live proceeding of parliament stoped ఈ పేజీని కూడా రాష్ట్ర విభజన సిరాతోనా...!

Live proceeding of parliament stoped on air one again

parliament session, monsoon season, rajya sabha, lok sabha, speaker sumitra mahajan, vice chairman, venkaiah naidu, state bifurfication bill, state re_organisation bill, AP special status , APSCS, UPA, NDA, live telecast, live proceedings, politics

Members raise slogans in Rajya Sabha, Vice President asks the proceedings to go ahead in-camera. The proceedings are televised. I will look into it, the Speaker sumitra mahajan assures.

ఈ పేజీని కూడా రాష్ట్ర విభజన సిరాతోనా..!

Posted: 07/23/2018 03:11 PM IST
Live proceeding of parliament stoped on air one again

దేశ జాతీయ రాజకీయాలను అవపోసన పట్టిన వాళ్లు తక్కువే అయినా.. ప్రస్తుతం అందుబాటులో వున్న సాంకేతిక విప్లవంతో ఏ సమాచారమైనా.. ఎన్నాళ్ల, ఎన్నేళ్ల తరువాతైనా అందుబాటులోకి వుండనున్నాయి. ఇప్పటికే గత నెల 25వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ.. మాజీ ప్రధాని ఇందిరాగాందీ విధించిన ఎమర్జెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసి.. అప్పటి ఎమర్జెన్సీ చీకలు రోజులని.. తాము మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని చెప్పుకోచ్చిన విషయం.. చరిత్రలో ఒక పేజీని సొంత చేసుకుంది. ఇదే క్రమంలో పార్లమెంటు తలుపులు మూసి, లైవ్ కార్యక్రమాలను నిలిపేసి.. రాష్ట్ర విభజనను కానిచ్చేశారని..  ఇది అత్యంత దారుణమని కూడా ప్రధాని నరేంద్రమోడీ గతంలో వ్యాఖ్యానించారు.

సీన్ కట్ చేస్తే.. తలుపులు మూసివేయకున్నా.. మళ్లీ పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి మాత్రం బ్రేకులు పడ్డాయి. నాలుగున్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో అర్థరాత్రి వరకు సాగిన సమావేశాల నేపథ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకుంటున్న ఉద్విగ వాతవరణం నేపథ్యంలో అప్పట్లో ఈ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఇది దేశ పార్లమెంటు చరిత్రంలో ఒక గుర్తిండిపోయే అంశం. మరి తాజాగా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నా.. అరగంట పాటు లైవ్ కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. ఇది మరో గుర్తిండిపోయే అంశం.

ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. తన హయాంలో నోట్ల రద్దుతో అంతకుమించిన అత్యంత దారుణమైన పరిస్థితులను కల్పించారని ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్న క్రమంలో.. ఇక పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సభలో కొనసాగుతున్నా.. వాటిని ప్రజలకు చేరవేయనీయకుండా నిలిపివేసి.. అప్పటి యూపీఏ చేసిన పనినే మళ్లీ చేశారు. అప్పడున్న పరిస్థితులు వేరు. కానీ ఇవాళ ఎందుకు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారంటే మాత్రం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎదుట రాజకీయం తప్ప మరో సమాధానమే లేదు. సభను సజావుగా సాగినివ్వాలన్న సమాధానం చెప్పినా.. దానికి సభ ప్రసారాల నిలిపివేతకు మాత్రం ఇది పరిష్కారం కాదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

టీడీపీ, వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ వెంకయ్యనాయుడు సుమారు 30 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించారు. అంతకుముందు అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితి ఎదురుకాగా, స్పీకర్ సుమిత్రా మహజన్.. సమావేశాలను లైవ్ ను పునరుద్దరించాలని, ఈ అంశాన్ని తాను పర్యవేక్షిస్తానని అన్నారు. దీంతో లోక్ సభ ప్రసారాలు నిలిపివేసిన తరువాత వెంటనే ప్రారంభమయ్యాయి. కానీ రాజ్యసభలో మాత్రం సుమారు అరగంట తరువాత పునరుద్దరించారు. ఏపీ సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ సభ్యులు పదే పదే పట్టుబట్టి.. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో.. ఆయన సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయిందారు. అంతేకాదు ‘మీ గోల ఎవరూ వినడంలేదు.. చూడ్డంలేదు, ఇంకా ఎందుకు అరుస్తారంటూ’ ఆయన మండిపడ్డారు.
 
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్యసభలో జరగాల్సిన స్వల్పకాలిక చర్చ రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో రేపు సభలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుయో నన్న అసక్తిరేకెత్తుతుంది. ఇదిలావుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం లైవ్ ప్రసారాల నిలిపివేతకు పాల్పడిన ఎన్డీయే కు కూడా యూపిఏకు అంటిన మకిలీ అంటిందని, ఈ చరిత్రను కూడా రాష్ట్ర విభజన సిరాతోనే ఎన్డీయే రాస్తుందా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి రేపు రాజ్యసభలో ఎలాంటి వాతావరణం ఉత్పన్నమవుతుందో వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament  rajya sabha  lok sabha  sumitra mahajan  venkaiah naidu  state bifurfication bill  

Other Articles