congress suspect criminal intentions behind rahuls' incidents కన్నా.. అమితే షాదేనా.. రాహుల్ ది కూడానా.?

Congress suspect criminal intentions behind rahuls incidents

congress, rahul gandhi, gujarat elections, karnataka elections, private chopper, amit shah, tirumala, alipiri, kanna lakshmi narayana, andhra pradesh, politics

Telugu states congress leaders too suspects criminal intentions behind rahul gandhi incidents after ap bjp president alleges criminal conspiracy by the govt on amit shah family visit to tirumala temple.

కన్నా.. అమితే షాదేనా.. రాహుల్ ది కూడానా.?

Posted: 06/11/2018 03:20 PM IST
Congress suspect criminal intentions behind rahuls incidents

ఆంధ్రప్రదేశ్ బీజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను హత్య చేయించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని  ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ తీరుకు నిరసనగా బీజేపీ నేతలు విజయవాడలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కన్నాలక్ష్మీనారాయణ మాట్లాడుతూ అలిపిరిలో షా కుటుంబం పై దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని అన్నారు. నాలుగేళ్లుగా కేంద్రమంత్రులకు, బీజేపీ నేతలకు రెడ్ కార్పెట్ వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం పోలీసులను ప్రయోగిస్తుందని విమర్శించారు.

ఖాకీ డ్రెస్‌ వేసుకుని పసుపు జండా కింద పోలీస్ శాఖ పని చేస్తోందని విమర్శించిన కన్నా.. పోలీసు అధికారుల తీరు దారుణంగా ఉందని, చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా బీజేపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్‌ కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు చంద్రబాబుతో కలిసి పనిచేయడం తమ ఖర్మ అని అన్నారు. చంద్రబాబు గతం గురంచి మోడీ, అమిత్‌ షా తెలుసుకోలేకపోయారని అన్నారు. చంద్రబాబు రాజకీయా జీవితమంతా కుట్ర, వంచనతోనే సాగిందని కన్నా విమర్శించారు.  

ఇంతవరకు సరే కానీ.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మాత్రం అభ్యంతరం చెప్పకుండానే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా కుటుంబానికి వ్యతిరేకంగా నల్లజెండాలు చూపితేనే అది హత్యా అని అరోపిస్తున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు.. తమ అధినేత.. ఐదేళ్ల క్రితం కన్నా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అటు గుజారాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఇటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన దాడులు కూడా హత్యా ప్రయత్నాలేనా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సమయంలో రాహుల్ గాంధీ కాన్వాయ్ పై రాళ్లు రువ్వింది హత్యా ప్రయత్నంలో భాగమేనా.? అంటూ కాంగ్రెస్ నేతలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికలలో కూడా రాహుల్ గాంధీ తన మిత్రులతో కలసి వెళ్లిన ప్రైవేటు విమానం.. ల్యాండింగ్ లో తలెత్తిన సమస్యలు, కుదుపులకు గురైన తీరు కూడా ఆయన హత్యకు చేసిన కుట్రలో భాగమేనా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కన్నాగారూ.. మీ బాస్ విషయంలో జరిగింది హత్యయత్నామే అయితే మాజీ బాస్ విషయంలో జరిగింది కూడా అదేనా..? అంటూ ప్రశ్నలను సంధిస్తున్నారు. మరి బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు దీనిపై ఎలా స్పందిస్తారో.. అసలు స్పందిస్తారో లేదో..? వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles