపీని తూర్పారబట్టిన పవన్ కల్యాన్ ను తమ పక్షానికి తీసుకోవాల్సిన ప్రతిపక్షం.. ఏకంగా జనసేనానిపై వ్యక్తిగత విమర్శలకు ఎందుకు పాల్పడిందన్నది అర్థంకాని ప్రశ్న. టీడీపీ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో కలిపిందన్న తరువాత.. పవన్ టీడీపీకి చేసిన సూచన మేరకు కదిలిన వెఎస్సార్ పార్టీ.. ఆ తరువాత వచ్చిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడతామని ముందుకువచ్చి అడుగుముందుకేసింది.

రాష్ట్రానికి ప్రత్యేకహోదాను కల్పించాలన్న డిమాండ్ తో పార్లమెంటు ఉభయసభలను స్థంభింపజేసింది. వైసీపీ వరుసగా పలుమార్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం లోక్ సభ స్పీకర్ మద్దతు సభ్యుల లెక్కింపు ప్రక్రియకే అవరోధాలు ఏర్పడటం.. ఫలితంగా సభ సమావేశాలు పూర్తిగా వాయిదా పడటం తెలిసిందే. దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత కానీ ఇలా పార్లమెంటు సమావేశాలు పూర్తిగా వాయిదాలకే పరిమితమైన విషయాన్ని కూడా పత్రికలలో పతాకశీర్షికలకెక్కింది.

ఈ సమయంలో అవిశ్వాస తీర్మాణాలు కోనసాగుతున్న సమయంలోనే ఇక రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాన్ తమకు మద్దుతిస్తారంటూ వైసీపి ఎంపీ వరప్రసాద్ ఢిల్లీలోనే ప్రకటించారు. ఈ మేరకు ఒక రోజున తాను పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యానని, అప్పుడు తనను వైసీపీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారని, తనకు ఎవరూ శత్రువులు కాదని చెప్పారని, అవసరమైన పక్షంలో రానున్న ఎన్నికల తరువాత మీకు మిత్రపక్షంగా వ్యవహరించడానికి కూడా సిద్దమని పవన్ చెప్పారని వరప్రసాద్ వెల్లడించారు.

ఆ తరువాత ఇటు పవన్ కల్యాణ్ కానీ, అటు జగన్ కానీ పరస్పర విమర్శలకు వెళ్లకుండా.. తమ టార్గెట్ అధికార పక్షమైన టీడీపీపైనే గురిపెట్టారు. కాగా, ఉత్తరాంధ్ర పోరాట యాత్ర క్రమంలో ఆ ప్రాంత వెనుకబాటు తనానికి గత పాలకుల నిర్లక్ష్యం కూడా కారణమని పవన్.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గతంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఇచ్చిన బంద్ పిలుపులకు రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు మద్దతును తెలిపాయి. అప్పటికీ తాను బంద్ లకు వ్యతిరేకమని అయినా ప్రజావాణి బలంగా వెళ్లేందుకు మద్దతు తెలుపుతున్నానని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు.

ఈ క్రమంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు వామపక్ష పార్టీలతో పాటు జనసేన పార్టీ కూడా దూరంగా వుంది. రాష్ట్రబంద్ పలుచోట్లు సంపూర్ణంగా, పలు ప్రాంతాల్లో పాక్షికంగా జరిగినా.. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగానే ముగిసింది. ఆ తరుణంలో అదే రోజు సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అటు ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే పవన్ కల్యాన్ పై వ్యక్తిగత విమర్శలను ఎక్కుపెట్టారు. తన ధోరణి ఏంటన్న విషయాన్ని ముందుగానే స్పష్టం చేసినా.. అదే పెద్ద విషయంగా భావించి పవన్ పై విమర్శలు చేయడం సముచితమేనా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అయితే తొలుత పవన్ కల్యాన్ ను, ఆయన పార్టీని తక్కువగా అంచనా వేసిన జగన్.. ఆయన సభలకు ఎలాంటి పెట్టుబడులు లేకుండా.. నేతలకు వ్యయప్రయాసలు లేకుండా పెద్ద సంఖ్యలో యువత రావడం.. నిరసన కవాతులన్నీ విజయవంతం అయ్యాయి. అంతేకాదు.. ఫలానా సమస్య వుందంటూ ఆయా సమస్యను ఎదుర్కోంటున్న వారు పవన్ కల్యాన్ వద్దకు నేరుగా వెళ్లి కలుస్తుండటం.. ఆయన నాయకత్వాన్ని, అయన పార్టీని బలోపేతం చేస్తుంది. ఆయన పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. పవర్ స్టార్ గుప్పిస్తున్న ప్రశ్నలు.. జనంలోకి సూటిగా దూసుకెళ్తున్నాయి.

ఈ క్రమంలో ఇన్నాళ్లుగా తాను టీడీపీపై విమర్శలు ఎక్కు పెడుతుండగా, ఇప్పుడు పవన్ కూడా తన పంథాను మార్చి టీడీపీని.. ప్రజలు హర్షించే విధంగా విమర్శలు చేయడంతో.. అతనికే ఎక్కువ ఆదరణ లభిస్తుందని గుర్తించని జగన్ పవన్ ను టార్గెట్ చేశారా.? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక పవన్ ను నిజంగా విమర్శించడానికి జగన్ సహా ఆయన వెనుకనున్న పార్టీ మేధావి వర్గం చాలానే కష్టపడాల్సి వచ్చివుంటుంది. పవన్ ను అబాసుపాలు చేయడానికి ఆయనకున్న మైనస్ పాయింట్లు వెతకడమే కష్టమైవుంటుంది.

ఎందుకంటే..
* పవన్ కల్యాన్ తనకు సినిమాల ద్వారా వస్తున్న డబ్బును వద్దనుకున్నారు.. కానీ జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న అభియోగాలు వున్నాయి.
* పవన్ రాజకీయాలో సామాజిక మార్పు.. తీసుకురావాలని భావిస్తున్నారు.. కానీ జగన్ పార్టీలో సీనియర్లకు, సిన్సియరిటీకి చోటులేదన్న విమర్శలున్నాయి.
* పవన్ కల్యాణ్ తన పార్టీ అధికారంలోకి వచ్చినా.. రాకపోయినా అని ప్రచారం కోనసాగిస్తుండగా, జగన్ మాత్రం కాబోయే ముఖ్యమంత్రిని అని బాహాటంగా ప్రకటించుకుంటున్నారు.
* పవన్ ప్రభుత్వ పాలనలో పారదర్శకత్వను తీసుకురావాలని భావిస్తుండగా, జగన్ పార్టీలోనే పారదర్శకత లేదని పార్టీని వీడిన నేతలు పేర్కోన్న విషయం తెలిసిందే.
* పవన్ ప్రజల సేవ చేసి రుణం తీర్చుకుంటానని చెబుతుండగా, జగన్ మాత్రం అధికారమే పరమావధిగా అడుగులు వేస్తున్నారు.
* పవన్ జనసేన తన పార్టీ ఆరు సిద్దాంతాలకు కట్టుబడి వుంటుందని ప్రకటించగా, జగన్ పార్టీ మాత్రం విమర్శలకే ప్రాధాన్యత.. సిద్దాంతాల ఊసే లేదు.

ఈ క్రమంలో పవన్ ను విమర్శించేందుకు ఏ అంశాలు లభించక వైసీపీ నేతలు.. అటు తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యాన్ని టార్గెట్ చేయడం లేదా ఇటు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇలా ఒక పార్టీ అధినేత మరో పార్టీ అధినేతను టార్గెట్ చేయడం పట్ల జగన్ బిందెడు అమృతంలో ఒక బింధువు విషం కలపడమేనని.. ఆయన ఇన్నాళ్లు అధికారం కోసం పడిన ప్రయాసంతా బూడిదలో పోసిన పన్నీరైందని.. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రజాసంకల్పయాత్రలో తమ నేతలు, పార్టీ క్రీయాశీలక కార్యకర్తలు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేపడుతున్నారు. భారీ జనసందోహాన్ని చూసి వీరందరూ ఓట్లు వేయించుకోగలిగితే తాము తప్పక అధికారంలోకి వస్తామని వైసీపీ నేతలు భావించి.. ఇక తమకు ఎవరి మద్దతు వద్దని పవన్ ను టార్గెట్ చేస్తున్నారా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే గత ఎన్నికలకు ముందు జగన్ ఓదార్పు యాత్ర చేసి.. పెద్ద ఎత్తున అభిమానులను కలసి వారికి తానున్నానన్న భరోసా కల్పించినా.. ప్రతిపక్షం స్థానమే లభించిన విషయాన్ని మర్చిపోరాదన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  disappropriate assets case  YS Jagan  porata yatra  andhra pradesh  politics  

Other Articles